Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT

Asia Cup 2023: గ్రౌండ్‌లో దిగిన రోహిత్‌ శర్మ.. ఫొటోలు వైరల్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Aug 19, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
rohit-sharma.jpg

Rohit Sharma Pics Goes Viral: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మైదానంలో దిగాడు. గ్రౌండ్‌లో పరుగులు తీస్తూ ఫిట్‌గా కనిపించిన హిట్‌మ్యాన్‌.. ఆసియా వన్డే కప్‌ టోర్నీకి పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నట్లు సంకేతాలు ఇచ్చాడు. కాగా వెస్టిండీస్‌ పర్యటనలో చివరిగా రోహిత్‌ వన్డే మ్యాచ్‌ ఆడాడు.

రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో సెంచరీతో చెలరేగిన ఈ ముంబైకర్‌.. 1-0తో జట్టుకు ట్రోఫీ అందించాడు. ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఒకే ఒక్క మ్యాచ్‌ ఆడాడు. తొలి వన్డేలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

ఇక ఈ మ్యాచ్‌ తర్వాత రోహిత్‌తో పాటు స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లికి కూడా మేనేజ్‌మెంట్‌ విశ్రాంతినిచ్చింది. ఈ క్రమంలో హార్దిక్‌ పాండ్యా సారథ్యంలో మిగిలిన రెండు వన్డేల్లో ఒకటి గెలిచిన టీమిండియా సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.

ఈ సిరీస్‌ ముగిసిన తర్వాత రోహిత్‌, కోహ్లి భారత్‌కు చేరుకున్నారు. ఇదిలా ఉంటే.. ఆసియా వన్డే కప్‌ ఆగష్టు 30 నుంచి పాకిస్తాన్‌, శ్రీలంక వేదికగా ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దొరికిన విరామ సమయాన్ని రోహిత్‌ శర్మ ప్రాక్టీస్‌ కోసం కేటాయించాడు.

ఇందుకు సంబంధించిన ఫొటోలను హిట్‌మ్యాన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా వైరల్‌ అవుతున్నాయి. ఇందులో టీ షర్ట్‌, షార్ట్స్‌లో జాగింగ్‌ షూ వేసుకుని రోహిత్‌ స్టైలిష్‌గా కనిపించాడు. ఇక ఆసియా కప్‌ టోర్నీకి సమయం సమీపిస్తున్న తరుణంలో ఆగష్టు 23న అతడు బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో రిపోర్టు చేయనున్నట్లు సమాచారం.

వారం రోజుల పాటు అక్కడే శిక్షణా శిబిరంలో ఉండనున్నాడు. ఇదిలా ఉంటే.. జస్‌ప్రీత్‌ బుమ్రా సారథ్యంలో యువ ఆటగాళ్లుతో కూడిన భారత జట్టు ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆగష్టు 18న మొదలైన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌ గెలిచి 1-0తో ఆధిక్యంలో ఉంది.

చదవండి: అప్పట్లో ఒకడుండేవాడు.. అతడే ధోని! కానీ రోహిత్‌ మాత్రం: పాక్‌ దిగ్గజం

View this post on Instagram

A post shared by Rohit Sharma (@rohitsharma45)

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
rohit sharma
Asia Cup 2023
national cricket academy
Virat Kohli
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

కోహ్లి బాటలో సంజూ శాంసన్‌..!

కోహ్లి బాటలో సంజూ శాంసన్‌..!

భార‌త జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. సెంచ‌రీ హీరోకు నో ఛాన్స్‌

భార‌త జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. సెంచ‌రీ హీరోకు నో ఛాన్స్‌

రోహిత్‌ సరికొత్త రికార్డు.. భారత వన్డే క్రికెట్‌ హిస్టరీలోనే

రోహిత్‌ సరికొత్త రికార్డు.. భారత వన్డే క్రికెట్‌ హిస్టరీలోనే

భార‌త వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లోనే తొలిసారి

భార‌త వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లోనే తొలిసారి

రోహిత్‌ శర్మ హ్యాట్రిక్‌.. వీడియో వైరల్‌

రోహిత్‌ శర్మ హ్యాట్రిక్‌.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.