Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

ఎనిమిది వికెట్లతో చెలరేగిన షమీ.. టీమిండియా సెలక్టర్లకు వార్నింగ్‌!

Sports Sakshi User Sakshi Sakshi Time Oct 28, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
shami.jpg

టీమిండియా వెటరన్‌ పేసర్‌ మొహమ్మద్‌ షమీ (Mohammed Shami) రంజీ మ్యాచ్‌లో అదరగొట్టాడు. గుజరాత్‌తో పోరులో ఈ రైటార్మ్‌ బౌలర్‌ మొత్తంగా ఎనిమిది వికెట్లతో చెలరేగి బెంగాల్‌ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా తనకు ఫిట్‌నెస్‌ లేదంటూ కామెంట్‌ చేసిన టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్క (Ajit Agarkar)ర్‌కు ‘బంతి’తోనే దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు.

రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌ రెండో మ్యాచ్‌లో భాగంగా బెంగాల్‌.. గుజరాత్‌ జట్టును ఢీకొట్టింది. ఎలైట్‌ గ్రూప్‌-‘సి’లో భాగంగా ఇరుజట్ల మధ్య కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో శనివారం మ్యాచ్‌ మొదలుకాగా.. టాస్‌ గెలిచిన గుజరాత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

మూడు హాఫ్‌ సెంచరీలు
ఈ ‍క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 279 పరుగులకు ఆలౌట్‌ అయింది. సుదీప్‌ ఘరామి (56), వికెట్‌ కీపర్‌ అభిషేక్‌ పోరెల్‌ (51), సుమంత గుప్తా (63) అర్ధ శతకాల కారణంగా ఈమాత్రం స్కోరు సాధ్యమైంది.

167 పరుగులకే
అనంతరం తొలి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన గుజరాత్‌ 167 పరుగులకే కుప్పకూలింది. మనన్‌ హింగ్రాజియా (80) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడగా.. మిగతా వారి నుంచి అతడికి సహకారం లభించలేదు. బెంగాల్‌ బౌలర్లలో షాబాజ్‌ అహ్మద్‌ ఆరు వికెట్లు కూల్చగా.. షమీ మూడు, ఆకాశ్‌ దీప్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

ఈ క్రమంలో 112 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టింది బెంగాల్‌. ఎనిమిది వికెట్ల నష్టానికి 214 పరుగుల వద్ద ఉన్న వేళ ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. సుదీప్‌ ఘరామి (54), అనుస్తుప్‌ మజుందార్‌ (58) అర్ధ శతకాలతో రాణించారు.

ఐదు వికెట్లు కూల్చిన షమీ
ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకొని బెంగాల్‌.. గుజరాత్‌కు 327 పరుగుల లక్ష్యాన్ని విధించింది. అయితే, ఆది నుంచే చెలరేగిన షమీ  గుజరాత్ ఓపెనర్‌ అభిషేక్‌ దేశాయిని డకౌట్‌ చేశాడు. జయమీత్‌ పటేల్‌ (45), విశాల్‌ జైస్వాల్‌ (1), సిద్దార్థ్‌ దేశాయ్‌ (0), అర్జాన్‌ నాగ్వాస్వల్లా (0)లను వెనక్కి పంపించాడు.

మొత్తంగా 10 ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 38 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు కూల్చాడు షమీ. మిగతా వారిలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ షాబాజ్‌ అహ్మద్‌ మూడు వికెట్లు దక్కించుకోగా.. ఆకాశ్‌ దీప్‌ ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. 

బెంగాల్‌ బౌలర్ల ధాటికి గుజరాత్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ కుప్పకూలడంతో.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఉర్విల్‌ పటేల్‌ అజేయ శతకం (124 బంతుల్లో 109) వృథాగా పోయింది. 185 పరుగులకే గుజరాత్‌ ఆలౌట్‌ కావడంతో.. బెంగాల్‌ 141 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.

షమీకి ఫిట్‌నెస్‌ లేదంటూ..
కాగా టీమిండియా తరఫున ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో సత్తా చాటిన షమీని.. ఆ తర్వాత సెలక్టర్లు పక్కనపెట్టిన విషయం తెలిసిందే. ఇటీవల ఆస్ట్రేలియాతో వన్డేలకు కూడా అతడిని ఎంపిక చేయలేదు. 

ఈ విషయం గురించి చీఫ్‌ సెలక్టర్‌ అగార్కర్‌ మాట్లాడుతూ.. షమీకి ఫిట్‌నెస్‌ లేదని తెలిపాడు. ఇందుకు షమీ కౌంటర్‌ ఇచ్చాడు. రంజీల్లో ఆడేవాడిని వన్డేలు ఆడలేనా? అన్ని ప్రశ్నించాడు. బెంగాల్‌ తరఫున ఎలా ఆడుతున్నానో అందరూ చూస్తున్నారని పేర్కొన్నాడు. సౌతాఫ్రికాతో స్వదేశంలో టెస్టులకు ముందు.. తాజా ప్రదర్శనతో మరోసారి అగార్కర్‌కు గట్టి సందేశమే ఇచ్చాడు షమీ.

చదవండి: స్పృహ తప్పి పడిపోయాడు!.. ప్రాణాపాయమే!;.. ​కీలక అప్‌డేట్‌ ఇచ్చిన సూర్య

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Mohammed Shami
Ranji Trophy 2025-26
bengal
Gujarat
Ajit Agarkar
Shahbaz Ahmed
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వ్యవసాయానికి మించిన కథ..! 40 ఏళ్ల వయసులో ట్రాక్టర్‌ డ్రైవింగ్‌ ..

వ్యవసాయానికి మించిన కథ..! 40 ఏళ్ల వయసులో ట్రాక్టర్‌ డ్రైవింగ్‌ ..

 రోహిత్‌, కోహ్లీ భ‌విత‌వ్యంపై బీసీసీఐ స్పందన!

రోహిత్‌, కోహ్లీ భ‌విత‌వ్యంపై బీసీసీఐ స్పందన!

పారిశ్రామికవేత్తగా గృహిణి..! ఏడాదికి రూ. 1.85 కోట్లు..

పారిశ్రామికవేత్తగా గృహిణి..! ఏడాదికి రూ. 1.85 కోట్లు..

అంతుచిక్కని సంఘటన.. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం క్రాష్ పై బయటకు రాని నిజాలు

అంతుచిక్కని సంఘటన.. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం క్రాష్ పై బయటకు రాని నిజాలు

విమానం టాయిలెట్‌లో బంగారం.. ఎంతుందంటే..?

విమానం టాయిలెట్‌లో బంగారం.. ఎంతుందంటే..?

భారీగా పెరిగిన స్టాక్ జేబులు నింపుకున్న ఇన్వెస్టర్లు

భారీగా పెరిగిన స్టాక్ జేబులు నింపుకున్న ఇన్వెస్టర్లు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.