Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

పతనం అంచుల్లో శ్రీలంక క్రికెట్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Feb 26, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Sri-Lanka.jpg

స్వదేశంలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ 2026లో శ్రీలంక జట్టు సూపర్‌-8 దశలోనే నిష్క్రమించి అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ దశలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాలు ఎదుర్కొని ఫ్యాన్స్‌ను ఉసూరుమనిపించింది. 

వాస్తవానికి టోర్నీ ప్రారంభానికి ముందు ఈ జట్టుపై ఓ మోస్తరు అంచనాలు ఉండేవి. హోం అడ్వాంటేజ్‌ కలిసొచ్చి ప్రత్యర్దులను ఇబ్బంది పెడుతుందని అంతా భావించారు. అయితే పరిస్థితి తిరగబడింది. గ్రూప్‌ దశలో పటిష్టమైన ఆస్ట్రేలియాకు షాకిచ్చినా.. సూపర్‌-8కు రాగానే తేలిపోయింది. వరుసగా ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ చేతుల్లో దారుణ పరాజయాలు ఎదుర్కొని టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఆసీస్‌పై గెలుపు మినహా శ్రీలంక గ్రూప్‌ దశలోనూ పెద్దగా చేసిందేమీ లేదు. ఇంకా చెప్పాలంటే తమకంటే చాలా బలహీనమైన జింబాబ్వే చేతిలో ఓటమిపాలై, సొంత అభిమానులచే చీవాట్లు తినింది. సూపర్‌-8 దశలో ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ను బౌలింగ్‌లో కట్టడి చేయగలిగినా.. బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైంది. ఓ మోస్తరు స్కోర్లను ఛేదించలేక చతికిలబడింది. 

తొలుత ఇంగ్లండ్‌, తాజాగా న్యూజిలాండ్‌ మ్యాచ్‌ల్లో ఇదే జరిగింది. ఇంగ్లండ్‌ను 146 పరుగులకు కట్టడి చేసి సంకలు గుద్దుకున్నా, ఆతర్వాత బ్యాటింగ్‌లో చేతులెత్తేసి 95 పరుగులకే కుప్పకూలింది.

న్యూజిలాండ్‌ మ్యాచ్‌లోనూ బౌలర్లు సత్తా చాటి ప్రత్యర్దిని 168 పరుగులకే కట్టడి చేసినా.. ఇంగ్లండ్‌ మ్యాచ్‌ తరహాలోనే ఈ మ్యాచ్‌లోనూ లంక బ్యాటర్లు ఉసూరుమనిపించారు. కనీసం టార్గెట్‌కు దరిదాపుల్లోకి కూడా రాలేక 107 పరుగులకే పరిమితమయ్యారు. 

గ్రూప్‌ దశలో పసికూనలు ఐర్లాండ్‌, ఒమన్‌ మినహా ఈ మెగా టోర్నీలో శ్రీలంక సాధించింది ఏమీ లేదు. ఆసీస్‌పై దక్కిన విజయాన్ని లంక క్రెడిట్‌కు ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే ఆ జట్టు స్టార్లు లేక బలహీనంగా ఉండింది.

మొత్తంగా హోం గ్రౌండ్‌ అడ్వాంటేజ్‌తో సంచలనాలు సృష్టిస్తుందని భావించిన శ్రీలంక సూపర్‌-8 దశలోనే నిష్క్రమించి అభిమానుల ఆశలను అడియాశలు చేసింది. వాస్తవానికి శ్రీలంక పరిస్థితి గత కొంతకాలంగా ఏమంత ఆశాజనకంగా లేదు. గత పదేళ్లకాలంలో ఆ జట్టు అడపాదడపా విజయాలు మినహాయించి ఐసీసీ టోర్నీల్లో ఒక్కసారి కూడా కనీసం సెమీఫైనల్స్‌కు చేరుకోలేదు.

