Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. వయసు ఒక అంకె మాత్రమే!
ADVERTISEMENT

వయసు ఒక అంకె మాత్రమే!

Sports Sakshi User Sakshi Sakshi Time Nov 5, 2026 01:26 AM IST Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
pvs_20re.jpg

31లోనూ 21లా అనిపిస్తోంది

శరీర తీరును అర్ధం చేసుకోవడం ముఖ్యం

భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు వ్యాఖ్య

2022 తర్వాత మళ్లీ బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీకి అర్హత  

న్యూఢిల్లీ: అత్యున్నత స్థాయిలో పోటీ పడేందుకు వయసు అడ్డంకి కానే కాదని భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు పేర్కొంది. డిసెంబర్‌లో జరగనున్న సీజన్‌ ముగింపు బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించిన సింధు... 31 ఏళ్ల వయసు కొత్త 21లా అనిపిస్తోందని వెల్లడించింది. బీడబ్ల్యూఎప్‌ ర్యాంకింగ్స్‌ ఆధారంగా ఎనిమిది మంది అత్యుత్తమ ప్లేయర్లు ఈ టోర్నీకి అర్హత సాధించారు. తాజాగా హైలో ఓపెన్‌ సూపర్‌–500 టైటిల్‌ గెలిచిన సింధు... గత నెలలో ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. జూలైలో జపాన్‌ ఓపెన్‌లో సైతం సింధు విజేతగా నిలిచింది. ప్రధాన టోర్నీల కోసం తన సన్నద్ధత... అథ్లెట్ల మానసిక, శారీరక స్థితి... గాయాల నుంచి తిరిగి కోలుకునే తీరు... ఆటల్లో అధునాతన సాంకేతికత ప్రభావం... ఇలా పలు అంశాలపై తన మనసులో భావాలను పంచుకుంది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... 

» ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్‌–6లోకి వచ్చినందుకు ఆనందంగా ఉంది. కోర్టులో మీ ఆట బాగుంటే అన్నీ వాటంతట అవే మీ వద్దకు వస్తాయి. విజయాలు సాధిస్తూ పోతే ర్యాంకింగ్‌ కూడా మెరుగవుతుంది. షట్లర్‌గా మంచి ప్రదర్శన కనబరుస్తూ టోర్నమెంట్‌లు గెలవడంపైనే దృష్టి పెడతా. ర్యాంకింగ్‌ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. విజయాలు వస్తున్న కొద్ది అది మెరుగవుతూ ఉంటుంది.  

»  బ్యాడ్మింటన్‌లో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూ ఉన్నాయి. కోర్టులో ఓపిక చాలా ముఖ్యం. వచ్చే ఏడాది నుంచి 15 పాయింట్ల విధానం రాబోతుంది. కాబట్టి పరిస్థితులు మారతాయి. దానికి అనుగుణంగా మనం సిద్ధం కావాలి. గతంలోని ‘గోల్డెన్‌ జనరేషన్‌’ ప్లేయర్లతో పాటు, ప్రస్తుత తరం యువ క్రీడాకారిణులతో పోటీ పడే అవకాశం నాకు దక్కడం సంతోషం.  

»   వయసు ఒక అంకె మాత్రమే. మీ శరీరాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారనేది ముఖ్యం. చాలా మంది ప్లేయర్లు 30 ఏళ్లు దాటాక కూడా మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. ఈ వయసులో కూడా ఎంతో మంది ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం సాధించారు. నేను ఆ దిశగానే అడుగులు వేస్తున్నా. ఆటలో మరింత పదును పెంచే ప్రయత్నాలు నిరంతరం చేస్తున్నా.  

»   విశ్రాంతి లేకుండా వరుస టోర్నమెంట్‌లు ఆడుతున్నా. అందుకే వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌కు ముందు జరగనున్న కొరియా ఓపెన్, జపాన్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌ల నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. ఎందుకంటే సాధన ఎంత ముఖ్యమో... తగినంత విశ్రాంతి కూడా అంతే అవసరం. ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌లో తాజాగా బరిలోకి దిగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నా.  

»  సుదీర్ఘ కాలంగా బ్యాడ్మింటన్‌ ఆడుతున్నా. దీంతో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఆటను ఆస్వాదించడం ముఖ్యం. మక్కువ ఉన్నంతవరకు అంతా సహజంగా సాగిపోతుంది. ఫిట్‌నెస్‌ కాపాడుకోవడం... కోర్టులో సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. నేనేం 20 ఏళ్ల వయసులో లేను. కాబట్టి వరుస టోర్నమెంట్‌లు ఆడటం సాధ్యం కాదు. అయితే బరిలోకి దిగిన ఏ టోర్నమెంట్‌లో అయినా 100 శాతం కృషి చేయాలి. దానికి శారీరకంగా, మానసికంగా అత్యుత్తమ స్థితిలో ఉండాలి. వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌ను దృష్టిలో పెట్టుకొని టోర్నీల ఎంపిక చేసుకుంటున్నా దీనికి నా సిబ్బంది ఎంతో సహకరిస్తున్నారు.  

