Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

మిల్లర్‌ కిల్లర్‌ ఇన్నింగ్స్‌.. రసెల్‌ పోరాటం వృధా.. బోణీ కొట్టిన సూపర్‌ కింగ్స్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Jul 14, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Untitled-1.gif

అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ (ఎంఎల్‌సీ) తొలి సీజన్‌ నిన్నటి (జులై 13) నుంచి ప్రారంభమైంది. సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌.. లాస్‌ ఏంజెలెస్‌ నైట్‌ రైడర్స్‌పై విజయఢంకా మోగించింది. భారతకాలమానం ప్రకారం ఇవాళ ఉదయం ప్రారంభమైన మ్యాచ్‌లో సూపర్‌ కింగ్స్‌ 69 పరుగుల తేడాతో గెలుపొంది, ఎంఎల్‌సీ-2023లో బోణీ విజయం దక్కించుకుంది.  

మిల్లర్‌ కిల్లర్‌ ఇన్నింగ్స్‌.. కాన్వే సూపర్‌ ఫిఫ్టి.. బ్రేవో మెరుపులు

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన సూపర్‌ కింగ్స్‌.. కాన్వే (37 బంతుల్లో 55; 7 ఫోర్లు, సిక్స్‌), డేవిడ్‌ మిల్లర్‌ (42 బంతుల్లో 61; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధసెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఆఖర్లో మిచెల్‌ సాంట్నర్‌ (14 బంతుల్లో 21; 2 సిక్సర్లు), డ్వేన్‌ బ్రేవో (6 బంతుల్లో 16 నాటౌట్‌; 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ తానెదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. నైట్‌రైడర్స్‌ బౌలరల్లో అలీ ఖాన్‌, లోకీ ఫెర్గూసన్‌ తలో 2 వికెట్లు.. సునీల్‌ నరైన్‌, ఆడమ్‌ జంపా చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

రసెల్‌ పోరాటం వృధా..

182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్‌ రైడర్స్‌.. సూపర్‌ కింగ్స్‌ బౌలర్ల ధాటి​కి 14 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. సూపర్‌ కింగ్స్‌ స్పిన్నర్‌ మొహమ్మద్‌ మొహిసిన్‌ (4/8) నైట్‌రైడర్స్‌ పతనాన్ని శాశించగా.. గెరాల్డ్‌ కొయెట్జీ, రస్టీ థెరన్‌ తలో 2 వికెట్లు, కాల్విన్‌ సావేజ్‌, డ్వేన్‌ బ్రేవో చెరో వికెట్‌ పడగొట్టారు.

నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌లో మిగతా బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కడుతుంటే విండీస్‌ విధ్వంసర వీరుడు ఆండ్రీ రసెల్‌ (34 బంతుల్లో 55; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే ఒంటరిపోరాటం చేశాడు. జస్కరన్‌ మల్హోత్రా (22), సునీల్‌ నరైన్‌ (15) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతావారంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. మార్టిన్‌ గప్తిల్‌ (0), ఉన్ముక్త్‌ చంద్‌ (4), రిలీ రొస్సో (4), జంపా (3), ఫెర్గూసన్‌ (1) నిరాశపరిచారు.

కాగా, ఐపీఎల్ ఫ్రాంచైజీల యాజమాన్యాలే ఎంఎల్‌సీ జట్లను కూడా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. చెన్నై సూపర్‌ కింగ్స్‌ యాజమాన్యం.. టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌ను, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ యాజమాన్యం.. లాస్‌ ఏంజెలెస్‌ నైట్‌రైడర్స్‌ను సొంతం చేసుకున్నాయి. లీగ్‌లో భాగంగా రేపు (భారతకాలమానం ప్రకారం) సీటిల్‌ ఓర్కాస్‌, వాషింగ్టన్‌ ఫ్రీడం జట్లు.. ముంబై ఇండియన్స్‌ న్యూయార్క్‌, శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌ జట్లు తలపడతాయి.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Major League Cricket
Los Angeles Knight Riders
Texas Super Kings
David Miller
Andre Russell
Devon Conway
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

షార్ట్‌ వీరోచిత శతకం వృధా.. ఫైనల్లో స్టీవ్‌ స్మిత్‌ జట్టు

షార్ట్‌ వీరోచిత శతకం వృధా.. ఫైనల్లో స్టీవ్‌ స్మిత్‌ జట్టు

షనక సంచలనం.. చరిత్రలో తొలి డబుల్‌ హ్యాట్రిక్‌

షనక సంచలనం.. చరిత్రలో తొలి డబుల్‌ హ్యాట్రిక్‌

పావెల్‌ మహోగ్రరూపం

పావెల్‌ మహోగ్రరూపం

శతక్కొట్టుడు.. చరిత్ర సృష్టించిన పోలార్డ్‌

శతక్కొట్టుడు.. చరిత్ర సృష్టించిన పోలార్డ్‌

11 ఫోర్లు, 13 సిక్స‌ర్ల‌తో విధ్వంసం.. టీ20 క్రికెట్‌లో సరికొత్త రికార్డు!

11 ఫోర్లు, 13 సిక్స‌ర్ల‌తో విధ్వంసం.. టీ20 క్రికెట్‌లో సరికొత్త రికార్డు!

ఐపీఎల్‌లో డ్రింక్స్‌ బాయ్‌.. క‌ట్ చేస్తే! అక్క‌డ కేవ‌లం 25 బంతుల్లోనే

ఐపీఎల్‌లో డ్రింక్స్‌ బాయ్‌.. క‌ట్ చేస్తే! అక్క‌డ కేవ‌లం 25 బంతుల్లోనే

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.