Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

గిల్‌, సూర్య కలిసి వరల్డ్‌కప్‌ గెలిపిస్తారు: అభిషేక్‌ శర్మ

Sports Sakshi User Sakshi Sakshi Time Dec 15, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
abhishekgill.jpg

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో టీమిండియా నాయకుడు సూర్యకుమార్‌ యాదవ్‌ బ్యాటర్‌గా విఫలమవుతూనే ఉన్నాడు. ఒకప్పుడు ప్రపంచంలోనే నంబర్‌ వన్‌గా ఉన్న అతడు.. ఇప్పుడు కనీసం పట్టుమని పది పరుగులు చేసేందుకు కూడా శ్రమించాల్సి వస్తోంది.

కెప్టెన్‌, వైస్‌ కెప్టెన్‌ ఫెయిల్‌
సూర్య సంగతి ఇలా ఉంటే.. వైస్‌ కెప్టెన్‌గా రీఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి ఓపెనర్‌గా శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) కూడా వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు. దాదాపు గత ఇరవైకి పైగా ఇన్నింగ్స్‌లో అతడు కనీసం హాఫ్‌ సెంచరీ కూడా బాదకపోవడం ఇందుకు నిదర్శనం. 

ఈ నేపథ్యంలో నాయకత్వ బృందమే ఇలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌-2026 (T20 WC 2026) నాటికి టీమిండియా పరిస్థితి ఏమిటన్న సందేహాలు వస్తున్నాయి. కెప్టెన్‌గా విజయవంతమవుతున్నందున సూర్యకుమార్‌ (Suryakumar Yadav)పై విమర్శల పదును కాస్త తక్కువగా ఉండగా.. సంజూ శాంసన్‌ను బలి చేసి గిల్‌కు వరుస అవకాశాలు ఇస్తున్నారన్న అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. 

సూర్య, గిల్‌పై నమ్మకం ఉంది
ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో మూడో టీ20లో విజయానంతరం భారత విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ‘‘మీడియా ముఖంగా మీ అందరికీ నేనొక మాట చెబుతా.. గుర్తుపెట్టుకోండి. 

సూర్య, గిల్‌పై నాకు నమ్మకం ఉంది. వీరిద్దరు కలిసి టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో మ్యాచ్‌లు గెలిపించబోతున్నారు. అంతకంటే ముందు ఈ సిరీస్‌లో జట్టును గెలిపిస్తారు.

వీళ్లిద్దరితో కలిసి నేను చాలా కాలంగా ఆడుతున్నా. ముఖ్యంగా.. శుబ్‌మన్‌తో ఆడిన అనుభవం నాకుంది. ఎలాంటి పరిస్థితుల్లో.. అతడు ఎలా ఆడతాడో నాకు తెలుసు. ప్రత్యర్థి ఎవరైనా తన సమయం వచ్చినపుడు అతడు చెలరేగి ఆడతాడు.

త్వరలోనే మీరు కూడా చూస్తారు
సూర్య, గిల్‌ గురించి నాకు తెలుసు. అందుకే వారిపై నాకు అంత నమ్మకం. త్వరలోనే మీరు కూడా ఇది చూస్తారు. ముఖ్యంగా గిల్‌ను విమర్శిస్తున్న వారు.. త్వరలోనే అతడి నైపుణ్యాలను కళ్లారా చూస్తారు’’ అని అభిషేక్‌ శర్మ చెప్పుకొచ్చాడు. అతడి వ్యాఖ్యలపై టీమిండియా అభిమానుల నుంచి సైతం మిశ్రమ స్పందన వస్తోంది.

వరుస వైఫల్యాలు
కాగా అభిషేక్‌ శర్మకు జోడీగా ఓపెనర్‌గా వస్తున్న గిల్‌.. సౌతాఫ్రికాతో ఇప్పటి వరు జరిగిన మ్యాచ్‌లలో చేసిన స్కోర్లు వరుసగా.. 4(2), 0(1), 28 (28). మరోవైపు.. సూర్య చేసిన పరుగులు 12(11), 5(4), 12(11). ఇక అభిషేక్‌ శర్మ తొలి టీ20లో (17), రెండో టీ20లో (17) తడబడ్డా.. మూడో టీ20లో 35(18) మెరుగ్గా రాణించాడు.

ఇదిలా ఉంటే.. కటక్‌లో తొలి టీ20లో గెలిచిన టీమిండియా.. ముల్లన్‌పూర్‌లో మాత్రం సఫారీల చేతిలో ఓడిపోయింది. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో ధర్మశాలలో జయభేరి మోగించి.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో  2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. కాగా ఫిబ్రవరి 7న టీ20 ప్రపంచకప్‌-2026 మొదలుకానుంది. ఈ మెగా టోర్నీకి భారత్‌- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తాయి.

చదవండి: చరిత్ర సృష్టించిన తిలక్‌ వర్మ.. ప్రపంచంలోనే ‘బెస్ట్‌’ ప్లేయర్‌గా..

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
suryakumar yadav
Shubman Gill
Abhishek Sharma
India Vs South Africa
T20 series
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

మిచెల్‌కు గిల్‌ గట్టి సవాల్‌

మిచెల్‌కు గిల్‌ గట్టి సవాల్‌

సంజూను కావాలనే తప్పించారా?

సంజూను కావాలనే తప్పించారా?

భార‌త్‌తో టీ20 సిరీస్‌.. ఇంగ్లండ్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌! యువ సంచలనానికి ఛాన్స్‌

భార‌త్‌తో టీ20 సిరీస్‌.. ఇంగ్లండ్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌! యువ సంచలనానికి ఛాన్స్‌

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌.. వైభవ్‌తో పాటు వీళ్లకు కీలకమే!

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌.. వైభవ్‌తో పాటు వీళ్లకు కీలకమే!

చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్‌

చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్‌

సౌతాఫ్రికాతో మ్యాచ్‌.. బ్యాటింగ్‌ భారత్‌దే! యువ ప్లేయర్‌ డెబ్యూ

సౌతాఫ్రికాతో మ్యాచ్‌.. బ్యాటింగ్‌ భారత్‌దే! యువ ప్లేయర్‌ డెబ్యూ

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.