Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

రొనాల్డోకు ఏమైంది?.. అతడు ఆడలేడని మాకు ముందే తెలుసు!

Sports Sakshi User Sakshi Sakshi Time Jun 19, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ronaldo.jpg

‘నువ్వు గోల్‌ కొట్టకపోయినా పర్లేదు.. టీమ్‌ మాత్రం కచ్చితంగా స్కోరు చేయాలి.. అందుకు నువ్వు సహకరించాలి’- పోర్చుగల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డోను ఉద్దేశించి ఫ్రాన్స్‌ మాజీ ఫుట్‌బాలర్‌ థియెరి హెన్రీ చేసిన విమర్శలు.. ఈ మాటలు అతడి  ప్రస్తుత పరిస్థితికి సరిగ్గానే సరిపోతాయి. 

ఫిఫా ప్రపంచకప్‌-2022లో అర్జెంటీనాను విజేతగా నిలిపి లియోనల్‌ మెస్సీ తన చిరకాల కలను నెరవేర్చుకున్నాడు. అయితే, మెస్సీ సమకాలీన దిగ్గజం రొనాల్డోకు మాత్రం చేదు అనుభవమే మిగింది. 

తొలి మ్యాచ్‌లోనే షాక్‌
నాటి సంగతి పక్కనపెడితే.. తాజాగా ఫిఫా ప్రపంచకప్‌-2026లోనూ తొలి మ్యాచ్‌లో పోర్చుగల్‌కు భంగపాటే ఎదురైంది. 52 ఏళ్ల తర్వాత తొలిసారి ఫిఫాలో అడుగుపెట్టిన డిఆర్‌ కాంగో జట్టుపై పోర్చుగల్‌ గెలవలేకపోయింది.

మ్యాచ్‌ 1-1తో సమం కాగా డ్రాతో సరిపెట్టుకుంది. ఇందుకు రొనాల్డో చెత్త ప్రదర్శనే కారణం. టెక్సాస్‌ వేదికగా ఈ దిగ్గజ ఫుట్‌బాలర్‌ ఆట చూద్దామని వచ్చిన వాళ్లకు అతడు నిరాశే మిగిలిచ్చాడు.

టార్గెట్‌ దిశగా రొనాల్డో ఒక్క గోల్‌ కూడా కొట్టలేకపోయాడు. రెండు నామమాత్రపు షాట్లతో సరిపెట్టుకుని ప్రత్యర్థికి డ్రా చేసుకునే అవకాశం ఇచ్చాడు. నిజానికి పోర్చుగల్‌ ఆ ఒక్క గోల్‌ సాధించడానికి కారణమైన జోవో నెవ్స్‌కు అభిమానులు కృతజ్ఞతలు చెప్పుకొంటున్నారు.

41 ఏళ్ల ‘యువకుడు’
Age is Just a number అంటారు. కానీ అథ్లెట్ల విషయంలో వయసు పైబడుతున్న కొద్దీ ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. రొనాల్డో విషయంలో ఇప్పుడదే జరుగుతోంది. 41 ఏళ్ల ఈ పోర్చుగల్‌ స్టార్‌ ప్రపంచ కప్‌ ఆడుతున్న అత్యధిక వయస్కుడైన ఆటగాడిగా బరిలోకి దిగాడు.

ఒకప్పుడు మైదానంలో పాదరసంలా కదులుతూ.. డ్రిబ్లింగ్‌లో తనకు తానే సాటి అనిపించుకున్న రొనాల్డోలో ఇప్పుడా వేగం లోపించినట్లే కనిపిస్తోంది. మ్యాచ్‌ అనంతరం కాంగో మిడ్‌ఫీల్డర్‌ ఎంగల్యేల్‌ ముకావ్‌ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.

అతడు ఆడలేడని మాకు తెలుసు
‘‘రొనాల్డో మునుపటిలా లేడని మాకు ముందే తెలుసు. అతడు గతంలో కంటే అత్యంత నెమ్మదిగా పరిగెడుతున్నాడు. గోల్‌ కొట్టేందుకు పెద్దగా ప్రయత్నాలు కూడా చేయలేదు. కాబట్టి అతడిని ఆపడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. మా డిఫెన్స్‌ ఆ పనిని విజయవంతంగా పూర్తి చేసింది’’ అని ముకావ్‌ పేర్కొన్నాడు.

