Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

పదిహేనేళ్ల కరువు తీరింది: వెస్టిండీస్‌కు ఊహించని షాక్‌.. పట్టికలోనూ తారుమారు

Sports Sakshi User Sakshi Sakshi Time Dec 4, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
bangla.jpg

వెస్టిండీస్‌తో రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ చారిత్రాత్మక విజయం సాధించింది. ఆతిథ్య విండీస్‌ను ఏకంగా 101 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా కరేబియన్‌ గడ్డపై పదిహేనేళ్లలో తొలి టెస్టు గెలుపు నమోదు చేసింది. అంతేకాదు.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ) 2023-25 పాయింట్ల పట్టికలో వెస్టిండీస్‌ను వెనక్కినెట్టింది.

కరేబియన్‌ పర్యటనలో బంగ్లాదేశ్‌
కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు బంగ్లాదేశ్‌ కరేబియన్‌ పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య ఆంటిగ్వా వేదికగా తొలి టెస్టు జరగగా.. ఆతిథ్య వెస్టిండీస్‌ 201 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

జమైకాలో రెండో టెస్టు
అయితే, రెండో టెస్టులో మాత్రం బంగ్లాదేశ్‌ వెస్టిండీస్‌కు ఊహించని షాకిచ్చింది. జాకర్‌ అలీ బ్యాట్‌తో, తైజుల్‌ ఇస్లాం బాల్‌తో చెలరేగడంతో బ్రాత్‌వైట్‌ బృందాన్ని మట్టికరిపించింది. జమైకా వేదికగా శనివారం నుంచి మంగళవారం (నవంబరు 30- డిసెంబరు 3) వరకు జరిగిన ఈ మ్యాచ్‌లో.. టాస్‌ గెలిచిన బంగ్లా తొలుత బ్యాటింగ్‌ చేసింది.

బ్యాటర్లంతా నామమాత్రపు స్కోర్లకే పరిమితం కావడంతో తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఓపెనర్‌ షాద్‌మన్‌ ఇస్లాం(64), కెప్టెన్‌ మెహదీ హసన్‌ మిరాజ్‌(36) రాణించడంతో ఈ మేర స్కోరు సాధించింది. 

నహీద్‌ రాణా ఐదు వికెట్లతో చెలరేగడంతో
ఇందుకు బదులిచ్చేందుకు రంగంలోకి దిగిన విండీస్‌ జట్టు.. 146 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా యువ పేసర్‌ నహీద్‌ రాణా ఐదు వికెట్లతో చెలరేగి వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు.

ఈ క్రమంలో.. 18 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన బంగ్లాదేశ్‌.. 268 పరుగులు సాధించింది. కెప్టెన్‌ మెహదీ హసన్‌ మిరాజ్‌ 42 పరుగులతో రాణించగా.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జాకర్‌ అలీ 91 పరుగులతో దుమ్ములేపాడు. ఈ నేపథ్యంలో పర్యాటక బంగ్లాదేశ్‌ విండీస్‌ ముందు 287 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

ఈసారి ఐదేసిన తైజుల్‌ ఇస్లాం
అయితే, టార్గెట్‌ను ఛేదించే క్రమంలో వెస్టిండీస్‌ను ఆరంభం నుంచే బంగ్లా బౌలర్లు తిప్పలు పెట్టారు. ముఖ్యంగా స్పిన్నర్‌ తైజుల్‌ ఇస్లాం ఓపెనర్లలో మైకైల్‌ లాయీస్‌(6)తో పాటు.. కెప్టెన్‌ బ్రాత్‌వైట్‌(43)లను అవుట్‌ చేసి వికెట్ల పతనానికి నాంది పలకగా.. పేసర్లు టస్కిన్‌ అహ్మద్‌, హసన్‌ మహమూద్‌, నహీద్‌ రాణా అతడికి సహకారం అందించారు.

సిరీస్‌ సమం.. 
ఇక విండీస్‌ బ్యాటర్లలో కేవం హోడ్జ్‌(55) అర్ధ శతకంతో కాసేపు పోరాడే ప్రయత్నం చేయగా.. తైజుల్‌ ఇస్లాం అతడిని పెవిలియన్‌కు పంపి మరోసారి దెబ్బ కొట్టాడు. ఇక నహీద్‌ రాణా షమార్‌ జోసెఫ్‌(8)ను పదో వికెట్‌గా వెనక్కి పంపడంతో విండీస్‌ కథ ముగిసిపోయింది. 185 పరుగులకే వెస్టిండీస్‌ ఆలౌట్‌ కాగా.. బంగ్లా 101 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా సిరీస్‌ను 1-1తో సమం చేసింది. 

ఇక బంగ్లా బౌలర్లలో ప్లేయర్‌ ‘ఆఫ్‌ ది మ్యాచ్‌’ తైజుల్‌ ఇస్లాం ఏకంగా ఐదు వికెట్లు దక్కించుకోగా.. టస్కిన్‌ అహ్మద్‌, హసన్‌ మహమూద్‌ తలా రెండు, నహీద్‌ రాణా ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.

పాయింట్ల పట్టికలోనూ తారుమారు
ఇక విండీస్‌పై విజయంతో బంగ్లాదేశ్‌ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి చేరగా.. వెస్టిండీస్‌ తొమ్మిదో స్థానానికి పడిపోయింది. టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్‌ టాప్‌-5లో ఉన్నాయి.

చదవండి: వినోద్‌ కాంబ్లీని కలిసిన సచిన్‌.. చేయి వదలకుండా బిగించడంతో.. ఆఖరికి

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
West Indies vs Bangladesh
test series
Taijul Islam
Kraigg Brathwaite
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

శ్రీలంకకు భారీ షాక్‌!

శ్రీలంకకు భారీ షాక్‌!

స్లో ఓవర్‌రేట్‌ దెబ్బ.. ఇంగ్లండ్‌కు భారీ షాక్‌!

స్లో ఓవర్‌రేట్‌ దెబ్బ.. ఇంగ్లండ్‌కు భారీ షాక్‌!

జో రూట్ ఒంట‌రి పోరాటం.. ఇంగ్లండ్ గెలిస్తే చ‌రిత్రే!

జో రూట్ ఒంట‌రి పోరాటం.. ఇంగ్లండ్ గెలిస్తే చ‌రిత్రే!

హెన్రీల చేతిలో ఇంగ్లండ్‌కు చావుదెబ్బ.. కివీస్‌కు భారీ ఆధిక్యం

హెన్రీల చేతిలో ఇంగ్లండ్‌కు చావుదెబ్బ.. కివీస్‌కు భారీ ఆధిక్యం

ఇంగ్లండ్‌ తుది జట్టు ప్రకటన.. ఇద్దరి అరంగేట్రం

ఇంగ్లండ్‌ తుది జట్టు ప్రకటన.. ఇద్దరి అరంగేట్రం

ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ నామినీస్‌ పేర్ల ప్రకటన

ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ నామినీస్‌ పేర్ల ప్రకటన

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.