ఆ జట్టు చివరిగా 2011 వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్స్‌ వరకు చేరింది. ఫైనల్స్‌లో భారత్‌ చేతిలో చిత్తై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆతర్వాత వరుసగా జరిగిన 10 ఐసీసీ మెగా టోర్నీల్లో ఒక్కసారి కూడా సెమీస్‌కు చేరుకోలేదు. 2015 వన్డే ప్రపంచకప్‌, 2016 టీ20 ప్రపంచకప్‌, 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ, 2019 వన్డే వరల్డ్‌కప్‌, 2021 టీ20 వరల్డ్‌కప్‌, 2022 టీ20 వరల్డ్‌కప్‌, 2023 వన్డే వరల్డ్‌కప్‌, 2024 టీ20 వరల్డ్‌కప్‌, 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ, తాజాగా టీ20 వరల్డ్‌కప్‌ 2026లో శ్రీలంక సెమీస్‌కు ముందే నిష్క్రమించింది.

ప్రస్తుత శ్రీలంక జట్టు పరిస్థితి చూస్తే.. కొన్నేళ కిందటి వెస్టిండీస్‌ దుస్థితి గుర్తుకు వస్తుంది. విండీస్‌ జట్టు స్టార్లంతా రిటైరయ్యాక ఉనికి ప్రశ్నార్థకంగా మార్చుకుంది. ఆ జట్టు ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుంది. శ్రీలంకను చూస్తే.. విండీస్‌కు పట్టిన గతే పట్టేలా ఉందనిపిస్తుంది. 

లంక జట్టులో టాలెంట్‌కు కొదవ లేకున్నా, నిలకడలేమి పెద్ద సమస్యగా మారింది. నిస్సంక లాంటి ఒకరిద్దరు ఆటగాళ్లు క్రమం తప్పకుండా రాణిస్తున్నా, మిగతా వారి నుంచి వారికి మద్దతు లభించడం లేదు. 

హసరంగ, పతిరణ లాంటి స్టార్‌ బౌలర్లు తరుచూ గాయాల బారిన పడి కీలక మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవడం కూడా ఆ జట్టుకు తలనొప్పిగా మారింది. బౌలింగ్‌లో తీక్షణ, వెల్లాలగే పర్వాలేదనిపించినా, ఆ స్థాయి రాణింపు మ్యాచ్‌లకు గెలిపించదు. 

కుసాల్‌ మెండిస్‌, అసలంక, కమిందు మెండిస్‌, కెప్టెన్‌ షనక లాంటి వారు క్రమం​ తప్పకుండా రాణిస్తేనే శ్రీలంక ఫేట్‌ మారుతుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం సమీప భవిష్యత్తులోనే ఆ జట్టు పసికూన చేతిలో కూడా పరాభవాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
T20 World Cup 2026
Sri Lanka
New Zealand vs Srilanka
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

చారిత్రక విజయం సాధించిన వెస్టిండీస్

చారిత్రక విజయం సాధించిన వెస్టిండీస్

డబుల్‌ సెంచరీ చేజార్చుకున్న గ్రీవ్స్‌.. హోప్‌ శతకం

డబుల్‌ సెంచరీ చేజార్చుకున్న గ్రీవ్స్‌.. హోప్‌ శతకం

దినుషా, మెండిస్ కీలక భాగస్వామ్యం.. శ్రీలంక భారీ స్కోర్‌

దినుషా, మెండిస్ కీలక భాగస్వామ్యం.. శ్రీలంక భారీ స్కోర్‌

శ్రీలంక ఓపెనర్‌ సరికొత్త చరిత్ర

శ్రీలంక ఓపెనర్‌ సరికొత్త చరిత్ర

మాన్‌సూన్‌ మజిలీకి కేరాఫ్‌ అడ్రస్‌..

మాన్‌సూన్‌ మజిలీకి కేరాఫ్‌ అడ్రస్‌..

సూర్యవంశీ విధ్వసం.. 11బంతుల్లో హాఫ్ సెంచరీ

సూర్యవంశీ విధ్వసం.. 11బంతుల్లో హాఫ్ సెంచరీ

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.