‘షాట్‌ క్లాక్‌’పై అసంతృప్తి 
బీడబ్ల్యూఎఫ్‌ ప్రవేశపెట్టిన 25 సెకన్ల ‘షాట్‌ క్లాక్‌’ నిబంధనపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ఈ నిబంధనపై క్రీడాకారుల నుంచి వస్తున్న అభ్యంతరాలను... అథ్లెట్ల కమిషన్‌ చైర్‌ పర్సన్‌గా బీడబ్ల్యూఎఫ్‌ దృష్టికి తీసుకెళ్లా. త్వరలోనే దీనిపై పూర్తిస్థాయి సమీక్ష జరగనుంది. ర్యాలీ ముగిసిన తర్వాత సర్వ్‌ చేయడానికి ఆటగాళ్లకు 25 సెకన్ల సమయం ఉంటుంది. ఆరంభంలో ఇటు ఆటగాళ్లతో పాటు అటు అంపైర్‌లు కూడా దీనివల్ల ఇబ్బంది పడ్డారు.

రిసీవర్‌ సిద్ధంగా ఉండి సర్వర్‌ లేకపోవడం... సర్వర్‌ సిద్ధంగా ఉండి రిసీవర్‌ రెడీగా లేకపోవడం ఇలా చాలా జరిగాయి. అయితే నిధానంగా అందరూ దీనికి అలవాటు పడుతున్నారు. అయితే సుదీర్ఘ ర్యాలీ ఆడిన తర్వాత ప్లేయర్లు అలసిపోతారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. వాళ్లు కూడా మనుషులే కదా. అంత త్వరగా కోలుకోవడం కష్టం. అయితే నిబంధనలకు అనుగుణంగా ముందుగానే సిద్ధంగా ఉండాలని అథ్లెట్లకు కూడా తెలుసు... వారి్నంగ్‌లు వస్తాయన్న భయంతో అందరూ క్రమంగా సర్దుకుంటున్నారు.

8 సీజన్‌ ముగింపు టోర్నీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌కు సింధు అర్హత సాధించడం ఇది ఎనిమిదోసారి. 2016లో సెమీఫైనల్లో ఓడిన సింధు... 2017లో రన్నరప్‌గా నిలిచింది. 2018లో టైటిల్‌ సాధించింది. 2019లో, 2020లో రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ దశలో వెనుదిరిగిన సింధు 2021లో రన్నరప్‌గా నిలిచింది. 2022లో అర్హత సాధించినా గాయం కారణంగా చివరి నిమిషంలో టోర్నీ నుంచి వైదొలిగింది. మూడేళ్ల తర్వాత సింధు మళ్లీ ఈ ప్రతిష్టాత్మక టోర్నీ బెర్త్‌ను దక్కించుకుంది.

విరాట్‌ కోహ్లి సలహాలతో...
బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌లతోనే కాకుండా ఇతర క్రీడాకారులతో తరచూ మాట్లాడుతుండటం ఎంతో స్ఫూర్తినిస్తుంది. నా కెరీర్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో టీమిండియా మాజీ కెపె్టన్‌ విరాట్‌ కోహ్లితో మాట్లాడాను. ఆయన అద్భుత వ్యక్తి. విరాట్‌ సలహాలు, ప్రోత్సాహం నాకు ఎంతో ధైర్యాన్నిచ్చాయి. ఒత్తిడిని పక్కనపెట్టి ఆటను ఎలా ఆస్వాదించాలో ఆయన చెప్పిన మాటలు నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. అలాగే భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్, ఒలింపిక్, ప్రపంచ చాంపియన్‌ నీరజ్‌ చోప్రా నుంచి కూడా స్ఫూర్తి పొందా.


‘టెంపుల్‌ డివైజ్‌’తో ఉపయోగం...
అథ్లెట్లు గాయాల బారిన పడకుండా ఉండటం చాలా ముఖ్యం. ఒకవేళ పొరపాటున గాయపడితే రికవరీనే అత్యంత ముఖ్యమైంది. విశ్రాంతి, నిద్ర, హృదయ స్పందనల రేటు, ఏకాగ్రత వంటి వివరాలను ఎప్పటికప్పుడు గమనించుకోవడం ద్వారా అథ్లెట్లు తమ శరీర తీరును బాగా అర్థం చేసుకోవచ్చు. 

