ఐపీఎల్-2023లో కోల్కతా నైట్రైడర్స్ బోణీ కొట్టింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో 81 పరుగుల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో బాలీవుడ్ బాద్షా, కేకేఆర్ ఓనర్ షారుఖ్ ఖాన్ సందడి చేశాడు. ప్రత్యేక గ్యాలరీలో షారుఖ్ కూర్చుని తన జట్టును సపోర్ట్ చేస్తూ కన్పించాడు. తమ బౌండరీలు బాదినప్పడు, బౌలర్లు వికెట్లు పడగొట్టనప్పడు లేచి నిలబడి చప్పట్లు కొడుతూ షారుఖ్ ఖాన్ అభినందించాడు.
కోహ్లికి డ్యాన్స్ నేర్పించిన షారుక్
కాగా మ్యాచ్ అనంతరం షారుక్ మైదానంలోకి వచ్చి ఇరు జట్ల ఆటగాళ్లతో సరదగా ముచ్చటించాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్, ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లికి కింగ్ ఖాన్ డ్యాన్స్ నేర్పించాడు. తన సూపర్ హిట్ మూవీ పఠాన్లోని 'ఝూమ్ జో పఠాన్' పాటకు స్టెప్లను షారుక్ నేర్పించాడు. కోహ్లి బాద్షాను అనుకరిస్తూ స్టెప్లు వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 205 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ కేవలం 123 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి నాలుగు వికెట్లతో ఆర్సీబీ వెన్ను విరచగా.. సుయాష్ శర్మ మూడు, నరైన్ రెండు, శార్దూల్ ఠాకూర్ ఒక్క వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ శార్దూల్ ఠాకూర్(29 బంతుల్లో 68) విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది.
చదవండి: IPL 2023: ఆర్సీబీకి ఊహించని షాక్.. స్టార్ ప్లేయర్ దూరం! ఈ సారి కూడా కష్టమే
This happened after the Clash Of The Titans 💪🏻 a 🫂 is a must after such high-voltage matches 🫶🏻
How endearing it is to see King Khan @iamsrk teaching the steps of #JhoomeJoPathaan to King Kohli @imVkohli 📸 🕺🏻🕺🏻#KKRvsRCB #ShahRukhKhan #KKR #AmiKKR #RCB #ViratKohli pic.twitter.com/DiHCgb5nbU— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) April 6, 2023