Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

చెన్నైతో అశ్విన్‌ కటీఫ్‌!

Sports Sakshi User Sakshi Sakshi Time Aug 9, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
aswin.jpg

జట్టు నుంచి తప్పుకునే యోచనలో స్పిన్నర్‌

చెన్నై: సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఐపీఎల్‌–2026కు ముందు కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. తన సొంత జట్టులాంటి చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) నుంచి అతను తప్పుకోవాలనే యోచనలో ఉన్నాడు. ఈ విషయాన్ని అతను సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌తో ఇప్పటికే చర్చించాడు. ఆటగాళ్లను అట్టిపెట్టుకునే కటాఫ్‌ తేదీకి ముందు సాధారణంగా అన్ని జట్లూ తమ ఆటగాళ్లతో భేటీ అవుతాయి. 

ఇందులో భాగంగానే జరిగిన సమావేశంలో అశ్విన్‌ తన మనసులో మాటను చెప్పాడు. అతని నిర్ణయం వెనుక కారణాలు తెలియకపోయినా... త్వరలోనే దీనిపై సీఎస్‌కే స్పష్టతనివ్వనుంది. మరో సమాచారం ప్రకారం వచ్చే ఏడాది కోసం జట్టు పునర్నిర్మాణంలో భాగంగా అశ్విన్‌ను తప్పించాలని మేనేజ్‌మెంట్‌ స్వయంగా భావిస్తోంది. దీంతో అశ్విన్‌ కూడా మరో జట్టు వైపు చూస్తున్నాడు. 

‘కాన్‌ఫ్లిక్ట్స్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌’ సమస్య రాకూడదని సీఎస్‌కే ఆధ్వర్యంలోని అకాడమీ డైరెక్టర్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌ పదవికి కూడా అశ్విన్‌ రాజీనామా చేసే అవకాశం ఉంది. 2025 సీజన్‌లో చెత్త ప్రదర్శనతో చెన్నై చివరి స్థానంలో నిలిచింది. 9 మ్యాచ్‌లే ఆడిన అశ్విన్‌ ఏకంగా 9.12 ఎకానమీతో 7 వికెట్లే తీయగలిగాడు.  

సీఎస్‌కే దిద్దిన స్టార్‌... 
చెన్నై సూపర్‌ కింగ్స్‌ అతి పెద్ద మ్యాచ్‌ విన్నర్‌లలో ఒకడిగా అశ్విన్‌ గుర్తింపు పొందాడు. తొలిసారి అతను 2009లో సీఎస్‌కే టీమ్‌ ద్వారానే లీగ్‌లో అడుగు పెట్టాడు. రెండు సీజన్లు నిలకడైన ప్రదర్శన, ధోని అండతో అతనికి భారత జట్టులో స్థానం దక్కింది. 2010, 2011లో సీఎస్‌కే టైటిల్స్‌ సాధించడంలో అతను కీలకపాత్ర పోషించాడు. వరుసగా ఏడేళ్ల పాటు 2015 వరకు చెన్నైకి ఆడిన అనంతరం ఆ తర్వాత ఎనిమిది సీజన్లు వరుసగా రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్స్, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్‌ రాయల్స్‌ జట్లకు అశ్విన్‌ ప్రాతినిధ్యం వహించాడు. 

2025 వేలంలో రూ.9 కోట్ల 75 లక్షల మొత్తానికి చెన్నై అతడిని మళ్లీ సొంతం చేసుకుంది. సూపర్‌ కింగ్స్‌ తరఫున 106 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్‌ 6.68 ఎకానమీతో 97 వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో అతను 221 మ్యాచ్‌లలో 7.20 ఎకానమీతో 187 వికెట్లు పడగొట్టాడు. 39 ఏళ్ల అశ్విన్‌ గత డిసెంబర్‌లో ఆ్రస్టేలియాపై అడిలైడ్‌తో టెస్టు మ్యాచ్‌ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయ్యాడు. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Ravichandran Ashwin
IPL
Chennai Super Kings
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఢిల్లీకి పంత్‌... లక్నోకు కుల్దీప్‌!

ఢిల్లీకి పంత్‌... లక్నోకు కుల్దీప్‌!

IND vs AFG: ‘టీమిండియా సెలక్టర్ల నిర్ణయం సరైందే’

IND vs AFG: ‘టీమిండియా సెలక్టర్ల నిర్ణయం సరైందే’

అందరివాడు కేన్‌ మామా...

అందరివాడు కేన్‌ మామా...

‘కొడితే సెంచరీ.. లేదంటే వస్తాడు.. అవుటై వెళ్లిపోతాడు’

‘కొడితే సెంచరీ.. లేదంటే వస్తాడు.. అవుటై వెళ్లిపోతాడు’

పాటిదార్ ను తొక్కేస్తున్న కోహ్లి

పాటిదార్ ను తొక్కేస్తున్న కోహ్లి

కెప్టెన్ గా పాటిదార్ ఈ టీం చూస్తే ప్రత్యర్ధులు వణకాల్సిందే

కెప్టెన్ గా పాటిదార్ ఈ టీం చూస్తే ప్రత్యర్ధులు వణకాల్సిందే

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.