Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

పాక్‌పై 11 వికెట్లు.. సౌతాఫ్రికా బౌలర్‌ అరుదైన ఘనత

Sports Sakshi User Sakshi Sakshi Time Oct 14, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
acv.jpg

లాహోర్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా స్పిన్నర్‌ సెనురన్‌ ముత్తుసామి (Senuran Muthusamy) చెలరేగిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల సహా మ్యాచ్‌ మొత్తంలో 11 వికెట్లు తీసి ఓ అరుదైన ఘనత సాధించాడు.

ఓ టెస్ట్‌ మ్యాచ్‌లో 10 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన నాలుగో సౌతాఫ్రికన్‌ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ముత్తుసామికి ముందు హగ్‌ టేఫీల్డ్‌ (1952లో ఆస్ట్రేలియాపై 13/165), హగ్‌ టేఫీల్డ్‌ (1957లో ఇంగ్లండ్‌పై 13/192), కేశవ్‌ మహారాజ్‌ (2018లో శ్రీలంకపై 12/283), పాల్‌ ఆడమ్స్‌ (2003లో బంగ్లాదేశ్‌పై 10/106) మాత్రమే ఈ ఘనత సాధించారు.

ముత్తుసామి ప్రదర్శనల కారణంగా ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా నిలబడగలిగింది. తొలి ఇన్నింగ్స్‌లో పాక్‌ను 378 పరుగులకు పరిమితం చేసిన ముత్తు.. రెండో ఇన్నింగ్స్‌లో మరింతగా చెలరేగి ప్రత్యర్దిని 167 పరుగులకే మట్టుబెట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో ముత్తుసామితో పాటు  సైమన్‌ హార్మర్‌ (14.1-3-51-4) కూడా సత్తా చాటాడు.

పాక్‌ ఇన్నింగ్స్‌లో 42 పరుగులు చేసిన బాబర్‌ ఆజమ్‌ టాప్‌ స్కోరర్‌ కాగా.. అబ్దుల్లా షఫీక్‌ (41), సౌద్‌ షకీల్‌ (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మరో ఇద్దరు (రిజ్వాన్‌ (14), నౌమన్‌ అలీ (11)) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులు ఆధిక్యం సాధించిన పాక్‌.. రెండో ఇన్నింగ్స్‌ స్కోర్‌ కలుపుకుని సౌతాఫ్రికా ముందు 277 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆదిలోనే తడబడింది. 18 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్రమ్‌ 3, వియాన్‌ ముల్దర్‌ డకౌటయ్యారు. వీరిద్దరు ఔటయ్యాక సౌతాఫ్రికా మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతుంది. 

ర్యాన్‌ రికెల్టన్‌ (29), టోనీ డి జోర్జీ (16) ఆచితూచి ఆడుతూ నిదానంగా లక్ష్యాన్ని కరిగిస్తున్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా స్కోర్‌ 2 వికెట్ల నష్టానికి 51 పరుగులుగా ఉంది. గెలుపుకు 226 పరుగుల దూరంలో ఉంది. 

తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో చెలరేగిన నౌమన్‌ అలీ రెండో ఇన్నింగ్స్‌లోనూ ప్రభావం చూపుతున్నాడు. సౌతాఫ్రికా కోల్పోయిన రెండు వికెట్లు నౌమన్‌ ఖాతాలోనే పడ్డాయి.

శతక్కొట్టిన జోర్జి
అంతకుముందు టోనీ డి జోర్జి బాధ్యతాయుతమైన శతకంతో (104) మెరవడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 269 పరుగులు చేయగలిగింది. ఓ పక్క సహచరులంతా విఫలమైన జోర్జి మాత్రం పట్టుదలతో ఆడి తన జట్టును ఆదుకున్నాడు. 

సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో జోర్జితో పాటు ర్యాన్‌ రికెల్టన్‌ (71) ఒక్కడే రాణించారు. పాక్‌ వెటరన్‌ స్పిన్నర్‌ నౌమన్‌ అలీ ఆరు వికెట్లు తీసి సౌతాఫ్రికాను దెబ్బకొట్టాడు. నౌమన్‌కు సాజిద్‌ ఖాన్‌ (3/98) సహకరించాడు. పాక్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు సౌతాఫ్రికా 109 పరుగులు వెనుకపడి ఉంది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌటైంది. పాక్‌ ఇన్నింగ్స్‌లో నలుగురు అర్ద సెంచరీలతో రాణించారు. 

ఇమామ్‌ ఉల్‌ హక్‌ (93), సల్మాన్‌ అఘా (93) తృటిలో సెంచరీలు మిస్‌ కాగా.. కెప్టెన్‌ షాన్‌ మసూద్‌ (76), మహ్మద్‌ రిజ్వాన్‌ (75) భారీ అర్ద సెంచరీలు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో సెనురన్‌ ముత్తుసామి 6 వికెట్లు తీయగా.. ప్రెనెలన్‌ సుబ్రాయన్‌ 2, రబాడ, హార్మర్‌ తలో వికెట్‌ తీశారు.

చదవండి: రేపటి నుంచి దేశీయ క్రికెట్‌ మహా సంగ్రామం ప్రారంభం

 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
south africa
South Africa vs Pakistan
Pakistan
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

పాక్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న ఇరాన్‌ కొత్త ఎత్తుగడ!

పాక్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న ఇరాన్‌ కొత్త ఎత్తుగడ!

మళ్లీ పాక్‌ కెప్టెన్‌గా బాబర్‌ ఆజం​..!

మళ్లీ పాక్‌ కెప్టెన్‌గా బాబర్‌ ఆజం​..!

బలూచిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 40 మంది దుర్మరణం

బలూచిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 40 మంది దుర్మరణం

జోరు కొనసాగించాలని... 

జోరు కొనసాగించాలని... 

సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. భారత్‌ సెమీస్‌ చేరాలంటే!

సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. భారత్‌ సెమీస్‌ చేరాలంటే!

బిత్తర పోయిన పాక్‌ ప్రధాని.. అమెరికాకు ఘోర అవమానం!

బిత్తర పోయిన పాక్‌ ప్రధాని.. అమెరికాకు ఘోర అవమానం!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.