Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT

Ranji Trophy: ఉత్కంఠ పోరులో ఘన విజయం.. మూడోసారి ఫైనల్‌కు

Sports Sakshi User Sakshi Sakshi Time Mar 6, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
bcci.jpg

నాగ్‌పూర్‌: రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌లో విదర్భ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆఖరి రోజు వరకు రసవత్తరంగా సాగిన సెమీస్‌లో మధ్యప్రదేశ్‌ను ఓడించి తుదిపోరుకు అర్హత సాధించింది. ఆఖరి మెట్టుపై ముంబైతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది.

నాగ్‌పూర్‌ వేదికగా మధ్యప్రదేశ్‌- విదర్భ మధ్య రంజీ తాజా ఎడిషన్‌ తొలి సెమీ ఫైనల్‌ జరిగింది. శనివారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన విదర్భ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. మధ్యప్రదేశ్‌ బౌలర్ల దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 170 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయింది.

ఈ క్రమంలో బ్యాటింగ్‌ మొదలుపెట్టిన మధ్యప్రదేశ్‌ 252 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ ముగించింది. వికెట్‌ కీపర్‌ హిమాన్షు మంత్రి అద్భుత శతకం(126) కారణంగా ఈ మేరకు మెరుగైన స్కోరు సాధించింది. 

విదర్భపై 82 పరుగుల ఆధిక్యం సంపాదించింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విదర్భ 402 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆరో నంబర్‌ బ్యాటర్‌ యశ్‌ రాథోడ్‌ సూపర్‌ సెంచరీ(141), కెప్టెన్‌, వికెట​ కీపర్‌ బ్యాటర్‌ అక్షయ్‌ వాడ్కర్‌ అద్భుత అర్ధ శతకం(77) కారణంగా మధ్యప్రదేశ్‌కు దీటుగా బదులివ్వగలిగింది. మధ్యప్రదేశ్‌కు 321 పరుగుల లక్ష్యం విధించింది.

ఈ క్రమంలో మంగళవారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మధ్యప్రదేశ్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 71 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. గెలుపు దక్కాలంటే మధ్యప్రదేశ్‌ మరో 93 పరుగులు చేయాల్సి ఉండగా... నాలుగు వికెట్లు పడగొడితే విదర్భ మూడోసారి ఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకునే స్థితిలో నిలిచింది.

ఈ క్రమంలో బుధవారం నాటి ఐదో రోజు ఆటను 228/6 ఓవర్‌నైట్‌ స్కోరుతో మొదలుపెట్టిన మధ్యప్రదేశ్‌.. ఆరంభంలోనే కుమార్‌ కార్తికేయ(4), అతడి స్థానంలో వచ్చిన అనుభవ్‌ అగర్వాల్‌(6) వికెట్లు కోల్పోయింది.

నైట్‌వాచ్‌ మన్‌ సారాంశ్‌ జైన్‌ ఆవేశ్‌ ఖాన్‌తో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ 25 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతడు బౌల్డ్‌ కావడంతో.. మధ్యప్రదేశ్‌ తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. ఈ క్రమంలో 81.3 ఓవర్‌ వద్ద ఖెజ్రోలియా(11) బౌల్డ్‌ అవడంతో మధ్యప్రదేశ్‌ ఓటమి ఖరారైంది. 

𝐕𝐢𝐝𝐚𝐫𝐛𝐡𝐚 𝐚𝐫𝐞 𝐢𝐧𝐭𝐨 𝐭𝐡𝐞 𝐟𝐢𝐧𝐚𝐥! 🙌🙌



They beat Madhya Pradesh by 62 runs in a tightly fought contest.



A terrific comeback from the Akshay Wadkar-led side 👌@IDFCFIRSTBank | #VIDvMP | #RanjiTrophy | #SF1



Scorecard ▶️ https://t.co/KsLiJPuqXr pic.twitter.com/YFY1kaO1x7

— BCCI Domestic (@BCCIdomestic) March 6, 2024

విదర్భ 62 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్లో అడుగుపెట్టింది. అద్భుత శతకంతో విదర్భ విజయంలో కీలక పాత్ర పోషించిన యశ్‌ రాథోడ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు.

కాగా అంతకుముందు మరో సెమీస్‌ మ్యాచ్‌లో ముంబై తమిళనాడుపై గెలిచి రికార్డు స్థాయిలో 48వ సారి ఫైనల్లో ప్రవేశించింది. ఇక విదర్భ ఫైనల్‌ చేరడం ఇది మూడోసారి. మార్చి 10న ముంబై, విదర్భ టైటిల్‌ కోసం పోటీ మొదలుపెట్టనున్నాయి.

Timber Strikes 🔥



Vidarbha wrapped it up early today, picking up the remaining 4️⃣ wickets to enter the final. 👌@IDFCFIRSTBank | #VIDvMP | #RanjiTrophy | #SF1



Scorecard ▶️ https://t.co/KsLiJPuYMZ pic.twitter.com/ny6DYBQ7bM

— BCCI Domestic (@BCCIdomestic) March 6, 2024

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Ranji Trophy
vidharbha
Madhya Pradesh
mumbai
Ranji final
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

నిజం చెరగకూడదని.. చేతులు, కాళ్ల నిండా సూసైడ్‌ లేఖ రాసుకుని..

నిజం చెరగకూడదని.. చేతులు, కాళ్ల నిండా సూసైడ్‌ లేఖ రాసుకుని..

వర్షపు నీటిలో పరీక్షల ప్రశ్నపత్రాలు

వర్షపు నీటిలో పరీక్షల ప్రశ్నపత్రాలు

ఆలస్యంగా వచ్చి.. అంతకంతకూ పెరిగి

ఆలస్యంగా వచ్చి.. అంతకంతకూ పెరిగి

మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ నడుస్తూ మ్యాన్‌హోల్‌లో పడి..

మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ నడుస్తూ మ్యాన్‌హోల్‌లో పడి..

ముంబై: మరో 48 గంటల్లో రుతుపవనాలు!

ముంబై: మరో 48 గంటల్లో రుతుపవనాలు!

22 ఏళ్లకే ఫేమస్.. ఎవరూ ఊహించని విధంగా మృతి

22 ఏళ్లకే ఫేమస్.. ఎవరూ ఊహించని విధంగా మృతి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.