స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను 2-3 తేడాతో దక్షిణాఫ్రికా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తొలి రెండు వన్డేల్లో ప్రోటీస్ ఓటమి పాలైనప్పటికీ.. ఆఖరి మూడు వన్డేల్లో మాత్రం దుమ్ము రేపింది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా జట్టుపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ప్రశంసల వర్షం కురిపించాడు. వన్డే ప్రపంచకప్-2023 టైటిల్ రేసులో దక్షిణాఫ్రికా కచ్చితంగా ఉంటుందని పీటర్సన్ అభిప్రాయపడ్డాడు.
అదే విధంగా ఆసీస్‌తో నాలుగో వన్డేల్లో మెరుపు సెంచరీ సాధించిన హెన్రిస్ క్లాసెన్‌ను కూడా పీటర్సన్ పొగడ్తలతో ముంచెత్తాడు. "ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా అద్బుతమైన సిరీస్ విజయం సాధించింది. ఈ గెలుపుతో ప్రపంచకప్ టైటిల్ ఫేవరేట్‌గా ప్రోటీస్ జట్టు మారిపోయింది. క్లాసెన్ వారికి ప్రధాన ఆస్తి. అతడు బ్యాట్‌తో విధ్వంసం సృష్టించగలడు.
అయితే ఆసియాకప్‌ను కైసవం చేసుకున్న భారత జట్టు కూడా టైటిల్ బరిలో ఉంటుంది. అదే విధంగా వారి స్వదేశంలో ఈ టోర్నీ జరగనుంది. మరోవైపు పాకిస్తాన్ నుంచి కూడా మిగితా జట్లకు ముప్పు పొంచి ఉంది. ఫేవరెట్ ట్యాగ్ పరంగా చూస్తే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు భారత్ తర్వాతే ఉంటాయని" ట్విటర్(ఎక్స్)లో పీటర్సన్ పేర్కొన్నాడు. ఇక ఈ మెగా ఈవెంట్లో ఆక్టోబర్ 5న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి.
చదవండి: #Mohammed Shami: వరల్డ్‌కప్‌కు ముందు మహ్మద్ షమీకి బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు
South Africa become contenders for the CWC after their win against Aus. Klaasen is the major asset.
India favourites at home with Asia Cup win.
Pakistan is always a threat. ALWAYS!
England sitting just under India, in terms of favourites tag.
And Australia, well they’ll be…— Kevin Pietersen🦏 (@KP24) September 18, 2023