Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

సెంట్రల్‌ కాంట్రాక్టు నుంచి అవుట్‌.. జట్టులో నో ఛాన్స్‌! అయినా..

Sports Sakshi User Sakshi Sakshi Time Oct 29, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
fakhar.jpg

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) వ్యవహారశైలి పట్ల ఆ దేశ సీనియర్‌ క్రికెటర్‌ ఫఖర్‌ జమాన్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఉద్దేశపూర్వకంగానే తనను సెంట్రల్‌ కాంట్రాక్టు నుంచి తప్పించారని.. తనకు మాత్రమే నిబంధనలు వర్తింపజేస్తూ వేటు వేశారని బోర్డు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 

తనను ఎంతగా అణగదొక్కాలని చూసినా ఇప్పట్లో రిటైర్‌ అయ్యే ప్రసక్తి మాత్రం లేదని అతడు సన్నిహితుల వద్ద పేర్కొన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. కాగా 2024–25 ఏడాది కోసం పీసీబీ ఆదివారం వార్షిక కాంట్రాక్టు వివరాలు ప్రకటించిన విషయం తెలిసిందే. స్టార్‌ పేసర్‌ షాహిన్‌ షా ఆఫ్రిదిని ‘ఎ’ కేటగిరి నుంచి తొలగించి ‘బి’ కేటగిరీలో వేయడం సహా..  సీనియర్‌ ప్లేయర్లు ఫఖర్‌ జమాన్, ఇఫ్తిఖార్‌ అహ్మద్, ఒసామా మీర్‌లను ఈ జాబితా నుంచి తొలగించింది. 

ఇక పాకిస్తాన్‌ టెస్టు జట్టు కెప్టెన్‌ షాన్‌ మసూద్‌ను ‘బి’ కేటగిరీలోనే కొనసాగించింది. అంతేకాదు.. గత ఏడాది 27 మందికి వార్షిక కాంట్రాక్టు ఇవ్వగా ఈసారి ఆ సంఖ్యను 25కు కుదించింది. ఇందులో ఐదుగురు ప్లేయర్లకు తొలిసారి అవకాశం దక్కింది. 

కొత్త కెప్టెన్‌ రిజ్వాన్, మాజీ సారథి బాబర్‌ ఆజమ్‌లు ‘ఎ’ కేటగిరీలో ఉండగా... షాహీన్‌ షా అఫ్రిది, నసీమ్‌ షా, షాన్‌ మసూద్‌లకు ‘బి’ కేటగిరీలో చోటు ఇచ్చింది. ఇక ‘సి’ కేటగిరీలో 9 మంది, ‘డి’ కేటగిరీలో 11 మంది ఉన్నారు. కేటగిరీలను బట్టి ప్లేయర్లకు మ్యాచ్‌ ఫీజులు అందనున్నాయి.

ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న జట్టులోనూ ఫఖర్‌ జమాన్‌కు చోటు దక్కలేదు. బాబర్‌ ఆజం విషయంలో బోర్డును నిందించడం సహా ఫిట్‌నెస్‌ లేమి కారణంగా అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు పీసీబీ చీఫ్‌ మొహ్సిన్‌ నక్వీ ఆదివారం వెల్లడించాడు.

ఈ పరిణామాల నేపథ్యంలో ఫఖర్‌ జమాన్‌ తీవ్ర నిరాశకు లోనైనట్లు అతడి సన్నిహిత వర్గాలు పాక్‌ మీడియాకు తెలిపాయి. ‘‘అతడు చాలా బాధపడుతున్నాడు. ఫిట్‌నెస్‌ టెస్టుల విషయంలో తన పట్ల వివక్ష చూపారని వాపోయాడు. క్లియరెన్స్‌ విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో రూల్‌ పాటించారన్నాడు. రెండు కిలోమీటర్ల పరుగు విషయంలో తనతో పాటు సరైన సమయంలో పూర్తి చేయనివాళ్లకు జట్టులో చోటిచ్చి.. తనను మాత్రం విస్మరించారని ఆవేదన చెందాడు.

అసలు తన పట్ల ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారో క్లారిటీ ఇవ్వాలని సెలక్టర్లను కోరినా ఫలితం లేకుండా పోయింది’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ నేపథ్యంలో తొలి టెస్టు అనంతరం బాబర్‌ ఆజం, షాహిన్‌ ఆఫ్రిదిలపై వేటు వేసిన పీసీబీ.. రెండు, మూడో టెస్టు నుంచి వారిని తప్పించింది.

ఈ నేపథ్యంలో 34 ఏళ్ల ఫఖర్‌ జమాన్‌ స్పందిస్తూ పీసీబీ తీరును సోషల్‌ మీడియా వేదికగా విమర్శించాడు. దీంతో క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డాడని బోర్డు అతడిపై కన్నెర్రజేసింది. 

ఈ క్రమంలోనే అతడిని సెంట్రల్‌ కాంట్రాక్టు నుంచి తప్పించడం సహా.. ఆసీస్‌ టూర్‌కు దూరం చేసిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా పాక్‌ తరఫున వన్డేల్లో డబుల్‌ సెంచరీ చేసిన ఏకైక బ్యాటర్‌ ఫఖర్‌ జమాన్‌. ఇప్పటి వరకు 82 వన్డేలు ఆడిన ఈ లెఫ్టాండ్‌ బ్యాటర్‌ 3492 పరుగులు చేశాడు. ఇందులో పదకొండు శతకాలు ఉన్నాయి.

చదవండి: Ind vs Aus: 17 కిలోల బరువు తగ్గి.. ఆసీస్‌ టూర్‌కు ఎంపికైన పేసర్‌

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Fakhar Zaman
Babar Azam
Shaheen Afridi
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

మళ్లీ పాక్‌ కెప్టెన్‌గా బాబర్‌ ఆజం​..!

మళ్లీ పాక్‌ కెప్టెన్‌గా బాబర్‌ ఆజం​..!

చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్‌.. ప్రపంచ రికార్డు

చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్‌.. ప్రపంచ రికార్డు

బాబర్‌ ఆజం రికార్డును బద్దలు కొట్టిన గిల్‌

బాబర్‌ ఆజం రికార్డును బద్దలు కొట్టిన గిల్‌

షాహీన్‌ అఫ్రిదికి ఊహించని షాక్‌

షాహీన్‌ అఫ్రిదికి ఊహించని షాక్‌

షాహీన్ దెబ్బ.. ఆసీస్ అబ్బా! వన్డే సిరీస్‌ పాక్‌దే

షాహీన్ దెబ్బ.. ఆసీస్ అబ్బా! వన్డే సిరీస్‌ పాక్‌దే

రెండో వన్డేలోనూ రెచ్చిపోయిన పాక్‌ బౌలర్లు

రెండో వన్డేలోనూ రెచ్చిపోయిన పాక్‌ బౌలర్లు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.