Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

మీరాబాయి చానుకు రజతం

Sports Sakshi User Sakshi Sakshi Time Oct 4, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
weight_20lift.jpg

వరల్డ్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌

ఫోర్డె (నార్వె): భారత స్టార్‌ వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకంతో మెరిసింది. మహిళల 48 కేజీల విభాగంలో బరిలోకి దిగిన మీరా రెండో స్థానంలో నిలిచింది. 2017 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, 2022 టోర్నీలో రజతం నెగ్గిన మీరాబాయి... ఇప్పుడు మూడో పతకం ఖాతాలో వేసుకుంది. నార్వే వేదికగా జరిగిన పోటీల్లో మీరాబాయి 199 కేజీల (స్నాచ్‌లో 84 కేజీలు+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 115 కేజీలు) బరువెత్తి రజతం కైవసం చేసుకుంది. 

ఉత్తర కొరియాకు చెందిన రి సాంగ్‌ గుమ్‌ 213 కేజీల (స్నాచ్‌లో 91 కేజీలు+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 122 కేజీలు) బరువెత్తి ప్రపంచ రికార్డు నెలకొల్పడంతో పాటు పసిడి పతకం గెలుచుకుంది. థాయ్‌లాండ్‌కు చెందిన థాన్‌యాథోన్‌ సుక్‌చరోన్‌ 198 కేజీల (స్నాచ్‌లో 88 కేజీలు+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 110 కేజీలు)తో కాంస్య పతకం నెగ్గింది. స్నాచ్‌లో తొలి ప్రయత్నంలోనే 84 కేజీల బరువెత్తని చాను... ఆ తర్వాత రెండు ప్రయత్నాల్లో 87 కేజీల బరువెత్తడంలో విఫలమైంది. 

మరోవైపు క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో తొలుత 109 కేజీలు బరువెత్తిన మీరాబాయి... రెండో ప్రయత్నంలో 112 కేజీలు, మూడో ప్రయత్నంలో 115 కేజీల బరువెత్తింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో సైతం చాను క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 115 కేజీల బరువు ఎత్తే రజత పతకం గెలుచుకుంది. ‘పతకం సాధించడం ఆనందంగా ఉంది. ఈ ప్రదర్శన నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. 2028 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌ లక్ష్యంగా సాగుతున్నా. ఈ క్రమంలో పాల్గొనే ప్రతి టోర్నీ దానికి సన్నాహకమే. 

త్వరలో జరగనున్న కామన్వెల్త్‌ గేమ్స్, ఆసియా గేమ్స్‌లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయతి్నస్తా. పోటీపడ్డ ప్రతిసారీ కొత్తగా ఏదో ఒకటి నేర్చుకునేందుకు ప్రయత్నిస్తా. దేశానికి మరిన్ని పతకాలు అందించడమే నా ప్రధాన లక్ష్యం’ అని మీరాబాయి చెప్పింది. ఆమె కోచ్‌ విజయ్‌ శర్మ మాట్లాడుతూ... ఈ పతకం మీరాబాయి కఠోర సాధనకు ఫలితమని అన్నాడు. 

‘ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 200 కేజీల మార్క్‌ అందుకోవాలని మీరా లక్ష్యంగా పెట్టుకుంది. దానికి ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయింది. రానున్న కాలంలో కామన్వెల్త్, ఆసియా గేమ్స్, ఒలింపిక్స్‌ జరగనున్న నేపథ్యంలో ఆమె తీవ్ర సాధన చేస్తోంది. తన బలం, ఆత్మవిశ్వాసం పెంపొందించుకునేందుకు కష్టపడుతోంది’ అని అన్నాడు. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Mirabai Chanu
World championship
silver medal
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘పారిస్‌ పరాజయం పాఠాలు నేర్పింది’

‘పారిస్‌ పరాజయం పాఠాలు నేర్పింది’

సురుచి–సామాట్ర్‌ జోడీకి రజతం

సురుచి–సామాట్ర్‌ జోడీకి రజతం

ఈ ఏటి మేటి షోలో సామ్రాట్‌ ‘స్వర్ణ’ గురి

ఈ ఏటి మేటి షోలో సామ్రాట్‌ ‘స్వర్ణ’ గురి

ఆర్చరీలో చికితకు రజతం

ఆర్చరీలో చికితకు రజతం

నాన్న దిద్దిన చాంపియన్‌

నాన్న దిద్దిన చాంపియన్‌

ఇషా–సామ్రాట్‌ జోడీకి రజతం

ఇషా–సామ్రాట్‌ జోడీకి రజతం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.