ప్రదర్శన అంతంత మాత్రమే
నిజానికి గత పది వరల్డ్‌కప్‌, యూరో మ్యాచ్‌లలో రొనాల్డో ఒక్క గోల్‌ కూడా చేయలేదు. దీనిని బట్టి అతడి ప్రదర్శన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఆల్‌ నసర్‌ తరఫున సౌదీ ప్రో లీగ్‌లో 30 మ్యాచ్‌లలో కలిపి రొనాల్డో 28 గోల్స్‌ కొట్టాడు. దీనిని బట్టి అతడు ప్రపంచకప్‌నకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాడనే అంతా భావించారు.

కానీ తొలి మ్యాచ్‌లోనే అంతా తలకిందులైంది. ఇక అంతకు ముందు మేజర్‌ టోర్నీల్లోని గత నాలుగు మ్యాచ్‌లలో పోర్చుగల్‌ తరఫున కూడా ఈ సూపర్‌స్టార్‌  పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. సమకాలీకుడు 39 ఏళ్ల మెస్సీతో పోలిస్తే రొనాల్డో ప్రస్తుతం బాగా వెనుబడ్డాడు.

మెస్సీ అలా.. రొనాల్డో ఇలా
ప్రపంచకప్‌లో మెస్సీ, అతడి జట్టు డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాకు తగినట్లుగా ఆడుతోంది. మెస్సీ సైతం పాస్‌ చేసేందుకు మాత్రమే ఎక్కువగా ప్రయత్నిస్తూ కొత్త పాత్రలో ఒదిగిపోయే ప్రయత్నం చేస్తున్నాడు. అదే సమయంలో పోర్చుగల్‌ తమకు ఉన్న అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోలేకపోతోంది.

కాంగోతో మ్యాచ్‌లో బంతిని చాలా సేపు తమ నియంత్రణలోనే ఉంచుకున్నప్పటికీ పోర్చుగల్‌ గోల్‌ కొట్టలేకపోవడం ఇందుకు నిదర్శనం. ఇక ఈ మ్యాచ్‌లో రొనాల్డోను పూర్తి స్థాయిలో అంటే 90 నిమిషాల పాటు ఆడించడం సరైన నిర్ణయమని పోర్చుగల్‌ హెడ్‌కోచ్‌ రొబెర్టో మార్టినెజ్‌ సమర్థించుకున్నాడు.

ప్రపంచకప్‌ చరిత్రలోనే అత్యంత గొప్ప గోల్‌స్కోరర్‌ సేవలను తాము పరిమితం చేయాలని అనుకోవడం లేదన్నాడు. ఒక్క మ్యాచ్‌తోనే అతడిని జడ్జ్‌ చేయొద్దని మార్టినెజ్‌ విజ్ఞప్తి చేశాడు. 

అతిపెద్ద బలహీనతగా
ఏదేమైనా.. థియెర్రీ చెప్పినట్లు కాంగోతో మ్యాచ్‌లో రొనాల్డో తానూ స్కోర్‌ చేయలేదు. జట్టు స్కోర్‌ చేసేందుకు అవకాశాలు సృష్టించలేదు. ఇదే పునరావృతమైతే పోర్చుగల్‌కు బలంగా భావించే రొనాల్డో అతిపెద్ద బలహీనతగా మారాడనే విమర్శలు తీవ్రమవడం ఖాయం.

చదవండి: డబుల్‌ సెంచరీ చేయాలనుకున్నా... కానీ: శుబ్‌మన్‌ గిల్‌

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Cristiano Ronaldo
FIFA World Cup 2026
Portugal
Congo
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

FIFA World Cup 2026 : ఫిఫా 2026 విశ్వవిజేత స్పెయిన్‌ (ఫొటోలు)

FIFA World Cup 2026 : ఫిఫా 2026 విశ్వవిజేత స్పెయిన్‌ (ఫొటోలు)

మెస్సి మ్యాజిక్.. వరుస విజయలతో అర్జెంటీనా జోరు..

మెస్సి మ్యాజిక్.. వరుస విజయలతో అర్జెంటీనా జోరు..

క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన స్విట్జర్లాండ్‌

క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన స్విట్జర్లాండ్‌

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

రొనాల్డో కథ ముగిసింది.. ప్రీ క్వార్టర్స్‌లో పోర్చుగల్‌ ఓటమి

రొనాల్డో కథ ముగిసింది.. ప్రీ క్వార్టర్స్‌లో పోర్చుగల్‌ ఓటమి

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు నెయ్‌మార్‌ వీడ్కోలు

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు నెయ్‌మార్‌ వీడ్కోలు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.