Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

Ranji Trophy: కేరళ కెప్టెన్‌ సంజూ కాదు!.. కారణం ఇదే!

Sports Sakshi User Sakshi Sakshi Time Oct 18, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
sanju2.jpg

టీమిండియా క్రికెటర్‌ సంజూ శాంసన్‌ రంజీ బరిలో దిగనున్నాడు. సొంత రాష్ట్రం కేరళ తరఫున రెడ్‌బాల్‌ టోర్నీలో పాల్గొననున్నాడు. అయితే, ఈసారి కెప్టెన్‌గా గాకుండా కేవలం వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గానే ఆడనున్నాడు. ఇందుకు కారణం ఏమిటంటే..?

టెస్టుల్లో అరంగేట్రం చేయాలని ఉందని సంజూ శాంసన్‌ ఇటీవల తన మనసులోని మాట వెల్లడించిన విషయం తెలిసిందే. మేనేజ్‌మెంట్‌ సైతం ఇందుకు సుముఖంగా ఉందని పరోక్షంగా తెలిపాడు. యాజమాన్యం సూచనల మేరకే తాను దులిప్‌ ట్రోఫీ-2024 బరిలో దిగానన్నాడు సంజూ.

ఇక ఆ టోర్నీలో విధ్వంసకర శతకంతో ఆకట్టుకున్న సంజూ శాంసన్‌.. తదుపరి బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ సందర్భంగా టీమిండియాతో చేరాడు. సొంతగడ్డపై జరిగిన ఈ సిరీస్‌ మూడో మ్యాచ్‌లో సెంచరీతో దుమ్ములేపాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి టీమిండియా 3-0తో బంగ్లాను క్లీన్‌స్వీప్‌ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు.

కారణం ఇదే
ఈ నేపథ్యంలో ఇటీవల ఓ స్పోర్ట్స్‌ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. తాను త్వరలోనే టెస్టుల్లో అరంగేట్రం చేస్తాననే సంకేతాలు ఇచ్చాడు. ఇందుకు రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌లో అతడు రాణించాల్సి ఉంది. అయితే,  గత ఎడిషన్‌లో కేరళ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన సంజూ ఈసారి.. సారథ్య బాధ్యతలకు దూరమయ్యాడు. టీమిండియా నవంబరులో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుండటమే ఇందుకు కారణం.

రంజీ తాజా ఎడిషన్‌లో సచిన్‌ బేబీ సారథ్యంలో కేరళ తొలుత పంజాబ్‌తో మ్యాచ్‌ ఆడి.. 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. తదుపరి శుక్రవారం నుంచి కర్ణాటకతో తలపడేందుకు సిద్ధం కాగా.. అవుట్‌ఫీల్డ్‌ తడిగా ఉన్న కారణంగా టాస్‌ ఆలస్యమైంది. ఇదిలా ఉంటే.. టీమిండియా టీ20 సిరీస్‌ షెడ్యూల్‌ కారణంగా సంజూ కొన్ని రంజీ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది.

ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌(నవంబరు 6-9), హర్యానా(నవంబరు 13- 16)తో కేరళ ఆడే మ్యాచ్‌లకు సంజూ అందుబాటులో ఉండకపోవచ్చు. ఆ సమయంలో (నవంబరు 8 నుంచి) టీమిండియా టీ20 సిరీస్‌ కోసం సౌతాఫ్రికాకు వెళ్లనుంది. అందుకే సంజూ కేరళ జట్టు కెప్టెన్సీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

చదవండి: IND Vs NZ 1st Test: పాపం రోహిత్‌ శర్మ!.. ఆనందం ఆవిరి.. అన్‌లక్కీ భయ్యా!

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Sanju Samson
Ranji Trophy
India Vs South Africa
kerala cricket
sachin baby
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

కోహ్లి బాటలో సంజూ శాంసన్‌..!

కోహ్లి బాటలో సంజూ శాంసన్‌..!

సంజూను కావాలనే తప్పించారా?

సంజూను కావాలనే తప్పించారా?

సంజు, ఇషాన్ అవుట్.. వైభవ్ ఎంట్రీ

సంజు, ఇషాన్ అవుట్.. వైభవ్ ఎంట్రీ

చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్‌

చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్‌

సౌతాఫ్రికాతో మ్యాచ్‌.. బ్యాటింగ్‌ భారత్‌దే! యువ ప్లేయర్‌ డెబ్యూ

సౌతాఫ్రికాతో మ్యాచ్‌.. బ్యాటింగ్‌ భారత్‌దే! యువ ప్లేయర్‌ డెబ్యూ

సంజుకు షాక్ ఇచ్చిన BCCI.. ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు ప్రకటన

సంజుకు షాక్ ఇచ్చిన BCCI.. ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు ప్రకటన

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.