Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

చరిత్ర సృష్టించిన స్టీవ్‌ స్మిత్‌.. డబుల్‌ సెంచరీ.. తొలి ఆస్ట్రేలియన్‌గా రికార్డు

Sports Sakshi User Sakshi Sakshi Time Feb 10, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
steve.jpg

ఆసీస్‌ తాత్కాలిక సారధి స్టీవ్‌ స్మిత్‌ (Steve Smith) సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్ట్‌ల్లో 200 క్యాచ్‌లు పూర్తి చేసుకున్న తొలి ఆస్ట్రేలియన్‌గా రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్‌లో స్మిత్‌ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో స్మిత్‌ మొత్తం ఐదు క్యాచ్‌లు పట్టుకున్నాడు. స్మిత్‌ క్యాచ్‌ల్లో డబుల్‌ సెంచరీ సాధించే క్రమంలో రికీ పాంటింగ్‌ (Ricky Ponting) రికార్డును అధిగమించాడు. 

🚨 HISTORY BY STEVEN SMITH. 🚨

- Smith becomes the first ever Australian fielder to complete 200 catches in Tests. 🙇‍♂️pic.twitter.com/3T2v9jgcid

— Mufaddal Vohra (@mufaddal_vohra) February 9, 2025

పాంటింగ్‌ 287 ఇన్నింగ్స్‌ల్లో 196 క్యాచ్‌లు అందుకోగా.. స్మిత్ 205 ఇన్నింగ్స్‌ల్లోనే 200 క్యాచ్‌లు పూర్తి చేశాడు. ఆసీస్‌ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్న నాన్‌ వికెట్‌కీపర్ల జాబితాలో స్మిత్‌, పాంటింగ్‌ తర్వాతి స్థానంలో మార్క్‌ వా ఉన్నాడు. మార్క్‌ వా 209 ఇన్నింగ్స్‌ల్లో 181 క్యాచ్‌లు పట్టుకున్నాడు.

ఓవరాల్‌గా ఐదో క్రికెటర్‌
టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఇప్పటివరకు కేవలం ఐదుగురు మాత్రమే 200 క్యాచ్‌లు పూర్తి చేశారు. వీరిలో టీమిండియా గ్రేట్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (Rahu Dravid) 210 క్యాచ్‌లతో (164 టెస్ట్‌ల్లో) అగ్రస్థానంలో ఉండగా.. జో రూట్‌ (152 టెస్ట్‌ల్లో 207), మహేళ జయవర్దనే (149 టెస్ట్‌ల్లో 205), జాక్‌ కల్లిస్‌ (166 టెస్ట్‌ల్లో 200) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు. శ్రీలంకతో మ్యాచ్‌లో స్మిత్‌ కల్లిస్‌ సరసన చేరడంతో పాటు 200 క్యాచ్‌ల క్లబ్‌లో చేరిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. 

అలాగే టెస్ట్‌ల్లో అత్యంత వేగవంతంగా 200 క్యాచ్‌లు పూర్తి చేసిన ఆటగాడిగానూ స్మిత్‌ రికార్డు నెలకొల్పాడు. స్మిత్‌ కేవలం 116 టెస్ట్‌ల్లోనే 200 క్యాచ్‌లు పూర్తి చేశాడు. స్మిత్‌ మరో 11 క్యాచ్‌లు పడితే టెస్ట్‌ల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా రాహుల్‌ ద్రవిడ్‌ రికార్డును బద్దలు కొడతాడు.

లంకతో మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఐదు క్యాచ్‌లు పట్టిన స్మిత్‌.. బ్యాటింగ్‌లోనూ చెలరేగి టెస్ట్‌ల్లో 36వ సెంచరీ నమోదు చేశాడు. ఈ సెంచరీతో స్మిత్‌ టెప్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం స్మిత్‌, జో రూట్‌ తలో 36 సెంచరీలతో సంయుక్తంగా ఐదో స్థానంలో ఉన్నారు. టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సచిన్‌ టెండూల్కర్‌ (51) పేరిట ఉంది.

అంతకుముందు స్మిత్‌ లంకతో జరిగిన తొలి టెస్ట్‌లోనూ సెంచరీ సాధించాడు. ఇదే మ్యాచ్‌లో స్మిత్‌ టెస్ట్‌ల్లో 10000 పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. ఆసీస్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ వ్యక్తిగత కారణాలతో ఈ సిరీస్‌కు దూరం కాగా.. అతని గైర్హాజరీలో స్మిత్‌ ఆసీస్‌ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించాడు. తొలి టెస్ట్‌లోనూ ఘన విజయం సాధించిన ఆసీస్‌.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో ఊడ్చేసింది. ఫిబ్రవరి 12, 14 తేదీల్లో ఆసీస్‌.. శ్రీలంకతో రెండు వన్డేలు ఆడనుంది. 
 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Steve Smith
Ricky Ponting
australia
Sri Lanka
rahul dravid
Catches
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

షార్ట్‌ వీరోచిత శతకం వృధా.. ఫైనల్లో స్టీవ్‌ స్మిత్‌ జట్టు

షార్ట్‌ వీరోచిత శతకం వృధా.. ఫైనల్లో స్టీవ్‌ స్మిత్‌ జట్టు

చారిత్రక విజయం సాధించిన వెస్టిండీస్

చారిత్రక విజయం సాధించిన వెస్టిండీస్

డబుల్‌ సెంచరీ చేజార్చుకున్న గ్రీవ్స్‌.. హోప్‌ శతకం

డబుల్‌ సెంచరీ చేజార్చుకున్న గ్రీవ్స్‌.. హోప్‌ శతకం

దినుషా, మెండిస్ కీలక భాగస్వామ్యం.. శ్రీలంక భారీ స్కోర్‌

దినుషా, మెండిస్ కీలక భాగస్వామ్యం.. శ్రీలంక భారీ స్కోర్‌

శ్రీలంక ఓపెనర్‌ సరికొత్త చరిత్ర

శ్రీలంక ఓపెనర్‌ సరికొత్త చరిత్ర

మాన్‌సూన్‌ మజిలీకి కేరాఫ్‌ అడ్రస్‌..

మాన్‌సూన్‌ మజిలీకి కేరాఫ్‌ అడ్రస్‌..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.