Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

నిజం చెప్పడానికి సిగ్గెందుకు?: సూర్యకుమార్‌ యాదవ్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Oct 9, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
suryakumaryadav.jpg

టీమిండియా టీ20 కెప్టెన్‌గా గతేడాది పగ్గాలు చేపట్టిన సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. పూర్తిస్థాయి సారథిగా తొలుత శ్రీలంకతో టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన ఈ ముంబై బ్యాటర్‌.. ఆ తర్వాత కూడా ద్వైపాక్షిక సిరీస్‌లలో భారత్‌ను గెలుపుబాటలో నడిపించాడు.

తాజాగా ఆసియా టీ20 కప్‌-2025 (Asia Cup)లో అజేయంగా ఫైనల్‌కు చేర్చిన సూర్య... టైటిల్‌ పోరులో దాయాది పాకిస్తాన్‌ను ఓడించి టీమిండియాను విజేతగా నిలిపాడు. కెప్టెన్‌గా ఈ మేరకు విజయవంతమవుతున్నా.. బ్యాటర్‌గా మాత్రం సూర్య రోజురోజుకూ గడ్డు పరిస్థితుల్లో కూరుకుపోతున్నాడు.

ఐపీఎల్‌లో అదరగొట్టినా...
ఐపీఎల్‌-2025లో ముంబై ఇండియన్స్‌ (Mumbai Indians) తరఫున అదరగొట్టిన సూర్య.. సగటు 65తో ఏకంగా 717 పరుగులు రాబట్టాడు. కానీ టీమిండియా తరఫున మాత్రం బ్యాట్‌తో రాణించలేకపోయాడు. ముఖ్యంగా ఆసియా కప్‌ టోర్నీలో ఏడు మ్యాచ్‌లలో కలిపి సూర్య సాధించిన పరుగులు కేవలం 72. సగటు 18. స్ట్రైక్‌రేటు 101.41. అంతకు ముందు కూడా అంతర్జాతీయ టీ20లలో సూర్య పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.

నిజం చెప్పడానికి సిగ్గెందుకు?
ఈ నేపథ్యంలో తన ఫామ్‌లేమి గురించి సూర్యకుమార్‌ యాదవ్‌ తాజాగా స్పందించాడు. ‘‘నిజం చెప్పడానికి సిగ్గుపడాల్సిన పనిలేదు. ఆసియా కప్‌ టోర్నీని నేను మెరుగ్గానే ఆరంభించాను. 40 పరుగుల వరకు చేయగలిగా. ఆ తర్వాత కూడా నా బ్యాటింగ్‌ బాగానే ఉంది.

కానీ పరుగులు మాత్రం రాబట్టలేకపోయాను. మ్యాచ్‌కు సన్నద్ధమయ్యే తీరు, ప్రక్రియలో నేను ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉంటాను. సరైన దారిలో నడుస్తున్నపుడు ఒక్కోసారి పరుగులు రాకపోయినా పెద్దగా ఆందోళన పడకుండా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వాటిని సరిచేసుకుంటే సరి.

జట్టుపై ప్రభావం పడకుండా..
ఏదేమైనా నా ఫామ్‌ జట్టుపై ప్రభావం చూపనంత వరకు పెద్దగా బెంగ పడాల్సిన అవసరం లేదు. అయితే, మా జట్టు ప్రస్తుతం అదరగొడుతోంది. సూపర్‌ ఫామ్‌లో ఉంది. డ్రెసింగ్‌రూమ్‌లో వాతావరణం గొప్పగా ఉంటుంది.

నా ఫామ్‌ ప్రభావం​ జట్టుపై పడకుండా.. విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లడంపై మాత్రమే నేను దృష్టి సారిస్తాను’’ అని సూర్యకుమార్‌ యాదవ్‌ పేర్కొన్నాడు. విమల్‌ కుమార్‌ యూట్యూబ్‌ చానెల్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. 

లేటు వయసులో అరంగేట్రం
కాగా సూర్యకుమార్‌ తదుపరి ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో బిజీకానున్నాడు. అక్టోబరు 29- నవంబరు 8 మధ్య భారత్‌- ఆస్ట్రేలియా మధ్య ఈ సిరీస్‌కు షెడ్యూల్‌ ఫిక్స్‌ అయింది.

ఇక 2021లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన 35 ఏళ్ల సూర్య.. ఇప్పటి వరకు 90 టీ20లు, 37 వన్డేలు, ఒక టెస్టు ఆడాడు. టీ20లలో నాలుగు శతకాల సాయంతో 2670 పరుగులు సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. వన్డేల్లో 773, టెస్టుల్లో 8 పరుగులు చేయగలిగాడు. ఐపీఎల్‌లో ఇప్పటికి 166 మ్యాచ్‌లు ఆడి 4311 పరుగులు చేశాడు.

చదవండి: ఫిట్‌గానే ఉన్నా.. అందుకే నన్ను సెలక్ట్‌ చేయలేదు: స్పందించిన షమీ

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
suryakumar yadav
Asia Cup 2025
india vs australia
team india captain
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

శ్రేయస్‌ అయ్యర్‌కు ఘోర అపఖ్యాతి

శ్రేయస్‌ అయ్యర్‌కు ఘోర అపఖ్యాతి

ముంబైకి సూర్య గుడ్‌బై!.. గంభీర్‌తో కలిసి ఆ జట్టులోకి?!

ముంబైకి సూర్య గుడ్‌బై!.. గంభీర్‌తో కలిసి ఆ జట్టులోకి?!

మొన్న బీసీసీఐ.. ఇవాళ ముంబై ఇండియ‌న్స్‌!

మొన్న బీసీసీఐ.. ఇవాళ ముంబై ఇండియ‌న్స్‌!

కెప్టెన్‌ అయ్యాక శ్రేయస్‌ అయ్యర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

కెప్టెన్‌ అయ్యాక శ్రేయస్‌ అయ్యర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

టీ20 కెప్టెన్సీపై శ్రేయ‌స్ అయ్య‌ర్‌ తొలి స్పంద‌న‌!

టీ20 కెప్టెన్సీపై శ్రేయ‌స్ అయ్య‌ర్‌ తొలి స్పంద‌న‌!

 కెప్టెన్సీ తెచ్చిన జోష్‌.. శ్రేయ‌స్ అయ్య‌ర్ విధ్వంసం!

కెప్టెన్సీ తెచ్చిన జోష్‌.. శ్రేయ‌స్ అయ్య‌ర్ విధ్వంసం!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.