Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

‘మిశ్రమ ఫలితాలు వచ్చాయి’

Sports Sakshi User Sakshi Sakshi Time Oct 9, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
neeraj.jpg

ఈ సీజన్‌పై స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా

వచ్చే ఏడాది మెరుగైన ప్రదర్శన చేస్తానని ఆశాభావం

స్విట్జర్లాండ్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్నట్లు వెల్లడి  

న్యూఢిల్లీ: ఈ ఏడాది స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో కాస్త వెనుకబడ్డ భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా... వచ్చే ఏడాది మెరుగైన ప్రదర్శన చేస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం, 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన నీరజ్‌... ఈ ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించడంలో విఫలమయ్యాడు. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన నీరజ్‌... రిక్తహస్తాలతో వెనుదిరిగాడు. 

ఈ ఏడాదే 90 మీటర్ల మార్క్‌ అందుకున్న నీరజ్‌ చోప్రాకు ఈ సీజన్‌ మిశ్రమ ఫలితాలనిచ్చిoది. ప్రస్తుతం జ్యూరిక్‌లో శిక్షణ పొందుతున్న 27 ఏళ్ల నీరజ్‌ చోప్రా... ఈ ఏడాది తన ప్రదర్శన... రానున్న టోర్నీలకు సన్నద్ధతపై ప్రత్యేకంగా మాట్లాడాడు. యూరప్‌లో శిక్షణ, స్విట్జర్లాండ్‌తో ఉన్న అనుబంధం... ఆ దేశ పర్యాటక శాఖ తనను ‘ఫ్రెండ్‌షిప్‌ అంబాసిడర్‌’గా నియమించడం వంటి వాటిపై నీరజ్‌ అభిప్రాయాలు అతడి మాటల్లోనే...  


» ఈ సీజన్‌లో చాలా సవాళ్లు ఎదురయ్యాయి. వాటి నుంచి ఎంతో నేర్చుకున్నా. ప్రతీ టోర్నమెంట్‌ నా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది. ఆ అనుభవం భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. 
»  ప్రతి అంశంలో మెరుగయ్యేందుకు ఎప్పుడూ అవకాశం ఉంటుంది. ఎప్పటకప్పుడు ప్రేరణ పొందుతూ ముందుకు సాగడమే మన పని.  
» తదుపరి సీజన్‌లో మరింత మెరుగైన ప్రదర్శన చేసి బలంగా తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్నా. ప్రపంచ చాంపియన్‌షిప్‌ సమయంలో వెన్నునొప్పితో ఇబ్బందిపడ్డా. ఇప్పుడు శరీరం ఫిట్‌గా ఉంది. రానున్న టోర్నీల్లో దాని ఫలితం తెలుస్తుంది.  
»  తిరిగి లయ అందుకునేందుకు లుసానే అనువైన ప్రదేశం. ఇక్కడి ప్రకృతి అంటే ఇష్టం. పర్వతాలు, లోయలు మనసుకు ఎంతో అహ్లాదాన్నిస్తాయి. అవి శిక్షణ సమయంలో ఉల్లాసంగా ఉండేందుకు ఉపయోగపడతాయి.  
»  మండు వేసవిలో సైతం ఇక్కడి పచ్చని వాతావరణం... శీతాకాల భావన కల్పిస్తుంది. ఇక్కడ నాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. 2022లో జ్యూరిక్‌లో గెలిచిన డైమండ్‌ లీగ్‌ ట్రోఫీ నాకెంతో ప్రత్యేకం. ఆ తర్వాత 2023 ప్రపంచ చాంపియన్‌షిప్‌ కోసం కూడా ఇక్కడే సాధన చేశా... అప్పుడు పసిడి గెలుచుకున్నా. 
»   డైమండ్‌ లీగ్‌ ట్రోఫీ గెలిచిన తర్వాత నా కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడి ప్రదేశాలు సందర్శించా. ఆ అనుభవం ఎన్నో మధురానుభూతులను అందించింది.  
»   జీవితంలో ప్రతీది అనుకున్నట్లు సాగదని ‘కోవిడ్‌–19’ మహమ్మారితో తెలిసొచ్చి ంది. అప్పటి నుంచి ఆలోచన దృక్పథంలో మార్పు వచ్చింది. పరిస్థితులకు తగ్గట్లు మనల్ని మనం మార్చుకోక తప్పదు. 
»  స్విట్జర్లాండ్‌లో సమయ పాలన తప్పనిసరి. మనకు నచ్చి న సమయంలో నచ్చి న చోటకు వెళ్లాలంటే కష్టం. ప్రజారవాణా వ్యవ్యస్థ చాలా పకడ్బందీగా ఉంటుంది. అందుకే వీలు ఉన్నప్పుడు పర్యటించేందుకు అనుగుణంగా రైలు పాస్‌ల విషయంలో సహాయం చేయమని స్విట్జర్లాండ్‌ పర్యాటక శాఖను అడుగుతుంటా. 
»  స్విట్జర్లాండ్‌తో ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైంది. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నా. నాకు ఇక్కడ చాలా మంది తెలుసు. నా ప్రపంచ అథ్లెటిక్స్‌ ఏజెంట్లు కూడా స్విస్‌కు చెందిన వారే. యూరప్‌లో ఉంటే ఎక్కువగా స్విట్జర్లాండ్‌లోనే ఉంటాను. దీన్ని రెండో ఇల్లు అని పిలవలేను కానీ... తరచుగా వెళ్లేందుకు ఇష్టపడే ప్రదేశం అని మాత్రం చెప్పగలను. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Neeraj Chopra
Mixed results
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

నీరజ్‌కు నాలుగో స్థానం

నీరజ్‌కు నాలుగో స్థానం

నీరజ్‌ సిద్ధం...

నీరజ్‌ సిద్ధం...

దోహా డైమండ్‌ లీగ్‌కు నీరజ్‌ చోప్రా దూరం!

దోహా డైమండ్‌ లీగ్‌కు నీరజ్‌ చోప్రా దూరం!

కోచ్‌కు గుడ్‌బై చెప్పిన నీరజ్‌ చోప్రా

కోచ్‌కు గుడ్‌బై చెప్పిన నీరజ్‌ చోప్రా

‘జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్‌’తో నీరజ్‌ చోప్రా కటీఫ్‌

‘జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్‌’తో నీరజ్‌ చోప్రా కటీఫ్‌

కమలం.. మోదం.. ఖేదం..

కమలం.. మోదం.. ఖేదం..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.