Pro Kabaddi League- పంచ్‌కులా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో పుణేరి పల్టన్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. బుధవారంతో లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాయి. పుణేరి పల్టన్ 40–38తో యూపీ యోధాస్‌పై గెలిచి ఓవరాల్‌గా 96 పాయింట్లుతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది.
A comeback of the 𝚑̶𝚒̶𝚐̶𝚑̶𝚎̶𝚜̶𝚝̶ 𝐏𝐚𝐥𝐭𝐚𝐧 order 💪
Aslam & Co. turned things around in style against Yoddhas to confirm their No. 1️⃣ spot 🫡#ProKabaddiLeague #ProKabaddi #PKLSeason10 #PKL10 #PKL #HarSaansMeinKabaddi #PUNvUP #PuneriPaltan #UPYoddhas pic.twitter.com/wOG3cEARlu— ProKabaddi (@ProKabaddi) February 21, 2024
హైదరాబాద్‌లో మిగిలిన మ్యాచ్‌లు
మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 53–39తో హరియాణా స్టీలర్స్‌ను ఓడించింది. పుణేరి పల్టన్, జైపూర్ పింక్ పాంథర్స్, దబంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయింట్స్, హరియాణా స్టీలర్స్, పట్నా పైరేట్స్ టాప్–6లో నిలిచి ప్లే ఆఫ్స్ దశకు అర్హత సాధించాయి.
ఈనెల 26 నుంచి మార్చి 1 వరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ప్లే ఆఫ్స్, సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. మరోవైపు.. తెలుగు టైటాన్స్ తాజా సీజన్లోనూ గత వైఫల్యాలు కొనసాగిస్తూ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.
League stage ✅ Playoffs ⏳
Here’s what the points table looks like after the last league-stage game of #PKLSeason10 🤩#ProKabaddi #HarSaansMeinKabaddi #ProKabaddiLeague #PKL #PKL10 #PUNvUP #HSvBLR pic.twitter.com/KVfiBs14cS— ProKabaddi (@ProKabaddi) February 21, 2024