Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

వేలంలో అన్‌సోల్డ్‌.. కట్‌చేస్తే!.. ప్రపంచ రికార్డు

Sports Sakshi User Sakshi Sakshi Time Dec 18, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
nz.jpg

న్యూజిలాండ్‌ స్టార్లు టామ్‌ లాథమ్‌, డెవాన్‌ కాన్వే సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ చరిత్రలో తొలి వికెట్‌కు అత్యుత్తమ భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనింగ్‌ జోడీగా నిలిచారు. వెస్టిండీస్‌తో గురువారం మొదలైన మూడో టెస్టు సందర్భంగా ఈ ఘనత సాధించారు.

డబ్ల్యూటీసీ  (WTC)  2025-27లో భాగంగా కివీస్‌ జట్టు స్వదేశంలో విండీస్‌తో మూడు టెస్టుల సిరీస్‌ ఆడుతోంది. అసాధారణ పోరాటంతో వెస్టిండీస్‌ తొలి టెస్టు డ్రా చేసుకోగా.. రెండో టెస్టులో న్యూజిలాండ్‌ తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది. ఇరుజట్ల మధ్య గురువారం ‘బే ఓవల్‌’ వేదికగా మూడో టెస్టు మొదలైంది.

ఓపెనింగ్‌ జోడీగా వచ్చి.. శతకాలతో చెలరేగి
టాస్‌ గెలిచిన ఆతిథ్య కివీస్‌.. పర్యాటక విండీస్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనింగ్‌ జోడీగా వచ్చిన కివీస్‌ కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ (Tom Latham), డెవాన్‌ కాన్వే సెంచరీలతో చెలరేగారు. లాథమ్‌ 246 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్సర్‌ బాది 137 పరుగులు చేసి.. రోచ్‌ బౌలింగ్‌లో రోస్టన్‌ చేజ్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు.

మరోవైపు.. తొలిరోజు ఆట ముగిసే సరికి కాన్వే 279 బంతుల్లో 178 పరుగులతో (25 ఫోర్లు) అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా నైట్‌ వాచ్‌మన్‌ జేకబ్‌ డఫీ (Jacob Duffy) 9 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఫలితంగా గురువారం నాటి మొదటిరోజు ఆటలో న్యూజిలాండ్‌ 90 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 334 పరుగులు సాధించింది.

ప్రపంచ రికార్డు
ఇదిలా ఉంటే.. తొలి వికెట్‌కు లాథమ్‌, కాన్వే కలిసి 520 బంతుల్లో ఏకంగా 323 పరుగులు జతచేశారు. డబ్ల్యూటీసీ చరిత్రలో ఇదే అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యం కావడం విశేషం. సౌతాఫ్రికాతో టెస్టులో 2019లో టీమిండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ- మయాంక్‌ అగర్వాల్‌ తొలి వికెట్‌కు 317 పరుగులు జోడించగా.. లాథమ్‌- కాన్వే తాజాగా ఈ రికార్డును సవరించారు.

అంతేకాదు.. సొంతగడ్డపై టెస్టుల్లో అత్యధిక ఓపెనింగ్‌ పార్ట్‌నర్‌షిప్‌ సాధించిన జోడీగానూ లాథమ్‌- కాన్వే చరిత్రకెక్కారు. గతంలో ఈ రికార్డు చార్లెస్‌ స్టెవర్ట్‌ డెంప్‌స్టర్‌- జాన్‌ ఎర్నెస్ట్‌ మిల్స్‌ పేరిట ఉండేది. వీరిద్దరు కలిసి ఇంగ్లండ్‌పై 1930లో 276 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 

ఇదిలా ఉంటే.. అబుదాబిలో మంగళవారం జరిగిన ఐపీఎల్‌-2026 మినీ వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలి పోయిన కాన్వే.. వేలం తర్వాత తన తొలి మ్యాచ్‌లోనే రికార్డు సెంచరీ సాధించడం విశేషం.

చదవండి: IPL 2026 Auction: స్టీవ్‌ స్మిత్‌, కాన్వేలకు షాక్‌.. వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Tom Latham
Devon Conway
New Zealand vs West Indies
test series
world test championship
rohit sharma
Mayank Agarwal
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

శ్రీలంకకు భారీ షాక్‌!

శ్రీలంకకు భారీ షాక్‌!

స్లో ఓవర్‌రేట్‌ దెబ్బ.. ఇంగ్లండ్‌కు భారీ షాక్‌!

స్లో ఓవర్‌రేట్‌ దెబ్బ.. ఇంగ్లండ్‌కు భారీ షాక్‌!

జో రూట్ ఒంట‌రి పోరాటం.. ఇంగ్లండ్ గెలిస్తే చ‌రిత్రే!

జో రూట్ ఒంట‌రి పోరాటం.. ఇంగ్లండ్ గెలిస్తే చ‌రిత్రే!

రోహిత్‌ సరికొత్త రికార్డు.. భారత వన్డే క్రికెట్‌ హిస్టరీలోనే

రోహిత్‌ సరికొత్త రికార్డు.. భారత వన్డే క్రికెట్‌ హిస్టరీలోనే

భార‌త వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లోనే తొలిసారి

భార‌త వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లోనే తొలిసారి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.