ఐపీఎల్-2023లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. గెలవాల్సిన మ్యాచ్‌లో చేజేతులా రాజస్తాన్ పరాజయం చెందింది. 213 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో రాజస్తాన్ బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ చెత్త బౌలింగ్‌తో రాజస్తాన్ కొంపముంచాడు.
ఆఖరి ఓవర్లో ముంబై విజయానికి 17 పరుగులు కావల్సిన నేపథ్యంలో.. రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్ బంతిని హోల్డర్ చేతికి వచ్చాడు. హోల్డర్ శాంసన్ నమ్మకాన్ని వమ్ముచేశాడు. వరుసగా మూడు సిక్స్‌లు ఇచ్చి రాజస్తాన్‌కు కాలరాత్రి మిగిల్చాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 3.3 ఓవర్లు బౌలింగ్ చేసిన హోల్డర్.. ఏకంగా 55 పరుగులు లిచ్చాడు. అతడి ఏకనామీ రేటు 15.70గా ఉండడం గమానార్హం.
కాగా ఈ ఏడాది సీజన్లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడిన అనుభవం ఉన్న హోల్డర్ ఎటువంటి ప్రదర్శన చేయడం రాజస్తాన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా హోల్డర్‌ను దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఓ యాజర్ స్పందిస్తూ.. ఇదేమి చెత్త బౌలింగ్.. గల్లీ క్రికెటర్లు చాలా బెటర్ అంటూ కామెంట్ చేశాడు.
చదవండి: #Rohit sharma: చాలా సంతోషంగా ఉంది.. అతడు భయపెట్టాడు..! భారత క్రికెట్‌కు చాలా మంచిది
Tim David, take a bow 🔥
What a way to leave Wankhede and Sachin Tendulkar all smiles 😀#IPL2023 #TATAIPL #MIvRR #IPL1000 | @mipaltan @timdavid8 pic.twitter.com/evvQRJCEFu— JioCinema (@JioCinema) April 30, 2023
16 needed off the last over
Jason Holder concedes 6 6 6 🤩
2 waist high full tosses
King Jason immediately seeks the blessing of Lord Dinda 🙏 pic.twitter.com/xts2aaeRBQ— Dinda Academy (@academy_dinda) April 30, 2023