Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

రిజ్వాన్‌పై వేటుకు కారణం అదే!.. వెలుగులోకి సంచలన విషయాలు!

Sports Sakshi User Sakshi Sakshi Time Oct 22, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
rizwan.jpg

పాకిస్తాన్‌ వన్డే కెప్టెన్‌గా మొహమ్మద్‌ రిజ్వాన్‌ (Mohammad Rizwan)ను తప్పించడానికి గల కారణాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డ్రెసింగ్‌ రూమ్‌లో మతపరమైన విషయాలను రిజ్వాన్‌ ఎక్కువగా చర్చిస్తున్నాడని.. అందుకే అతడిపై వేటు పడి ఉండవచ్చని మాజీ కెప్టెన్‌ రషీద్‌ లతీఫ్‌ అభిప్రాయపడ్డాడు. 

ఇలాంటివి జట్టుకు మేలు చేయవని భావించిన కోచ్‌ మైక్‌ హసన్‌ రిజ్వాన్‌కు ఉద్వాసన పలకాలనే ఉద్దేశంతోనే బోర్డును ఒత్తిడి చేశాడని లతీఫ్‌ ఆరోపించాడు. అయితే, తాజాగా రిజ్వాన్‌ తొలగింపునకు గల ప్రధాన కారణం ఇదేనంటూ ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ ఇచ్చిన కథనం వెలుగులోకి వచ్చింది. 

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..  పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇంటా బయటా పరాజయాలతో సతమతమవుతున్న పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు... వన్డే కెప్టెన్‌ను మార్చిన విషయం తెలిసిందే. 

షాహీన్‌ షా అఫ్రిదికి పగ్గాలు
వికెట్‌ కీపర్‌ మొహమ్మద్‌ రిజ్వాన్‌ నుంచి సారథ్య బాధ్యతలు తప్పించి... స్టార్‌ పేసర్‌ షాహీన్‌ షా అఫ్రిది (Shaheen Shah Afridi)కి కట్టబెట్టింది. ప్రస్తుతం సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ ఆడుతున్న పాకిస్తాన్‌ జట్టు... నవంబర్‌ 4 నుంచి 8 మధ్య సఫారీ జట్టుతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడనుంది. 

వచ్చే నెల నుంచి షాహీన్‌ అఫ్రిది జట్టు పగ్గాలు చేపట్టనున్నట్లు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) మంగళవారం వెల్లడించింది. ఇస్లామాబాద్‌ వేదికగా జరిగిన సమావేశంలో జాతీయ సెలెక్టర్లు, అడ్వైజరీ బోర్డు సభ్యులు, హెడ్‌ కోచ్‌ మైక్‌ హసన్‌ చర్చించిన అనంతరం ఈ కెప్టెన్సీ మార్పు జరిగింది. అయితే సారథ్య మార్పునకు గల కారణాన్ని మాత్రం బోర్డు వెల్లడించలేదు.

రిజ్వాన్‌ సారథ్యంలో కీలక విజయాలు..
గతంలో టీ20 కెప్టెన్‌గా వ్యవహరించిన 25 ఏళ్ల షాహీన్‌... పాకిస్తాన్‌ జాతీయ జట్టు తరఫున 66 వన్డేలు, 92 టీ20లు, 32 టెస్టులు ఆడాడు. మొహమ్మద్‌ రిజ్వాన్‌ సారథ్యంలో ఆడిన 20 వన్డేల్లో పాకిస్తాన్‌ జట్టు 9 విజయాలు సాధించి మరో 11 మ్యాచ్‌ల్లో ఓడింది. ఆస్ట్రేలియా, జింబాబ్వే, దక్షిణాఫ్రికాలో రిజ్వాన్‌ సారథ్యంలోని పాకిస్తాన్‌ జట్టు వన్డే సిరీస్‌లు గెలిచింది. 

