విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత అరంగేట్రం ఆటగాడు రజత్ పాటిదార్‌ను దురదృష్టం వెంటాడింది. ఈ మ్యాచ్‌లో మంచి టచ్‌లో కన్పించిన పాటిదార్ ఊహించని విధంగా ఔటయ్యాడు. కేఎల్ రాహుల్ స్ధానంలో జట్టులోకి వచ్చిన పాటిదార్.. నాలుగో వికెట్‌కు ఓపెనర్ యశస్వి జైస్వాల్‌తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
అయితే భారత ఇన్నింగ్స్‌లో 72 ఓవర్ వేసిన ఇంగ్లీష్ లెగ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో తొలి బంతిని పాటిదార్ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ చివర భాగాన తగిలి బౌన్స్ అయ్యి స్టంప్స్‌ను గిరాటేసింది. అతడు తన కాలితో బంతిని అపడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం మాత్రం దక్కలేదు.
దీంతో 32 పరుగులు చేసిన పాటిదార్ నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్యాడ్ లక్ అంటే నీదే బ్రో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ యశస్వీ జైశ్వాల్(179 నాటౌట్) సూపర్ సెంచరీతో చెలరేగాడు.
చదవండి: IND vs ENG: అంపైర్‌తో వాగ్వాదానికి దిగిన అశ్విన్..
Kohli ke team se aata hai to Luck bhi toh Kohli jaisa hi hoga na😭😭😭
Bad luck Rajat Patidar🤞 pic.twitter.com/IBCfrJwexj— Vahini🕊️ (@fairytaledust_) February 2, 2024