Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

ప్లే ఆఫ్స్‌కు వేళాయె...

Sports Sakshi User Sakshi Sakshi Time Oct 25, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
pro.jpg

నేటి నుంచి పీకేఎల్‌ ఆఖరి అంకం

‘ప్లే ఇన్స్‌’లో నేడు హరియాణా స్టీలర్స్‌తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ ‘ఢీ’

యు ముంబాతో పట్నా పైరేట్స్‌ పోరు 

గెలిచిన జట్లే ముందుకు  

న్యూఢిల్లీ: దాదాపు రెండు నెలలుగా క్రీడాభిమానులను అలరిస్తున్న ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) 12వ సీజన్‌ చివరి దశకు చేరుకుంది. హోరాహోరీ సమరాలు... ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లతో సాగిన లీగ్‌ దశ ముగియగా... శనివారం నుంచి ప్లే ఆఫ్స్‌ ప్రారంభం కానున్నాయి. ఈ సీజన్‌లో మొత్తం 12 జట్లు పోటీపడగా... అందులో పాయింట్ల పట్టికలో తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరాయి. గతం కంటే భిన్నంగా జరుగుతున్న ఈ సీజన్‌లో నేటి నుంచి మరింత రసవత్తర మ్యాచ్‌లు జరగనున్నాయి. 

లీగ్‌ దశలో జరిగిన 108 మ్యాచ్‌లను దేశంలోని నాలుగు నగరాల్లో నిర్వహించగా... ఇప్పుడు ఆఖరి అంకం ఢిల్లీలో సాగనుంది. ప్లే ఆఫ్స్‌ ప్రారంభానికి ముందు ట్రోఫీ కోసం పోటీపడుతున్న 8 జట్ల కెప్టెన్‌లతో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ‘ఈ సీజన్‌ చాలా హోరాహోరీగా సాగింది. లీగ్‌ దశలో జరిగిన మొత్తం 108 మ్యాచ్‌ల్లో 48 మ్యాచ్‌లు కేవలం 5 పాయింట్ల తేడాతో ఫలితం తేలాయి. 27 మ్యాచ్‌ల్లో చివరి 90 సెకన్లలో ఫలితాలు తారుమారయ్యాయి. 

సీజన్‌ మొత్తం దాదాపు అన్ని రోజులూ రెయిడర్లు ‘సూపర్‌–10’లు సాధించారు. ఇక చివరి దశకు సమయం ఆసన్నమైంది. ఈ వారం మరింత ఉత్కంఠగా ఉండబోనుంది’ అని పీకేఎల్‌ చైర్మన్‌ అనుపమ్‌ గోస్వామి అన్నారు. ఈ సీజన్‌తోనే పీకేఎల్‌లో ‘టై బ్రేకర్‌’ విధానాన్ని ప్రవేశ పెట్టగా... మరింత పోటీతత్వం కనిపించింది. ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ దక్కించుకునేందుకు అన్నీ జట్లు హోరాహోరీగా పోరాడగా... లీగ్‌ దశలో అది్వతీయ ప్రదర్శన కనబర్చిన పుణేరి పల్టన్, దబంగ్‌ ఢిల్లీ చెరో 26 పాయింట్లతో పట్టిక తొలి రెండు స్థానాలు దక్కించుకున్నాయి. 

లీగ్‌ ప్రారంభమైన నెలన్నర వరకు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న పట్నా పైరేట్స్‌... ఆ తర్వాత విజృంభించింది. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో నెగ్గి ఏడో స్థానంతో ప్లే ఆఫ్స్‌లో అడుగు పెట్టింది. ‘ఒత్తిడిలో జట్టును ఎలా నడిపించాలో నేర్చుకున్నాను. ఆ పాఠాలు ఇప్పుడు కెప్టెన్‌గా పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ఉపయోగ పడుతున్నాయి. ఈ దశకు చేరుకోవడానికి జట్టుగా మేము ఎంతో కష్టపడ్డాం. అదే క్రమశిక్షణను ప్లే ఆఫ్స్‌లో కూడా కనబరుస్తాం’ అని పుణేరి పల్టన్‌ కెపె్టన్‌ అస్లమ్‌ ఇమాన్‌దార్‌ అన్నాడు. 

‘ప్లే ఆఫ్స్‌లో ప్రతి పాయింట్‌ కీలకమే. ఒక్క రెయిడ్‌తో మ్యాచ్‌ మొత్తం మారిపోవచ్చు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్రశాంతంగా ఉండటమే నా బలం. దూకుడు మన దృష్టిని మరల్చుతుంది. ఒత్తిడి పెరుగుతున్నప్పుడు నన్ను నేను నియంత్రించుకుంటా. సీజన్‌ మొత్తం గొప్పగా పోరాడాం. 

