Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

ఐ డోంట్‌ కేర్‌: సబలెంకా రియాక్షన్‌ వైరల్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Jan 12, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
sabalenka.jpg

బెలారస్‌ టెన్నిస్‌ స్టార్‌ అరియానా సబలెంకా కొత్త ఏడాదిని, కొత్త సీజన్‌ను టైటిల్‌తో ప్రారంభించింది. బ్రిస్బేన్‌ ఓపెన్‌ డబ్ల్యూటీఏ–500 టోర్నీలో టాప్‌ సీడ్‌ సబలెంకా.. మార్టా కొస్టుక్‌పై ఏకపక్ష విజయం సాధించింది. అయితే, మ్యాచ్‌ అనంతరం సబలెంకాతో కరచాలనం చేసేందుకు ఉక్రెయిన్‌కు చెందిన మార్టా నిరాకరించింది.

ఉక్రెయిన్‌లో పరిస్థితుల నేపథ్యంలో రష్యా, బెలారస్‌ ప్లేయర్లతో షేక్‌హ్యాండ్‌కు దూరంగా ఉండాలని తాను పెట్టుకున్న నియమాన్ని ఇక్కడ కూడా 23 ఏళ్ల మార్టా పాటించింది. ఈ విషయంపై సబలెంకా తాజాగా స్పందించింది.

నేను అసలు పట్టించుకోను
‘‘అది ఆమె నిర్ణయం. అందుకు నేనేం చేయగలను?.. ఆమె షేక్‌హ్యాండ్‌ ఇచ్చినా.. ఇవ్వకపోయినా నాకేమీ తేడా ఉండదు. నేనసలు ఆ విషయాన్నే పట్టించుకోను. ఒక్కసారి కోర్టులో దిగిన తర్వాత నా ధ్యాసంతా ఆట మీదే ఉంటుంది.

కోర్టులో అడుగుపెట్టిన తర్వాత గెలవాలన్న లక్ష్యంతోనే ముందుకు సాగుతాను. మర్టా లేదంటే జెస్సికా పెగులా.. నా ప్రత్యర్థిగా వీరిలో ఎవరు ఉన్నారన్నది ముఖ్యం కాదు. నా అత్యుత్తమ ప్రదర్శనతో విజేతగా నిలవడం.. ట్రోఫీని అందుకోవడంపై మాత్రమే దృష్టి సారిస్తా.

నేను కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. అథ్లెట్‌గా నా పనిని నేను సక్రమంగా పూర్తి చేస్తాను’’ అని సబలెంకా.. మార్టాకు పరోక్షంగా గట్టిగానే కౌంటర్‌ ఇచ్చింది. కాగా 2022 నుంచి రష్యా, బెలారస్‌ ప్లేయర్లతో షేక్‌హ్యాండ్‌కు మార్టా దూరంగా ఉంటోంది. 

రూ. 1 కోటీ 93 లక్షలు
ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. ఆదివారం ముగిసిన బ్రిస్బేన్‌ ఓపెన్‌ డబ్ల్యూటీఏ–500 టోర్నీ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ సబలెంకా 6–4, 6–3తో మార్టా కొస్టుక్‌ను ఓడించింది.

78 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సబలెంకా ఒక ఏస్‌ సంధించింది. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేసింది. తొలి సర్వీస్‌లో 32 పాయింట్లకుగాను 26... రెండో సర్వీస్‌లో 20 పాయింట్లకుగాను 12 పాయింట్లు సంపాదించింది. 

ఇక సబలెంకా కెరీర్‌లో ఇది 22వ సింగిల్స్‌ టైటిల్‌ కావడం విశేషం. విజేతగా నిలిచిన బెలారస్‌ స్టార్‌కు 2,14,530 డాలర్ల (రూ. 1 కోటీ 93 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

చదవండి: U19 WC 2026 IND vs ENG: వైభవ్‌ సూర్యవంశీ ఫెయిల్‌

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Aryna Sabalenka
Tennis Tournament
Belarus
Ukraine - Russia
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

రష్యాపై ఉక్రెయిన్‌ భారీ ప్రతీకార దాడి

రష్యాపై ఉక్రెయిన్‌ భారీ ప్రతీకార దాడి

రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్‌

రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్‌

నాలుగేళ్ల విరామం.. 90 నిమిషాల్లో విజయం

నాలుగేళ్ల విరామం.. 90 నిమిషాల్లో విజయం

విజేత రిత్విక్‌–రామ్‌ జోడీ.. హైదరాబాదీ ఖాతాలో తొలి టైటిల్‌

విజేత రిత్విక్‌–రామ్‌ జోడీ.. హైదరాబాదీ ఖాతాలో తొలి టైటిల్‌

ట్రంప్‌ రాజీ ప్రతిపాదనలపై శాంతి ఒప్పందానికి సిద్ధం 

ట్రంప్‌ రాజీ ప్రతిపాదనలపై శాంతి ఒప్పందానికి సిద్ధం 

వరల్డ్‌ నంబర్‌వన్‌ సబలెంకా నిష్క్రమణ

వరల్డ్‌ నంబర్‌వన్‌ సబలెంకా నిష్క్రమణ

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.