ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జరగుతున్న యాషెస్ తొలి టెస్టు ఆసక్తికరంగా మారింది. ఆఖరి రోజు ఆస్ట్రేలియా విజయానికి 174 పరుగులు అవసరమవ్వగా.. ఇంగ్లండ్ తమ గెలుపు 7 వికెట్ల దూరంలో నిలిచింది.
క్రీజులో ఉస్మాన్ ఖ్వాజా(34), స్కాట్ బోలాండ్(13) నాటౌట్‌గా ఉన్నారు. ఇక అంతకుముందు ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 273 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యంతో కలిపి ఇంగ్లండ్ ఆసీస్ ముందు 281 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
కమ్మిన్స్ సూపర్ యార్కర్
ఇక ఈ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. నాలుగు వికెట్లు సాధించి ఇంగ్లండ్ బజ్‌బాల్‌కు అడ్డుకట్ట వేశాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటర్ ఓలీ పోప్‌ను అద్భుతమైన యార్కర్‌తో కమ్మిన్స్ బోల్తా కొట్టించాడు.
139 కిమీ వేగంతో వేసిన యార్కర్‌కు పోప్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. దీంతో 14 పరుగులు చేసిన ఓలీ పోప్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: CWC Qualifiers2023: ఐర్లాండ్‌కు బిగ్ షాకిచ్చిన ఒమన్.. వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో బోణీ
The perfect yorker 😍
Pat Cummins at his sizzling best ♨#SonySportsNetwork #TheAshes #ENGvAUS #RivalsForever pic.twitter.com/E6EIHQBI2u— Sony Sports Network (@SonySportsNetwk) June 19, 2023