Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

మంత్రిగా టీమిండియా క్రికెటర్‌ భార్య ప్రమాణ స్వీకారం

Sports Sakshi User Sakshi Sakshi Time Oct 17, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
jadeja.jpg

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ రవీంద్ర జడేజా సతీమణి రివాబా సోలంకి జడేజా (Rivaba Solanki Jadeja) రాజకీయ జీవితంలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. గుజరాత్‌ రాష్ట్ర మంత్రిగా ఆమె శుక్రవారం (అక్టోబరు 17) ప్రమాణ స్వీకారం చేశారు. 

కాగా గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ మినహా మంత్రులంతా గురువారం తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ క్రమంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టగా.. రివాబా జడేజా తాజాగా మంత్రి అయ్యారు.

జడేజాతో ప్రేమ, పెళ్లి
రివాబా సింగ్‌ సోలంకి 1990, నవంబరు 2న జన్మించారు. తండ్రి హర్దేవ్‌ సింగ్‌ సోలంకి బిజినెస్‌మ్యాన్‌ కాగా.. తల్లి ప్రఫుల్లాబా సోలంకి భారత రైల్వేస్‌లో ఉద్యోగిని. రాజ్‌కోట్‌లో ఉన్నత విద్యనభ్యసించిన రివాబా.. మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ చేశారు.

రవీంద్ర జడేజా సోదరి నైనాబాకు రివాబా ఫ్రెండ్‌. ఓ పార్టీలో నైనా.. తన సోదరుడు రవీంద్ర జడేజాకు రివాబాను పరిచయం చేశారు. అలా జడ్డు- రివాబాల మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఇరుకుటుంబాల సమ్మతితో 2016లో వీరు పెళ్లి చేసుకున్నారు. ఆ మరుసటి ఏడాదే అంటే.. 2017లో రివాబా- జడ్డూ దంపతులకు కూతురు నిధ్యానా జన్మించింది.

సామాజిక సేవ
పెళ్లికి ముందు నుంచే రివాబా తన నాయకత్వ లక్షణాలు నిరూపించుకున్నారు. రాజ్‌పుత్‌లకు చెందిన కర్ణి సేన మహిళా విభాగానికి ఆమె అధ్యక్షురాలిగా పనిచేశారు. ఈ క్రమంలో 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు రివాబా బీజేపీలో చేరారు.

ఈ క్రమంలో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రివాబా ఎమ్మెల్యేగా గెలుపొందారు. మాతృశక్తి అనే చారిటబుల్‌ ట్రస్టు ద్వారా మహిళా సాధికారికత, సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇలా జడ్డూ భార్యగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న రివాబా.. చిన్న వయసులోనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం.

టీమిండియా అత్యుత్తమ ఆల్‌రౌండర్‌
సౌరాష్ట్ర స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా 2009లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 87 టెస్టులు, 204 వన్డేలు, 74 టీ20 మ్యాచ్‌లు ఆడిన జడ్డూ.. ఆయా ఫార్మాట్లలో 3990, 2806, 515 పరుగులు సాధించాడు. 

ఈ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ఖాతాలో 338 టెస్టు వికెట్లు, 231 వన్డే వికెట్లు, 54 టీ20 వికెట్లు ఉన్నాయి. ఇక భార్య రివాబాతో కలిసి జడ్డూ సైతం గతంలోనే బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

చదవండి: అఫ్గాన్ చేతిలో వైట్ వాష్‌.. బంగ్లాదేశ్ క్రికెట‌ర్ల వాహ‌నాల‌పై దాడి!
 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Ravindra Jadeja
Rivaba Solanki
Gujarat
Off the field
Women Ministers
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వ్యవసాయానికి మించిన కథ..! 40 ఏళ్ల వయసులో ట్రాక్టర్‌ డ్రైవింగ్‌ ..

వ్యవసాయానికి మించిన కథ..! 40 ఏళ్ల వయసులో ట్రాక్టర్‌ డ్రైవింగ్‌ ..

పారిశ్రామికవేత్తగా గృహిణి..! ఏడాదికి రూ. 1.85 కోట్లు..

పారిశ్రామికవేత్తగా గృహిణి..! ఏడాదికి రూ. 1.85 కోట్లు..

ODI WC: అతడిని పక్కనపెడితే మూర్ఖత్వమే అవుతుంది!

ODI WC: అతడిని పక్కనపెడితే మూర్ఖత్వమే అవుతుంది!

అంతుచిక్కని సంఘటన.. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం క్రాష్ పై బయటకు రాని నిజాలు

అంతుచిక్కని సంఘటన.. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం క్రాష్ పై బయటకు రాని నిజాలు

విమానం టాయిలెట్‌లో బంగారం.. ఎంతుందంటే..?

విమానం టాయిలెట్‌లో బంగారం.. ఎంతుందంటే..?

ఆడుకుంటూనే మృత్యు ఒడికి.. 

ఆడుకుంటూనే మృత్యు ఒడికి.. 

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.