Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

లేటు వయసులోనూ ఇరగదీస్తున్న స్టార్‌ వెటరన్లు

Sports Sakshi User Sakshi Sakshi Time Jan 17, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
fd.jpg

దిగ్గజ బ్యాటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, జో రూట్‌, స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌ లేటు వయసులోనూ అదిరిపోయే ప్రదర్శనలతో చెలరేగిపోతున్నారు. వీరిలో వార్నర్‌ అయితే మరీనూ. ఈ ఆసీస్‌ విధ్వంసకర ఓపెనర్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించినా ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న బిగ్‌బాష్‌ లీగ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. 

గడిచిన నాలుగు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు, రెండు హాఫ్‌ సెంచరీలతో (130 నాటౌట్‌, 67 నాటౌట్‌, 82, 110 నాటౌట్‌) పట్టపగ్గాల్లేకుండా ఉన్నాడు. తాజా సెంచరీతో వార్నర్‌ భాయ్‌ టీ20ల్లో అత్యంత అరుదైన ఘనత సాధించాడు. క్రిస్‌ గేల్‌ (22), బాబర్‌ ఆజమ్‌ (11) తర్వాత రెండంకెల సెంచరీ మార్కును (10) తాకిన మూడో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.

మరో ఆసీస్‌ వెటరన్‌, టెస్ట్‌ ప్లేయర్‌గా ముద్ర పడిన స్టీవ్‌ స్మిత్‌ అయితే ఫార్మాట్లకతీతంగా రెచ్చిపోతున్నాడు. ఇటీవల యాషెస్‌ సిరీస్‌లో అద్భుత శతకం బాదిన అతను.. తాజాగా బిగ్‌బాష్‌ లీగ్‌లో అదిరిపోయే విధ్వంసకర శతకం బాదాడు. వార్నర్‌ తాజా సెంచరీ చేసిన మ్యాచ్‌లోనే స్టీవ్‌ కూడా శతక్కొట్టాడు. ఈ మ్యాచ్‌లో స్టీవ్‌ కేవలం 41 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి బిగ్‌బాష్‌ లీగ్‌ చరిత్రలో రెండో వేగవంతమైన శతకాన్ని నమోదు చేశాడు.

ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ దిగ్గజం జో రూట్‌ గురించి అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో ఎవరికీ సాటిరాని విధంగా టెస్ట్‌ల్లో వరుస సెంచరీలతో దూసుకుపోతున్నాడు. గత ఐదేళ్లలో అతను టెస్ట్‌ల్లో ఏకంగా 24 సెంచరీలు బాదాడు. వన్డేల్లోనూ మూడు శతకాలు చేశాడు. తాజాగా అతను ఆస్ట్రేలియా గడ్డపై రెండు సెంచరీలతో సత్తా చాటాడు.

టీమిండియా దిగ్గజాలు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి సైతం లేటు వయసులో ఇరగదీస్తున్నారు. టీ20, టెస్ట్‌ ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఈ ఇద్దరు.. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్‌ల్లో చెలరేగిపోయారు. ముఖ్యంగా విరాట్‌ కోహ్లి వయసుతో సంబంధం లేకుండా ఆడుతున్న ప్రతి మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ సహా విజయ్‌ హజారే ట్రోఫీలో సెంచరీ చేసిన రోహిత్‌.. సౌతాఫ్రికాపై 2, ఆస్ట్రేలియాపై మరో హాఫ్‌ సెంచరీతో సత్తా చాటాడు.

విరాట్‌ కోహ్లి విషయానికొస్తే.. గతేడాది ఛాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకున్న ఇతను, ఆస్ట్రేలియా పర్యటనలో తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌటై అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. చాలామంది విరాట్‌ పని అయిపోయిందని కూడా అనుకున్నారు. ఈ దశలో విరాట్‌ అనూహ్యంగా పుంజుకొని సెంచరీల మీద సెంచరీలు బాదుతూ కెరీర్‌ పీక్స్‌లో ఉన్నప్పటి విరాట్‌ను గుర్తు చేస్తున్నాడు. విరాట్‌ గత 8 ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలు, 4 అర్ద సెంచరీలు చేసి అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతున్నాడు.

వీరే కాకుండా ఫాబ్‌ ఫోర్‌లోని మరో వెటరన్‌ స్టార్‌ కేన్‌ విలియమ్సన్‌ కూడా అడపాదడపా సెంచరీలతో సత్తా చాటుతున్నాడు. బ్యాటింగ్‌ విభాగంలో వీరంతా సత్తా చాటుతుంటే, బౌలింగ్‌లో ఒక్కరు మాత్రం ఊహకందని విధంగా చెలరేగిపోతున్నారు. ఆ స్టార్‌ వెటరన్‌ బౌలర్‌ పేరు మిచెల్‌ స్టార్క్‌. స్టార్క్‌ తాజాగా ముగిసిన యాషెస్‌ 2025-26లో 5 మ్యాచ్‌ల్లో 31 వికెట్లు పడగొట్టి, కుర్ర పేసర్లు కూడా సాధ్యం కాని ప్రదర్శనలు చేశాడు. ఈ సిరీస్‌లో అతను బ్యాట్‌తోనూ ఆకట్టుకోవడం మరో విశేషం​.

ప్రస్తుతం జో రూట్‌ వయసు 35, మిచెల్‌ స్టార్క్‌ వయసు 35, స్టీవ్‌ స్మిత్‌ వయసు 36, విరాట్‌ కోహ్లి వయసు 37, రోహిత్‌ శర్మ వయసు 38, డేవిడ్‌ వార్నర్‌ వయసు 39. వీరంతా మహా అయితే కెరీర్‌ను మరో రెండేళ్లు కొనసాగించగలరు. ఇలాంటి దశలో సాధారణ ఆటగాళ్లైతే అడపాదడపా ప్రదర్శనలతో మమ అనిపించే వాళ్లు. కానీ వీళ్లు మాత్రం అలా కాదు. వైన్‌ వయసు పెరిగే కొద్ది మత్తు ఎక్కువగా ఇస్తుందన్నట్టు సత్తా చాటుతున్నారు. 
 

 

 

 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Virat Kohli
rohit sharma
Steve Smith
David warner
joe root
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

షార్ట్‌ వీరోచిత శతకం వృధా.. ఫైనల్లో స్టీవ్‌ స్మిత్‌ జట్టు

షార్ట్‌ వీరోచిత శతకం వృధా.. ఫైనల్లో స్టీవ్‌ స్మిత్‌ జట్టు

కోహ్లి బాటలో సంజూ శాంసన్‌..!

కోహ్లి బాటలో సంజూ శాంసన్‌..!

భార‌త జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. సెంచ‌రీ హీరోకు నో ఛాన్స్‌

భార‌త జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. సెంచ‌రీ హీరోకు నో ఛాన్స్‌

11 ఫోర్లు, 13 సిక్స‌ర్ల‌తో విధ్వంసం.. టీ20 క్రికెట్‌లో సరికొత్త రికార్డు!

11 ఫోర్లు, 13 సిక్స‌ర్ల‌తో విధ్వంసం.. టీ20 క్రికెట్‌లో సరికొత్త రికార్డు!

జో రూట్ ఒంట‌రి పోరాటం.. ఇంగ్లండ్ గెలిస్తే చ‌రిత్రే!

జో రూట్ ఒంట‌రి పోరాటం.. ఇంగ్లండ్ గెలిస్తే చ‌రిత్రే!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.