Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

పతిరణపై ధోని కామెంట్లు! మండిపడ్డ మలింగ.. ఎంఎస్‌ కరెక్ట్‌ అన్న లంక మరో పేసర్‌!

Sports Sakshi User Sakshi Sakshi Time May 23, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
msdhoni.jpg

IPL 2023- Matheesa Pathirana- CSK: మతీశ పతిరణ.. ‘బేబీ మలింగ’గా పేరొందిన ఈ శ్రీలంక బౌలర్‌.. ఐపీఎల్‌-2023లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయాల్లో కీలక పాత్ర పోషించాడనడంలో సందేహం లేదు. తన వైవిధ్యమైన టెక్నిక్‌తో బ్యాటర్లను తిప్పలు పెట్టే 20 ఏళ్ల పతిరణ.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 15 వికెట్లు తీశాడు.

ముఖ్యంగా జట్టుకు అవసరమైన సమయంలో డెత్‌ ఓవర్లలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. వరుస అవకాశాలు ఇచ్చిన సీఎస్‌కే కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో పతిరణను ఉద్దేశించి ధోని చేసిన వ్యాఖ్యలను.. లంక మాజీ స్టార్‌ లసిత్‌ మలింగ ఖండించగా.. మరో లంక పేసర్‌ చమిందా వాస్‌ మాత్రం భిన్నంగా స్పందించాడు.

టెస్టులు ఆడొద్దు

బేబీ మలింగ గురించి ధోని మాట్లాడుతూ.. పతిరణ పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితం కావాలని.. టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉండాలని సూచించాడు. వన్డేలు, టీ20లకు మాత్రమే లంక అతడి సేవలను ఉపయోగించుకోవాలని సూచన చేశాడు. గాయాల బారిన పడితే కెరీర్‌ ప్రమాదంలో పడుతుందన్న ఉద్దేశంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. 

ధోని వ్యాఖ్యలు ఖండించిన మలింగ

అయితే, మలింగ మాత్రం ఈ విషయంలో ధోనిని వ్యతిరేకించాడు. గాయాలకు భయపడి టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సిన అవసరం లేదని.. సంప్రదాయ క్రికెట్‌ ఆడితేనే టెక్నిక్‌ మెరుగుపడుతుందని పేర్కొన్నాడు. తాను కూడా టెస్టులు ఆడిన వాడినేనని.. ధోని గనుక సీరియస్‌గానే ఆ వ్యాఖ్యలు చేసి ఉంటే అవి ఆమోదనీయం కాదంటూ ఖండించాడు.

కానీ, చమింద వాస్‌ మాత్రం ధోని వ్యాఖ్యలకు మద్దతు తెలిపాడు. ‘‘పతిరణ లాంటి బౌలర్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అతడి లాంటి వైవిధ్యమైన, ప్రత్యేకమైన యాక్షన్‌ కలిగిన బౌలర్‌ ఒకవేళ అన్ని ఫార్మాట్లలో ఆడితే ఫిట్‌నెస్‌ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. 

నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేస్తే పెద్దగా భారం పడదు. అంతకంటే ఎక్కువసేపు రోజుల తరబడి బౌల్‌ చేయాలంటే సమస్యలు తప్పవు. ధోని మాటలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా’’ అని పేర్కొన్నాడు.

చదవండి: ఇంగ్లండ్‌కు బయల్దేరిన టీమిండియా.. కోహ్లి, అశ్విన్‌ లేకుండానే..!

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
IPL 2023
Matheesha Pathirana
Lasith Malinga
MS Dhoni
Chaminda Vaas
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన ధోని

ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన ధోని

గంభీర్‌పై నిప్పులు చెరిగిన మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌!

గంభీర్‌పై నిప్పులు చెరిగిన మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌!

‘జిడ్డులా వేలాడలేదు.. తేలిగ్గానే వదిలేశాడు’

‘జిడ్డులా వేలాడలేదు.. తేలిగ్గానే వదిలేశాడు’

రెండో టైటిల్‌.. ఆర్సీబీ సాధించిన రికార్డులు ఇవే

రెండో టైటిల్‌.. ఆర్సీబీ సాధించిన రికార్డులు ఇవే

ధోనీ ఆ విషయం అప్పుడే చెప్పాడు!

ధోనీ ఆ విషయం అప్పుడే చెప్పాడు!

IPL 2026: ధోనికిదే చివరి సీజన్‌!

IPL 2026: ధోనికిదే చివరి సీజన్‌!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.