Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

IND vs NZ: ఇది సరికాదు!.. ఫైనల్లో కివీస్‌ గెలవాలి: సౌతాఫ్రికా స్టార్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Mar 7, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
nz.jpg

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ఫైనల్లో తన మద్దతు న్యూజిలాండ్‌ జట్టుకేనని సౌతాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ మిల్లర్‌(David Miller) అన్నాడు. టైటిల్‌ పోరులో తలపడే టీమిండియా- కివీస్‌ రెండూ పటిష్ట జట్లే అయినప్పటికీ తాను మాత్రం సాంట్నర్‌ బృందం వైపే ఉంటానని స్పష్టం చేశాడు. 

సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి అనంతరం మిల్లర్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. సెమీస్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ పట్ల అతడికి ఉన్న అసంతృప్తే ఇందుకు కారణమని తెలుస్తోంది.

కాగా ఫిబ్రవరి 19న పాకిస్తాన్‌(Pakistan) వేదికగా చాంపియన్స్‌ ట్రోఫీ మొదలుకాగా.. భారత జట్టు మాత్రం తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడుతోంది. టీమిండియాతో మ్యాచ్‌ల కోసం గ్రూప్‌-‘ఎ’లో భాగమైన బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ పాక్‌ నుంచి దుబాయ్‌కు ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఇక రోహిత్‌ సేన సెమీస్‌ చేరడంతో గ్రూప్-బి నుంచి పోటీదారు ఎవరన్న అంశంపై ముందే స్పష్టత లేదు కాబట్టి ఆస్ట్రేలియాతో పాటు సౌతాఫ్రికా కూడా అరబిక్‌ దేశానికి రావాల్సి వచ్చింది.

అయితే, గ్రూప్‌ దశలో ఆఖరిగా కివీస్‌పై విజయం సాధించిన భారత్‌.. గ్రూప్‌-ఎ టాపర్‌గా నిలవగా.. గ్రూప్‌-బి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా దుబాయ్‌లోనే ఉండిపోగా.. సౌతాఫ్రికా వెంటనే న్యూజిలాండ్‌తో సెమీస్‌ ఆడేందుకు పాకిస్తాన్‌కు తిరిగి వచ్చింది.

ఈ పరిణామాల నేపథ్యంలో డేవిడ్‌ మిల్లర్‌ మాట్లాడుతూ.. ‘‘మా షెడ్యూల్‌ ఏమాత్రం బాగా లేదు. దుబాయ్‌కి ప్రయాణం గంటా 40 నిమిషాలే కావచ్చు. కానీ మేం వెళ్లక తప్పలేదు. మ్యాచ్‌ ముగిసిన తర్వాతే ఆ రోజే సిద్ధమై సాయంత్రం దుబాయ్‌కు వెళ్లాం. సోమవారం తెల్లవారుజామున మళ్లీ పాకిస్తాన్‌కు వచ్చాం’ అని మిల్లర్‌ అన్నాడు.

ఇక ఫైనల్లో టీమిండియా- కివీస్‌ తలపడనున్న తరుణంలో.. ‘‘ప్రతి ఒక్క జట్టు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. నిజానికి టీమిండియాతో మేము మరోసారి ఫైనల్‌ ఆడే పరిస్థితి ఉంటే ఎంతో బాగుండేది. కానీ మనం అనుకున్నవన్నీ జరగవు. ఏదేమైనా ట్రోఫీ గెలిచేందుకు ప్రతి ఒక్క ఆటగాడు కఠినశ్రమకు ఓర్చి అంకితభావంతో పనిచేస్తాడని చెప్పగలను. భారత్, న్యూజిలాండ్‌లు పటిష్టమైన జట్లే అయినా.. నిజాయితీగా చెప్పాలంటే.. నేను మాత్రం కివీస్‌ గెలవాలనే కోరుకుంటున్నా’’ అని డేవిడ్‌ మిల్లర్‌ పేర్కొన్నాడు.

కాగా రెండో సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోయిన విషయం తెలిసిందే. లాహోర్‌ వేదికగా బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో కివీస్‌ రికార్డు స్థాయిలో నిర్ణీత యాభై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 362 పరుగులు సాధించింది. అయితే, లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 312 పరుగులకే పరిమితమైంది. దీంతో డేవిడ్‌ మిల్లర్‌ వీరోచిత, విధ్వంసకర శతకం వృథాగా పోయింది. మిల్లర్‌ 67 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 100 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌-2024 ఫైనల్లో టీమిండియా- సౌతాఫ్రికా తలపడిన విషయం తెలిసిందే. అయితే, ప్రొటిస్‌ జట్టు ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. రోహిత్‌ సే న ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి చాంపియన్‌గా నిలిచింది.

ఇక... ఐసీసీ టోర్నమెంట్లలో కీలక సమయాల్లో చేతులెత్తేసి చోకర్స్‌గా ముద్రపడ్డ సౌతాఫ్రికా ఖాతాలో ఉన్న ఏకైక ఐసీసీ టైటిల్‌ చాంపియన్స్‌ ట్రోఫీ మాత్రమే. 1998లో ప్రొటిస్‌ జట్టు విజేతగా నిలిచింది. ఆ తర్వాత పలు సందర్భాల్లో అద్భుత ప్రదర్శనతో సెమీస్‌, ఫైనల్‌ చేరినా ఇంత వరకు ట్రోఫీని మాత్రం ముద్దాడలేకపోయింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
ICC Champions Trophy 2025
India vs New Zealand
David Miller
New Zealand vs South Africa
Dubai
Pakistan
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

పాక్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న ఇరాన్‌ కొత్త ఎత్తుగడ!

పాక్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న ఇరాన్‌ కొత్త ఎత్తుగడ!

దుబాయ్‌ భారత కాన్సులేట్‌లోకి ఇక నేరుగా నో ఎంట్రీ!

దుబాయ్‌ భారత కాన్సులేట్‌లోకి ఇక నేరుగా నో ఎంట్రీ!

మళ్లీ పాక్‌ కెప్టెన్‌గా బాబర్‌ ఆజం​..!

మళ్లీ పాక్‌ కెప్టెన్‌గా బాబర్‌ ఆజం​..!

బలూచిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 40 మంది దుర్మరణం

బలూచిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 40 మంది దుర్మరణం

జోరు కొనసాగించాలని... 

జోరు కొనసాగించాలని... 

బిత్తర పోయిన పాక్‌ ప్రధాని.. అమెరికాకు ఘోర అవమానం!

బిత్తర పోయిన పాక్‌ ప్రధాని.. అమెరికాకు ఘోర అవమానం!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.