అయితే ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో మాత్రం పేలవ ప్రదర్శన కనబర్చింది. ముఖ్యంగా రిజ్వాన్‌ కెప్టెన్సీలో ఆటకంటే ఆధ్యాత్మిక చర్చ ఎక్కువైపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. దానికి తోడు హెడ్‌ కోచ్‌ పట్టుబట్టడంతోనే కెప్టెన్సీ మార్పు జరిగినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  

రోజుకు ఐదుసార్లు
ఈ నేపథ్యంలో పీటీఐ కథనం ఆసక్తికరంగా మారింది. ‘‘క్రికెట్‌లో రిజ్వాన్‌ మతపరమైన విషయాలను తీసుకువస్తున్నాడని బోర్డు పెద్దలు భావించారు. ఇది కొంతమంది ప్లేయర్లకు అసౌకర్యం కలిగించింది. రిజ్వాన్‌ తన మతపరమైన విశ్వాసాలను మీడియా ముఖంగానూ వెల్లడించడంలో సంశయించడు.

పాకిస్తాన్‌ బ్యాటర్‌ ఇమామ్‌-ఉల్‌-హక్‌ చెప్పిన వివరాల ప్రకారం.. రిజ్వాన్‌.. జట్టు బస చేసే హోటళ్లలో ప్రత్యేకంగా సెషన్లు ఏర్పాటు చేసి మరీ.. రోజుకు ఐదుసార్లు ప్రార్థన చేయాలనే నియమం పెట్టాడు’’ అని పీటీఐ కథనం పేర్కొంది.

సరోగేట్‌ యాడ్స్‌కు అతడు వ్యతిరేకం!
అయితే, పీసీబీ వర్గాలు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ.. ఇందుకు భిన్నమైన వాదన వినిపించాయి. ‘‘బెట్టింగ్‌ కంపెనీలను ప్రమోట్‌ చేయలేనని రిజ్వాన్‌ పీసీబీకి చెప్పాడు. బెట్టింగ్‌ సంస్థల కోసం పీసీబీ చేసే సరోగేట్‌ యాడ్స్‌కు అతడు వ్యతిరేకం. అందుకే అతడిపై వేటు వేశారు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. 

చదవండి: IND vs AUS: 244 ప‌రుగులు.. 83.84 స్ట్రైక్ రేటు! అడిలైడ్‌లో అద‌ర‌గొట్టిన విరాట్ కోహ్లి

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Mohammad Rizwan
Shaheen Afridi
Pakistan Cricket Board (PCB)
ODI captaincy
mike hesson
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

పాకిస్తాన్‌ క్రికెట్‌ చారిత్రక ఒప్పందం!

పాకిస్తాన్‌ క్రికెట్‌ చారిత్రక ఒప్పందం!

పాక్‌ జట్టు ప్రకటన.. బీసీసీఐ అలా.. పీసీబీ ఇలా!

పాక్‌ జట్టు ప్రకటన.. బీసీసీఐ అలా.. పీసీబీ ఇలా!

షాహీన్‌ అఫ్రిదికి ఊహించని షాక్‌

షాహీన్‌ అఫ్రిదికి ఊహించని షాక్‌

రెండో వన్డేలోనూ రెచ్చిపోయిన పాక్‌ బౌలర్లు

రెండో వన్డేలోనూ రెచ్చిపోయిన పాక్‌ బౌలర్లు

PSL: తప్పు ఒప్పుకొన్న పాక్‌ బోర్డు.. ఊహించని ట్విస్ట్‌!

PSL: తప్పు ఒప్పుకొన్న పాక్‌ బోర్డు.. ఊహించని ట్విస్ట్‌!

PSL: పిరికిపందలు.. పాక్‌ క్రికెట్‌ బోర్డుకు దిమ్మతిరిగే కౌంటర్‌

PSL: పిరికిపందలు.. పాక్‌ క్రికెట్‌ బోర్డుకు దిమ్మతిరిగే కౌంటర్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.