ప్లే ఆఫ్స్‌లో కూడా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలని అనుకుంటున్నాం’ అని దబంగ్‌ ఢిల్లీ సారథి అశు మలిక్‌ వెల్లడించాడు. గతంతో పోలిస్తే కాస్త సంక్లిష్టంగా ఉన్న ప్లే ఆఫ్స్‌ విధానంలో... పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లకు ఫైనల్‌కు చేరేందుకు సులువైన అవకాశం ఉండగా... మిగిలిన జట్లు తుదిపోరుకు అర్హత సాధించాలంటే తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది.  

పీకేఎల్‌ 12వ సీజన్‌ప్లే ఆఫ్స్‌ను ఓసారి పరిశీలిస్తే.. 
» శనివారం జరగనున్న తొలి ‘ప్లే ఇన్‌’ పోరులో డిఫెండింగ్‌ చాంపియన్‌ హరియాణా స్టీలర్స్‌తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ తలపడనుంది. రెండో ‘ప్లే ఇన్‌’ మ్యాచ్‌లో యు ముంబాతో పట్నా పైరేట్స్‌ ఆడుతుంది.  

»    ‘ప్లే ఇన్స్‌’లో గెలిచిన జట్లు... ఆదివారం జరగనున్న ఎలిమినేటర్‌–1లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. అదే రోజు మినీ క్వాలిఫయర్‌లో భాగంగా... పాయింట్ల పట్టికలో మూడో, నాలుగో స్థానంలో నిలిచిన బెంగళూరు బుల్స్, తెలుగు టైటాన్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది.  

»  బెంగళూరు బుల్స్, తెలుగు టైటాన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓడిన జట్టు... ఎలిమినేటర్‌–1 విజేతతో సోమవారం ఎలిమినేటర్‌–2 మ్యాచ్‌ ఆడనుంది.  

»   ఎలిమినేటర్‌–2లో గెలిచిన జట్టు... బెంగళూరు బుల్స్, తెలుగు టైటాన్స్‌ మధ్య జరిగిన మినీ క్వాలిఫయర్‌ మ్యాచ్‌ విజేతతో మంగళవారం ఎలిమినేటర్‌–3 ఆడనుంది.  

»  పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పుణేరి పల్టన్, దబంగ్‌ ఢిల్లీ మధ్య సోమవారం క్వాలిఫయర్‌–1 జరగనుంది.  

» క్వాలిఫయర్‌–1లో విజయం సాధించిన జట్టు నేరుగా ఫైనల్‌ చేరనుండగా... ఓడిన జట్టుకు క్వాలిఫయర్‌–2 రూపంలో మరో అవకాశం ఉంది. 

»  మంగళవారం జరిగే ఎలిమినేటర్‌–3లో గెలిచిన జట్టు... క్వాలిఫయర్‌–1లో ఓడిన టీమ్‌తో బుధవారం క్వాలిఫయర్‌–2 మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది.  

»  శుక్రవారం జరిగే ఫైనల్లో క్వాలిఫయర్‌–1, క్వాలిఫయర్‌–2 విజేతల మధ్య ట్రోఫీ కోసం ఫైనల్‌ ఫైట్‌ జరగనుంది.  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Pro Kabaddi League
Playoffs
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బెంగళూరు ఫైనల్‌ చేరేందుకు ఆఖరి అవకాశం

బెంగళూరు ఫైనల్‌ చేరేందుకు ఆఖరి అవకాశం

PKL 12: విజేతకు ప్రైజ్‌ మనీ ఎంతంటే?.. అవార్డుల జాబితా ఇదే

PKL 12: విజేతకు ప్రైజ్‌ మనీ ఎంతంటే?.. అవార్డుల జాబితా ఇదే

దబంగ్‌ ధమాకా

దబంగ్‌ ధమాకా

దబంగ్‌ ఢిల్లీ x పుణేరి పల్టన్‌... నేడు ప్రొ కబడ్డీ లీగ్‌ ఫైనల్‌

దబంగ్‌ ఢిల్లీ x పుణేరి పల్టన్‌... నేడు ప్రొ కబడ్డీ లీగ్‌ ఫైనల్‌

క్వాలిఫయర్‌–2లో తెలుగు టైటాన్స్‌ పరాజయం... ఫైనల్లో పుణేరి పల్టన్‌

క్వాలిఫయర్‌–2లో తెలుగు టైటాన్స్‌ పరాజయం... ఫైనల్లో పుణేరి పల్టన్‌

బాధపడొద్దు సార్‌.. ఈసారి కప్ తెలుగు టైటాన్స్‌దే!

బాధపడొద్దు సార్‌.. ఈసారి కప్ తెలుగు టైటాన్స్‌దే!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.