తాజాగా భారత వన్డే, టెస్టు క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ వినియోగించిన ‘టెంపుల్‌ డివైజ్‌’ను గతంలో నేను కూడా వినియోగించా. దీని ద్వారా మన నిద్ర, రికవరీ ఎలా ఉంది శరీర అలసటకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. ప్రతీ అథ్లెట్‌కు దీనిపై అవగాహన అవసరం. గిల్‌ చాలా కాలంగా క్రికెట్‌ ఆడుతున్నాడు. అతడికి ఇవన్నీ బాగా తెలుసు. నాకైతే ఈ పరికరం బాగా ఉపయోగపడుతోంది. అయితే అథ్లెట్లందరి శరీర తీరు ఒకలా ఉండదు. ఎవరికి వారు ప్రత్యేకం.

అనుభవం అన్నీ నేర్పుతుంది 
ఫిట్‌నెస్‌ కాపాడుకోవడం, తదుపరి టోర్నమెంట్‌ కోసం సిద్ధం కావడం చాలా ముఖ్యం. నా వయసు తక్కువేం కాదు. కానీ 31 ఏళ్ల అంటే నాకు కొత్త 21లా ఉంది. ప్రస్తుతానికి నా దృష్టి అంతా వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌పైనే ఉంది. తాజా టోర్నీల్లో విజయాలను బాగా ఆస్వాదిస్తున్నా. ఎందుకంటే గెలవడం ఎంత కష్టమో నాకు బాగా తెలుసు. కోర్టులో ఎక్కడ తప్పుచేశాం... ఆ సమయంలో మన లోపల ఏం నడుస్తోంది అనే అంశాలపై ఇప్పుడు స్పష్టమైన అవగాహన ఏర్పడింది. 

21 ఏళ్ల వయసులో ఏదైనా జరిగినప్పుడు... ఎందుకలా జరుగుతుందో తెలియక విసుగు, అసహనం కలిగేవి. కానీ ఇప్పుడు అలా కాదు. వయసుతో వచ్చిన పరిపక్వత వల్ల ఆటలో ఏం జరుగుతోందో నాకు సులువుగా తెలుస్తోంది. అందుకే ఇప్పుడు గెలవడం మరింత సంతృప్తిగా అనిపిస్తోంది. అయితే టోర్నమెంట్‌లు గెలిచినప్పుడు కలిగే అనుభూతిలో మాత్రం ఎలాంటి మార్పులేదు.

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
PV Sindhu
BWF World Superseries Finals
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఐదేళ్ల తర్వాత బీడబ్ల్యూఎఫ్ ఫైనల్స్‌కు సింధు

ఐదేళ్ల తర్వాత బీడబ్ల్యూఎఫ్ ఫైనల్స్‌కు సింధు

‘యువ షట్లర్లకు ప్రభుత్వ సహకారం అవసరమే’

‘యువ షట్లర్లకు ప్రభుత్వ సహకారం అవసరమే’

‘పైసా ఇవ్వలేదు.. సొంత డబ్బులతో టోర్నీలో పాల్గొన్నాం’

‘పైసా ఇవ్వలేదు.. సొంత డబ్బులతో టోర్నీలో పాల్గొన్నాం’

సింగిల్స్‌ చాంప్స్‌ సింధు, లక్ష్య సేన్‌

సింగిల్స్‌ చాంప్స్‌ సింధు, లక్ష్య సేన్‌

ఫైనల్లో పీవీ సింధు, లక్ష్యసేన్‌

ఫైనల్లో పీవీ సింధు, లక్ష్యసేన్‌

సెమీఫైనల్లో సింధు, లక్ష్యసేన్, అన్‌మోల్‌

సెమీఫైనల్లో సింధు, లక్ష్యసేన్, అన్‌మోల్‌

మరిన్ని వార్తలు

శతక్కొట్టిన ఆర్యవీర్‌.. యూఏఈని చిత్తుచేసి సెమీస్‌కు భారత్‌

శతక్కొట్టిన ఆర్యవీర్‌.. యూఏఈని చిత్తుచేసి సెమీస్‌కు భారత్‌

రెడ్‌ బాల్‌ క్రికెట్‌కు మహ్మద్ షమీ గుడ్ బై

రెడ్‌ బాల్‌ క్రికెట్‌కు మహ్మద్ షమీ గుడ్ బై

కెప్టెన్‌గా వైభ‌వ్ సూర్య‌వంశీ.. అధికారిక ప్ర‌క‌ట‌న‌

కెప్టెన్‌గా వైభ‌వ్ సూర్య‌వంశీ.. అధికారిక ప్ర‌క‌ట‌న‌

టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ విధ్వంసకర సెంచరీ

టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ విధ్వంసకర సెంచరీ

చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌ పేసర్‌

చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌ పేసర్‌

ఆసీస్ క్రికెట్ బోర్డు బిగ్ డెసిషన్.. మైఖల్‌ హస్సీకి కీలక బాధ్యతలు

ఆసీస్ క్రికెట్ బోర్డు బిగ్ డెసిషన్.. మైఖల్‌ హస్సీకి కీలక బాధ్యతలు

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft