Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT

ఐపీఎల్‌ చరిత్రలో తొలి కెప్టెన్‌గా పాటిదార్‌ అరుదైన ఘనత

Sports Sakshi User Sakshi Sakshi Time Apr 8, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
rp4.jpg

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) జట్టుకు కెప్టెన్‌గా రజత్‌ పాటిదార్‌ (Rajat Patidar) పేరును ప్రకటించినప్పుడు మిశ్రమ స్పందన వచ్చింది. విరాట్‌ కోహ్లి వంటి దిగ్గజ ఆటగాడి నీడలో ఈ మధ్యప్రదేశ్‌ ఆటగాడు తనదైన ముద్ర వేయగలడా అనే సందేహాలు తలెత్తాయి. అంతేకాదు ‘కింగ్‌’ మాస్‌ క్రేజ్‌ అతడికి ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి.

డిఫెండింగ్‌ చాంపియన్‌పై గెలుపుతో మొదలు
అయితే, రజత్‌ పాటిదార్‌ ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ ఆర్సీబీని విజయపథంలో నడిస్తున్నాడు. ఐపీఎల్‌-2025 (IPL 2025)లో ఇటు బ్యాటర్‌గా.. అటు సారథిగా అద్భుతంగా రాణిస్తూ జట్టుకు వరుస విజయాలు అందిస్తున్నాడు. పాటిదార్‌ సారథ్యంలో సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లోనే ఆర్సీబీ.. డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR)ను మట్టికరిపించింది.

చెన్నైని చెపాక్‌లో ఓడించి
కేకేఆర్‌ను తమ సొంత మైదానం ఈడెన్‌ గార్డెన్స్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓడించి.. గెలుపుతో సీజన్‌ను ఆరంభించింది. అనంతరం.. చెన్నై సూపర్‌ కింగ్స్‌పై 50 పరుగుల తేడాతో గెలుపొందింది. అంతేకాదు.. చెన్నైకి కంచుకోట అయిన చెపాక్‌ స్టేడియంలో ఆర్సీబీ 2008 తర్వాత.. మళ్లీ విజయం సాధించడం ఇదే తొలిసారి.

అయితే, తమ సొంత మైదానం ఎం. చిన్నస్వామి స్టేడియంలో మాత్రం ఆర్సీబీకి పరాభవం ఎదురైంది. హ్యాట్రిక్‌ విజయం అందుకోవాలన్న పాటిదార్‌ సేనపై గుజరాత్‌ టైటాన్స్‌​ నీళ్లు చల్లింది. బెంగళూరు వేదికగా ఆర్సీబీని ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. అయితే, ఆర్సీబీ ఈ ఓటమి నుంచి త్వరగానే కోలుకుంది.

ముంబై కంచుకోట బద్దలు
ముంబై ఇండియన్స్‌తో వాంఖడే వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించి.. దానిని డిఫెండ్‌ చేసుకుంది. సొంత మైదానంలో ఈ ఫైవ్‌ టైమ్‌ చాంపియన్‌ను 12 పరుగుల తేడాతో ఓడించి మళ్లీ గెలుపు బాట పట్టింది.

ఐపీఎల్‌ చరిత్రలో తొలి కెప్టెన్‌గా
ఈ క్రమంలో ఆర్సీబీ కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ సరికొత్త రికార్డు సాధించాడు. ఐపీఎల్‌ చరిత్రలో.. ఒకే సీజన్‌లో కేకేఆర్‌ను ఈడెన్‌ గార్డెన్స్‌లో, చెన్నైని చెపాక్‌లో, ముంబైని వాంఖడేలో ఓడించిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు. అద్భుతమైన నాయకత్వ నైపుణ్యాలతో ఈ మూడు చాంపియన్‌ జట్లను వారి సొంత మైదానంలోనే ఓడించిన సారథిగా అరుదైన ఘనత సాధించాడు.

గతంలో పంజాబ్‌ కింగ్స్‌ 2012లో ఈ ఫీట్‌ నమోదు చేసింది. అయితే, అప్పుడు ఆ జట్టుకు ఇద్దరు వేర్వేరు కెప్టెన్లు పనిచేశారు. ఆడం గిల్‌క్రిస్ట్‌ సారథ్యంలో పంజాబ్‌ కేకేఆర్‌ను ఈడెన్‌ గార్డెన్స్‌లో ఓడించింది. అంతకుముందు డేవిడ్‌ హస్సీ కెప్టెన్సీలో ముంబైని వాంఖడేలో, చెన్నైని చెపాక్‌లో చిత్తు చేసింది. అయితే, పాటిదార్‌ సోలోగా ఈ ఘనత సాధించి.. చరిత్ర సృష్టించాడు.

బ్యాటర్‌గానూ సూపర్‌హిట్‌ 
ఇక ఇప్పటి వరకు ఆర్సీబీ ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడింట గెలిచింది. మరోవైపు.. రజత్‌ పాటిదార్‌ ఇప్పటి వరకు నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి 161 పరుగులు సాధించాడు. కేకేఆర్‌పై 16 బంతుల్లో 34, సీఎస్‌కేపై 32 బంతుల్లో 51 రన్స్‌ చేశాడు.

అదే విధంగా.. గుజరాత్‌ టైటాన్స్‌పై 12 బంతుల్లో 12, ముంబైపై 32 బంతుల్లో 64 పరుగులు సాధించాడు. చెన్నై, ముంబైపై ఆర్సీబీ విజయాల్లో బ్యాటర్‌గా కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు కూడా!.. ఏదేమైనా పాటిదార్‌ కెప్టెన్సీలో ఆర్సీబీ ఇదే జోరు కనబరిస్తే.. ‘ఈసారి కప్‌ మనదే’ అని ప్రతిసారీ అనుకునే అభిమానుల కల నెరవేరవచ్చు.. ఏమో గుర్రం ఎగరావచ్చు!!

A #TATAIPL Classic in every sense 🔥#RCB hold their nerves to seal a win after 1️⃣0️⃣ years against #MI at Wankhede! 

Scorecard ▶️ https://t.co/ArsodkwOfO#TATAIPL | #MIvRCB | @RCBTweets pic.twitter.com/uu98T8NtWE

— IndianPremierLeague (@IPL) April 7, 2025

చదవండి: Hardik Pandya: అతడు అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు.. రోహిత్‌ రావడం వల్ల..

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Rajat Patidar
IPL 2025
MI vs RCB
punjab kings
CSK vs RCB
RCB vs KKR
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వాళ్లకే దిక్కులేదు!.. అతడిని ఎలా ఎంపిక చేస్తారు?

వాళ్లకే దిక్కులేదు!.. అతడిని ఎలా ఎంపిక చేస్తారు?

'ఆర్సీబీలోకి రావడమే ఇష్టం లేదు'

'ఆర్సీబీలోకి రావడమే ఇష్టం లేదు'

నేనేమి పాపం చేశాను, రెండు టైటిళ్లు గెలిచినా.. దక్కని చోటు

నేనేమి పాపం చేశాను, రెండు టైటిళ్లు గెలిచినా.. దక్కని చోటు

పాపం పాటిదార్‌.. ఆర్సీబీ కెప్టెన్‌పై సానుభూతి వెల్లువ

పాపం పాటిదార్‌.. ఆర్సీబీ కెప్టెన్‌పై సానుభూతి వెల్లువ

‘శ్రేయస్‌ నన్ను తిట్టాడు.. కావాలనే పదకొండో ఓవర్లో బౌలింగ్‌’

‘శ్రేయస్‌ నన్ను తిట్టాడు.. కావాలనే పదకొండో ఓవర్లో బౌలింగ్‌’

‘పంజాబ్‌ కింగ్స్‌ ఈ ఐదుగురిని వదిలేయాలి’

‘పంజాబ్‌ కింగ్స్‌ ఈ ఐదుగురిని వదిలేయాలి’

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.