Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

ఆసియా కప్‌కు మందు సంజూ శాంసన్‌ ఆసక్తికర నిర్ణయం

Sports Sakshi User Sakshi Sakshi Time Sep 9, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
makcm.jpg

ఆసియా కప్‌ 2025 ప్రారంభానికి ముందు టీమిండియా వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల తన సొంత రాష్ట్రం కేరళలో జరిగిన టీ20 టోర్నీ (KCL 2025) ద్వారా అర్జించిన జీతాన్ని సహచరులు, సహాయక బృందానికి విరాళంగా ఇచ్చాడు. 

ఈ టోర్నీ ద్వారా సంజూ రూ. 26.8 లక్షల జీతాన్ని పొందాడు. ఈ మొత్తాన్ని కొచ్చి బ్లూ టైగర్స్‌ బృందానికి ఇచ్చేసి ఉదారతను చాటుకున్నాడు. వాస్తవానికి ఈ టోర్నీ వేలంలో సంజూ రూ. 50 లక్షలకు (ఈ సీజన్‌ వేలంలో ఇదే అత్యధికం) అమ్ముడుపోయాడు. అయితే అతనికి కొచ్చితో ఉన్న ప్రత్యేక అనుబంధం కారణంగా తన వేతనంలో సగం డబ్బుకే ఆడేందుకు ఒప్పుకున్నాడు.

Sanju Samson's brother "Saly Samson" led Kochi Blue Tigers won the KCL 2025. 🏅

- Sanju Samson played an important role in the Group Stage with 368 runs from 5 Innings. pic.twitter.com/w7ZFClxpGz

— Johns. (@CricCrazyJohns) September 8, 2025

KCL 2025లో సంజూ ప్రాతినిథ్యం వహించిన కొచ్చి బ్లూ టైగర్స్‌ ఛాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో ఏరిస్‌ కొల్లమ్‌ టైగర్స్‌ 75 పరుగుల భారీ తేడాతో గెలుపొంది టైటిల్‌ కైవసం చేసుకుంది. సంజూ ఫైనల్‌, సెమీఫైనల్లో ఆడకపోయినా, కొచ్చి టైటిల్‌ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు.

లీగ్‌ దశలో ఆడిన 5 ఇన్నింగ్స్‌ల్లో 186.80 స్ట్రయిక్‌రేట్‌తో 73.60 సగటున 368 పరుగులు చేశాడు. ఇందులో ఓ విధ్వంసకర సెంచరీతో కలిపి నాలుగు 50 ప్లస్‌ స్కోర్లు ఉన్నాయి. ఈ టోర్నీలో కొచ్చిని ఛాంపియన్‌గా నిలిపింది (కెప్టెన్‌) సంజూ సోదరుడు శాలీ శాంసన్‌ కావడం మరో విశేషం. శాలీ కూడా ఈ టోర్నీలో బ్యాటర్‌గా, కెప్టెన్‌గా అద్భుతంగా రాణించాడు.

సంజూకు కేరళ క్రికెట్‌పై అమితాసక్తి ఉంది. తన సొంత రాష్ట్రం నుంచి చాలా మంది టీమిండియాకు ఆడాలన్నది అతని కల. అతనికి తన KCL టీమ్‌ కొచ్చి బ్లూ టైగర్స్‌ అంటే కూడా చాలా ఇష్టం. ఈ ఇష్టంలో భాగంగానే అతను తన జీతం మొత్తాన్ని సహచరులకు విరాళంగా ఇచ్చాడు. 

సంజూకు ఇలాంటి దానాలు కొత్తేమీ కాదు. తన పేరిట ఓ ట్రస్ట్‌ను నడిపిస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాడు. ఇందుకుగానూ కేరళ ప్రభుత్వం నుంచి కూడా అభినందనలు పొందాడు. గత దశాబ్దకాలంలో కేరళ నుంచి టీమిండియాకు ఆడిన క్రికెటర్‌ సంజూ ఒక్కడే.

ఇదిలా ఉంటే, సంజూ KCLలో అద్భుతంగా రాణించినప్పటికీ భారత తుది జట్టులో (ఆసియా కప్‌లో) స్థానం ప్రశ్నార్థకంగా ఉంది. సంజూ ఆడాల్సిన ఓపెనింగ్‌ స్థానం కోసం​ జట్టు వైస్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ పోటీపడుతున్నాడు. గిల్‌ను ఆల్‌ ఫార్మాట్‌ ప్లేయర్‌గా ప్రమోట్‌ చేయడంలో భాగంగా సంజూపై వేటు పడుతుందని టాక్‌ నడుస్తుంది. ఈ విషయంపై స్పష్టత రావాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Sanju Samson
kerala cricket
team india
Asia Cup 2025
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

కోహ్లి బాటలో సంజూ శాంసన్‌..!

కోహ్లి బాటలో సంజూ శాంసన్‌..!

టీమిండియా ఆటతీరుపై శ్రేయస్‌ ఆగ్రహం

టీమిండియా ఆటతీరుపై శ్రేయస్‌ ఆగ్రహం

పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్

పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్

సంజూను కావాలనే తప్పించారా?

సంజూను కావాలనే తప్పించారా?

సంజు, ఇషాన్ అవుట్.. వైభవ్ ఎంట్రీ

సంజు, ఇషాన్ అవుట్.. వైభవ్ ఎంట్రీ

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.