Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT

లేటు వయసులో రెచ్చిపోతున్న ధోని ఫ్రెండ్‌.. మొన్న డబుల్‌ సెంచరీ, ఇప్పుడు సెంచరీ

Sports Sakshi User Sakshi Sakshi Time Jan 24, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Untitled-7_0.jpg

Ranji Trophy 2022-23: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని సహచరుడు, ఐపీఎల్‌లో సీఎస్‌కే మాజీ సభ్యుడు, మహారాష్ట్ర వెటరన్‌ ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌ లేటు వయసులో అబ్బురపరిచే ప్రదర్శనతో చెలరేగిపోతున్నాడు. 37 ఏళ్ల కేదార్‌ జాదవ్‌ ప్రస్తుత రంజీ సీజన్‌లో (2022-23) వరుస సెంచరీలతో అదరగొడుతున్నాడు.

కొద్ది రోజుల కిందట అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో భారీ ద్విశతకంతో (283 బంతుల్లో 21 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 283 పరుగులు) విరుచుకుపడిన కేదార్‌.. ఇవాళ (జనవరి 24) ముంబైతో ప్రారంభమైన కీలకమైన మ్యాచ్‌లో సెంచరీతో (168 బంతుల్లో 128; 18 ఫోర్లు, సిక్స్‌) కదం తొక్కాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన మహారాష్ట్ర తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది.

కేదార్‌ సెంచరీతో ఆదుకోకపోయుంటే మహారాష్ట్ర కనీసం 200 పరుగులు చేయడం కూడా కష్టమయ్యేది. సౌరభ్‌ నవాలే (56), అశయ్‌ పాల్కర్‌ (32) క్రీజ్‌లో ఉన్నారు. ముంబై బౌలర్లలో తుషార్‌ దేశ్‌పాండే, మోహిత్‌ అవస్తి, షమ్స్‌ ములానీ తలో 2 వికెట్లు పడగొట్టారు. కాగా, ముంబై జట్టు భీకర ఫామ్‌లో ఉన్న సర్ఫరాజ్‌ ఖాన్‌ను ఈ మ్యాచ్‌లో ఆడించకపోవడం కొసమెరుపు. 

ఇదిలా ఉంటే, ఎలైట్‌ గ్రూప్‌-బిలో పోటీపడుతున్న మహారాష్ట్ర, ముంబై జట్లు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో చెరో 3 విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో 2 (మహారాష్ట్ర, 25 పాయింట్లు), 3 (ముంబై, 23 పాయింట్లు) స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ గ్రూప్‌లో సౌరాష్ట్ర (6 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 26 పాయింట్లు) తొలి స్థానంలో, ఆంధ్రప్రదేశ్‌ (6 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 19 పాయింట్లు) నాలుగో ప్లేస్‌లో ఉన్నాయి.

తమిళనాడు (15 పాయింట్లు), అస్సాం (11 పాయింట్లు), ఢిల్లీ (11 పాయింట్లు), హైదరాబాద్‌ (1 పాయింట్‌) వరుసగా 5 నుంచి 8 స్థానాల్లో నిలిచాయి. క్వార్టర్స్‌ బెర్తు కోసం ఈ గ్రూప్‌ నుంచి సౌరాష్ట్ర, మహారాష్ట్ర, ముంబై జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మరోవైపు గ్రూప్‌-సి నుంచి కర్ణాటక, గ్రూప్‌-ఏ నుంచి బెంగాల్‌ ఇదివరకే క్వార్టర్స్‌ బెర్తును ఖరారు చేసుకున్నాయి.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Kedar Jadhav
MS Dhoni
Ranji Trophy 2022-23
Maharashtra
team india
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

అసలు లెక్క ఇదే.. మహారాష్ట్రలో బీజేపీ బిగ్‌ గేమ్‌!

అసలు లెక్క ఇదే.. మహారాష్ట్రలో బీజేపీ బిగ్‌ గేమ్‌!

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన ధోని

ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన ధోని

మహారాష్ట్రలో భారీ వర్షాలు.. ముంచెత్తిన వరద (ఫొటోలు)

మహారాష్ట్రలో భారీ వర్షాలు.. ముంచెత్తిన వరద (ఫొటోలు)

రైలు బోగీనే హనీమూన్‌ సూట్‌!.. వైరల్‌ వీడియోపై విమర్శలు

రైలు బోగీనే హనీమూన్‌ సూట్‌!.. వైరల్‌ వీడియోపై విమర్శలు

టీమిండియా ఆటతీరుపై శ్రేయస్‌ ఆగ్రహం

టీమిండియా ఆటతీరుపై శ్రేయస్‌ ఆగ్రహం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
Advertisement
 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.