Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

షోయబ్‌ మాలిక్‌ విడాకుల వార్తలు;.. సానియా మీర్జా పోస్ట్‌ వైరల్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Oct 5, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
shoaibsana.jpg

విడాకుల వార్తలపై షోయబ్‌ మాలిక్‌ స్పందన

పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ షోయబ్‌ మాలిక్‌ (Shoaib Malik) మూడో వివాహ బంధం కూడా చిక్కుల్లో పడ్డట్టు వార్తలు వస్తున్నాయి. మూడో భార్య, నటి సనా జావెద్‌ (Sana Javed)తో విడాకులు తీసుకోవడానికి షోయబ్‌ సిద్ధపడ్డాడనేది వాటి సారాంశం.

మనసు స్వచ్ఛంగా ఉన్నపుడు..
ఈ నేపథ్యంలో భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా (Sania Mirza) సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన పోస్టు వైరల్‌గా మారింది. ‘‘మనసు స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉన్నపుడు.. దానిని బయటకు చూపించేందుకు ఎలాంటి కృత్రిమ ఫిల్టర్ల అవసరం ఉండదు’’ అంటూ సానియా తన కుమారుడు ఇజహాన్‌, స్నేహితులతో కలిసి ఉన్న ఫొటోలను షేర్‌ చేసింది.

కాగా టెన్నిస్‌లో ఉన్నత శిఖరాలు అధిరోహించిన హైదరాబాదీ సానియా మీర్జా.. పాక్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ను 2010లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, అంతకంటే ముందే ఆయేషా సిద్ధిఖీ అనే మహిళతో షోయబ్‌కు వివాహం కాగా.. 2006లోనే విడాకులు తీసుకున్నాడు.


షోయబ్‌కు సానియా విడాకులు
అయితే, సానియా మీర్జాతోనూ షోయబ్‌ బంధం ఎక్కువకాలం నిలవలేదు. 2023లో తాను షోయబ్‌కు విడాకులు ఇచ్చినట్లు సానియా మీర్జా గతేడాది ప్రకటించింది. అయితే, అంతకంటే ముందే నటి సనా జావెద్‌ను పెళ్లాడిన ఫొటోలను షోయబ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం గమనార్హం.

ఇక సనాకు ఇది రెండో వివాహం కాగా.. షోయబ్‌కు మూడోది. అయితే, పెళ్లికి ముందే వీరిద్దరు తమ పాత బంధాలను కొనసాగిస్తూనే.. ‘రిలేషన్‌షిప్‌’లోనే ఉన్నారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సనా తన భర్తకు, షోయబ్‌ తన భార్యకు విడాకులు ఇచ్చి 2024లో అధికారికంగా పెళ్లి చేసుకున్నారు.

ఆ ఫొటోలతో వదంతులకు చెక్‌
అయితే, సనా- షోయబ్‌ మధ్య కూడా సఖ్యత చెడినట్లు ఇటీవల వదంతులు వ్యాపించాయి. ఓ కార్యక్రమంలో ఇద్దరూ ఒకే సోఫాలో కూర్చునప్పటికీ దూరం దూరంగా ఉండటం.. షోయబ్‌ ఆటోగ్రాఫులు ఇస్తున్నపుడు సనా ముఖం తిప్పేసుకోవడం ఇందుకు ఊతమిచ్చాయి.

దీంతో సనా- షోయబ్‌ విడాకులు తీసుకోబోతున్నారంటూ కథనాలు వచ్చాయి. అయితే, భర్త షోయబ్‌తో కలిసి అమెరికాలో విహరిస్తున్న ఫొటోలను పంచుకోవడం ద్వారా సనా జావెద్‌ ఈ వదంతులకు చెక్‌ పెట్టింది. 

ఇద్దరూ కలిసి హాలీవుడ్‌ యూనివర్సల్‌ స్టూడియోస్‌ను సందర్శించిన ఫొటోలను సనా షేర్‌ చేసింది. షోయబ్‌ కూడా ఇవే ఫొటోలు షేర్‌ చేస్తూ.. ‘‘తనతో కలిసి ఇలా విహరించడం ఎల్లపుడూ సంతోషమే’’ అని పేర్కొన్నాడు.

సానియా మీర్జా పోస్ట్‌ వైరల్‌
ఇదిలా ఉంటే.. సానియా- షోయబ్‌లకు సంతానంగా కుమారుడు ఇజహాన్‌ జన్మించాడు. సానియా తన కుమారుడితో కలిసి ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తోంది. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో పదమూడు మిలియన్లకు పైగా ఫాలోవర్లు కలిగి ఉన్న సానియా మీర్జా ఎప్పటికప్పుడు ఫొటోలు పంచుకుంటూనే ఉంటుంది. 

అయితే, శనివారం ఆమె పంచుకున్న ఫొటోలకు ఇచ్చిన క్యాప్షన్‌.. షోయబ్‌ మూడో పెళ్లి పెటాకులు అన్న వార్తల వేళ నెటిజన్లను ఆకర్షిస్తోంది.

చదవండి: 50 ఓవర్ల క్రికెట్‌లో ట్రిపుల్‌ సెంచరీ.. ఆసీస్‌ బ్యాటర్‌ విధ్వంసం

 
 
 
 

View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sania Mirza (@mirzasaniar)

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Sania Mirza
Shoaib Malik
Sana Javed
Divorce
rumours
Off the field
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇథనాల్‌ పెట్రోల్‌.. నాకు, నా కుటుంబానికి పైసా లాభం లేదు: గడ్కరీ

ఇథనాల్‌ పెట్రోల్‌.. నాకు, నా కుటుంబానికి పైసా లాభం లేదు: గడ్కరీ

విజయ్-సంగీత విడాకుల కేసు విచారణ వాయిదా

విజయ్-సంగీత విడాకుల కేసు విచారణ వాయిదా

CM Vijay: సీఎం విజయ్ విడాకుల కేసు.. రెండోసారి కూడా..!

CM Vijay: సీఎం విజయ్ విడాకుల కేసు.. రెండోసారి కూడా..!

'నాపై గే అంటూ ట్రోల్స్'.. బాలీవుడ్‌ నటి ఆవేదన

'నాపై గే అంటూ ట్రోల్స్'.. బాలీవుడ్‌ నటి ఆవేదన

విడాకులు మంజూరు : భర్తను వాటేసుకుని ఎమోషనల్‌, ఎందుకో తెలుసా?

విడాకులు మంజూరు : భర్తను వాటేసుకుని ఎమోషనల్‌, ఎందుకో తెలుసా?

విడాకుల వివాదం.. జయం రవికి షాక్

విడాకుల వివాదం.. జయం రవికి షాక్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.