Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

4 ఓవర్లలో 76 రన్స్‌ ఇచ్చాడు.. జట్టులో అవసరమా?: భారత మాజీ క్రికెటర్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Mar 26, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
r12.jpg

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) -2025లో రాజస్తాన్‌ రాయల్స్‌‍కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad)తో ఆదివారం నాటి మ్యాచ్‌లో రాయల్స్‌ 44 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రాజస్తాన్‌ బౌలింగ్‌ను రైజర్స్‌ బ్యాటర్లు చితక్కొట్టారు. విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడి.. రాయల్స్‌ బౌలర్లకు పీడకల మిగిల్చారు.

ఫలితంగా ఆ జట్టు ఏకంగా 286 పరుగులు సాధించింది. అయితే, లక్ష్య ఛేదనలో రాయల్స్‌ 242 పరుగులకే పరిమితం కావడంతో ఓటమి తప్పలేదు. ఇక తమ రెండో మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో తలపడనుంది. 

ఇరుజట్లకు ఈ మ్యాచ్‌ కీలకం
గువాహతి వేదికగా బుధవారం కేకేఆర్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇక గత మ్యాచ్‌లో కోల్‌కతా (ఆర్సీబీ చేతిలో) కూడా ఓడిపోవడంతో ఇరుజట్లకు ఈ మ్యాచ్‌ కీలకంగా మారింది.

ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా (Aakash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్ల వైఫల్యం కొనసాగితే మాత్రం ఆ జట్టుకు మరో ఓటమి తప్పదని అభిప్రాయపడ్డాడు. 

ముఖ్యంగా విదేశీ పేసర్లు జోఫ్రా ఆర్చర్‌, ఫజల్‌హక్‌ ఫారూకీలను తుదిజట్టులో కొనసాగించే అంశంపై యాజమాన్యం తీసుకునే నిర్ణయమే కీలకం కానుందని పేర్కొన్నాడు.

4 ఓవర్లలో 76 రన్స్‌ ఇచ్చాడు.. జట్టులో అవసరమా?
‘‘బౌలింగ్‌ విభాగంలో రాజస్తాన్‌ రాయల్స్‌కు ఆందోళన తప్పదు. ముఖ్యంగా జోఫ్రాపైనే ప్రస్తుతం అందరూ దృష్టి పెట్టారు. నిజానికి రాయల్స్‌ జట్టులో ఆరుగురు విదేశీ ప్లేయర్లు ఉన్నారు. మిగతా జట్లలో ఎనిమిది మంది ఉన్నారు. అయితే, తమకున్న ఆరుగురిలో రాజస్తాన్‌ ఇద్దరు ఫాస్ట్‌ బౌలర్లను కలిగి ఉంది.

వాళ్లు గత మ్యాచ్‌లో ఆడారు. ఒకరేమో (జోఫ్రా) నాలుగు ఓవర్లలో ఏకంగా 76 పరుగులు ఇచ్చి ఐపీఎల్‌ చరిత్రలోనే నాసిరకమైన స్పెల్‌తో అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. మరొకరు ఫజల్‌హక్‌ ఫారూకీ.. జోఫ్రాతో పాటు అతడి బౌలింగ్‌నూ ప్రత్యర్థి బ్యాటర్లు చితక్కొట్టారు.

ప్రతి బౌలర్‌ కెరీర్‌లో ఎప్పుడో ఒకసారి ఇలాంటి చేదు అనుభవం ఉండటం సహజమే. అయితే, జట్టులో ఉన్న ఇద్దరు విదేశీ బౌలర్లు ఇలా ధారాళంగా పరుగులు ఇచ్చుకుంటే ఏం చేయాలన్న అంశంపై యాజమాన్యానికి స్పష్టత కొరవడుతుంది. వాళ్లిద్దరిలో ఒకరిపై వేటు వేస్తేనే బెటర్‌.

మఫాకాను ఆడించండి
సౌతాఫ్రికా యువ బౌలర్‌ క్వెనా మఫాకాను జోఫ్రా లేదంటే ఫారూకీ స్థానంలో ఆడించండి. అయినా సరే.. రాజస్తాన్‌ బౌలింగ్‌ విభాగం కచ్చితంగా రాణిస్తుందని చెప్పలేం’’ అని ఆకాశ్‌ చోప్రా సోషల్‌ మీడియా వేదికగా తన అభిప్రాయాలు వెల్లడించాడు. ఇక రాజస్తాన్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ గురించి ప్రస్తావిస్తూ.. ఈసారి అతడు ఆరెంజ్‌ క్యాప్‌(అత్యధిక పరుగులు) సాధిస్తాడని అంచనా వేశాడు.

‘‘రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టులో ఇద్దరు యువ ఆటగాళ్లు నా దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఒకరేమో కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌. మరొకరు యశస్వి జైస్వాల్‌. ఈసారి జైసూ ఆరెంజ్‌ క్యాప్‌ గెలుపొందినా ఆశ్చర్యం లేదు. 

గత సీజన్‌లో అతడి ఫామ్‌ బాగాలేదు. అయినంత మాత్రాన ప్రతిసారి అలాగే ఉంటుందని భావించలేము’’ అని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు.

కాగా గత మ్యాచ్‌లో జైస్వాల్‌ ఐదు బంతులు ఎదుర్కొని కేవలం ఒక్క పరుగు చేసి పెవిలియన్‌ చేరాడు. మరోవైపు జోఫ్రా నాలుగు ఓవర్లలో ఏకంగా 76 పరుగులు ఇవ్వగా.. ఫారూకీ మూడు ఓవర్లు పూర్తి చేసి 49 రన్స్‌ సమర్పించుకున్నాడు. మహీశ్‌ తీక్షణ(2/52), సందీప్‌ శర్మ 2/51) పరుగులు ఇచ్చినా రెండేసి వికెట్లు తీయగలిగారు.

చదవండి: ఇదేం కెప్టెన్సీ గిల్‌? ఏమీ పట్టనట్టే ఉన్నావు ఎందుకు?: సెహ్వాగ్‌

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
IPL 2025
RR vs KKR
Jofra Archer
Fazalhaq Farooqi
Rajasthan Royals
Aakash Chopra
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

IND vs AFG: మూడో వన్డే.. భారత తుదిజట్టు ఇదే!

IND vs AFG: మూడో వన్డే.. భారత తుదిజట్టు ఇదే!

ఇంగ్లండ్‌ తుది జట్టు ప్రకటన.. ఇద్దరి అరంగేట్రం

ఇంగ్లండ్‌ తుది జట్టు ప్రకటన.. ఇద్దరి అరంగేట్రం

‘జిడ్డులా వేలాడలేదు.. తేలిగ్గానే వదిలేశాడు’

‘జిడ్డులా వేలాడలేదు.. తేలిగ్గానే వదిలేశాడు’

తుదిజట్టులో చోటు ఉండదు.. ఎవరిని ఎంపిక చేస్తే ఏంటి?

తుదిజట్టులో చోటు ఉండదు.. ఎవరిని ఎంపిక చేస్తే ఏంటి?

వాళ్లకే దిక్కులేదు!.. అతడిని ఎలా ఎంపిక చేస్తారు?

వాళ్లకే దిక్కులేదు!.. అతడిని ఎలా ఎంపిక చేస్తారు?

వైభవ్‌ నిర్దయగా సిక్సర్లు బాదాడు!.. ఇదే కొనసాగితే కష్టం!

వైభవ్‌ నిర్దయగా సిక్సర్లు బాదాడు!.. ఇదే కొనసాగితే కష్టం!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.