Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT

ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. రోవ్‌మన్‌ పావెల్‌ విధ్వంసం.. కానీ..

Sports Sakshi User Sakshi Sakshi Time Nov 6, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
NZ_20vs_20WI.jpg

న్యూజిలాండ్‌- వెస్టిండీస్‌ మధ్య రెండో టీ20 ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఆఖరి బంతి వరకు విజయం కోసం ఇరుజట్లు హోరాహోరీ తలపడ్డాయి. మరి గెలుపు ఎవరిని వరించిందంటే..?!

ఐదు టీ20లు, మూడు వన్డేలు, మూడు టెస్టులు ఆడేందుకు విండీస్‌ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్‌ మొదలుకాగా.. ఆక్లాండ్‌లో బుధవారం ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌ వెస్టిండీస్‌ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గురువారం అదే వేదికపై రెండో టీ20 జరిగింది. ఆక్లాండ్‌లో టాస్‌ గెలిచిన విండీస్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. కివీస్‌ ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే (16), వన్‌డౌన్‌ బ్యాటర్‌ రచిన్‌ రవీంద్ర (11) మరోసారి విఫలం కాగా.. మరో ఓపెనర్‌ టిమ్‌ రాబిన్సన్‌ (25 బంతుల్లో 39) రాణించాడు.

కేవలం 28 బంతుల్లోనే
ఇక నాలుగో నంబర్‌ బ్యాటర్‌ మార్క్‌ చాప్‌మన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 28 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఏడు సిక్సర్లు బాది ఏకంగా 78 పరుగులు సాధించాడు. చాప్‌మన్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తోడు.. డారిల్‌ మిచెల్‌ (14 బంతుల్లో 28 నాటౌట్‌) మెరుపులు మెరిపించాడు. ఆఖర్లో కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ 8 బంతుల్లో 18 పరుగులతో అజేయంగా నిలిచాడు.

Starring Mark Chapman: A Bowler’s Nightmare 🎥#NZvWI pic.twitter.com/KXWomWevnN

— FanCode (@FanCode) November 6, 2025

ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్‌ ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. విండీస్‌ బౌలర్లలో రోస్టన్‌ చేజ్‌ రెండు వికెట్లు తీయగా.. మాథ్యూ ఫోర్డ్‌, జేసన్‌ హోల్డర్‌, రొమారియో షెఫర్డ్‌ తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో వెస్టిండీస్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది.

ఓపెనర్‌ బ్రాండన్‌ కింగ్‌ (0)ను జేకబ్‌ డఫీ డకౌట్‌ చేశాడు. అయితే, మరో ఓపెనర్‌ అలిక్‌ అథనాజ్‌ (25 బంతుల్లో 33), వన్‌డౌన్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ షాయీ హోప్‌ (26 బంతుల్లో 24) ఇన్నింగ్స్‌ నిర్మించే ప్రయత్నం చేశారు. మిడిలార్డర్‌లో అకీమ్‌ ఆగస్టి (7), జేసన్‌ హోల్డర్‌ (16) నిరాశపరచగా.. ఏడో నంబర్‌ ఆటగాడు రోస్టన్‌ చేజ్‌ (6) కూడా విఫలమయ్యాడు.

రోవ్‌మన్‌ పావెల్‌ అద్భుత ఇన్నింగ్స్‌
ఈ క్రమంలో విజయంపై ఆశలు వదిలేసుకున్న వేళ.. విండీస్‌ పవర్‌ హిట్టర్‌ రోవ్‌మన్‌ పావెల్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. కివీస్‌ బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 16 బంతుల్లోనే ఒక ఫోర్‌, ఆరు సిక్సర్ల సాయంతో 45 పరుగులు సాధించి జట్టును విజయానికి చేరువ చేశాడు.

అతడికి తోడుగా రొమారియో షెఫర్డ్‌ (16 బంతుల్లో 34), మాథ్యూ ఫోర్డ్‌ (13 బంతుల్లో 29) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. ఈ క్రమంలో కివీస్‌ విధించిన 208 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. ఆఖరి ఓవర్లో విండీస్‌ విజయ సమీకరణం ఆరు బంతుల్లో 16 పరుగులుగా మారింది.

ఆఖరి ఓవర్లో కైలీ జెమీషన్‌ బంతితో రంగంలోకి దిగగా.. తొలి బంతికే ఫోర్డ్‌ ఫోర్‌ బాదాడు. ఆ తర్వాత పరుగులేమీ రాలేదు. మూడో బంతి నోబాల్‌ కాగా ఫోర్డ్‌ మరో ఫోర్‌తో చెలరేగాడు. ఆ తర్వాత బంతికి సింగిల్‌ తీశాడు. ఈ క్రమంలో పావెల్‌ నాలుగో బంతికి షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి చాప్‌మన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు.

ఆఖరి బంతి వరకు ఉత్కంఠ
దీంతో విండీస్‌ కీలక వికెట్‌ కోల్పోగా.. అకీల్‌ హొసేన్‌ క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో ఐదో బంతికి అకీల్‌ సింగిల్‌ తీయగా.. ఆఖరి బంతికి విండీస్‌ విజయానికి ఐదు పరుగులు అవసరమయ్యాయి. అయితే, ఇక్కడే జెమీషన్‌ మాయ చేశాడు. అద్భుత బంతిని సంధించగా.. ఫోర్డ్‌ సింగిల్‌కే పరిమితమయ్యాడు. 

దీంతో మూడు పరుగుల స్వల్ప తేడాతో జయభేరి మోగించిన ఆతిథ్య కివీస్‌ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. కివీస్‌ బౌలర్లలో ఇష్‌ సోధి, సాంట్నర్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. డఫీ, జెమీషన్‌ చెరో వికెట్‌ తీశారు. చాప్‌మన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య ఆదివారం జరిగే మూడో టీ20కి సాక్స్‌టన్‌ ఓవల్‌ వేదిక.

చదవండి: IND vs AUS: గంభీర్ పిచ్చి ప్రయోగం.. అట్టర్‌ ప్లాప్‌

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
New Zealand vs West Indies
T20 series
Mark Chapman
Rovman Powell
Auckland
ish sodhi
Mitchell Santner
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

సొంతగడ్డపై పర్యాటక జట్టుగా టీమిండియా!

సొంతగడ్డపై పర్యాటక జట్టుగా టీమిండియా!

అతడి కెప్టెన్సీలో స్వేచ్ఛ: మయాంక్‌ యాదవ్‌

అతడి కెప్టెన్సీలో స్వేచ్ఛ: మయాంక్‌ యాదవ్‌

సంజూను కావాలనే తప్పించారా?

సంజూను కావాలనే తప్పించారా?

భార‌త్‌తో టీ20 సిరీస్‌.. ఇంగ్లండ్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌! యువ సంచలనానికి ఛాన్స్‌

భార‌త్‌తో టీ20 సిరీస్‌.. ఇంగ్లండ్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌! యువ సంచలనానికి ఛాన్స్‌

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌.. వైభవ్‌తో పాటు వీళ్లకు కీలకమే!

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌.. వైభవ్‌తో పాటు వీళ్లకు కీలకమే!

పావెల్‌ మహోగ్రరూపం

పావెల్‌ మహోగ్రరూపం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.