Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

కావాలనే క్వాడ్రపుల్‌ సెంచరీ (400) మిస్‌.. లారా రియాక్షన్‌ ఇదే

Sports Sakshi User Sakshi Sakshi Time Jul 11, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
lara.jpg

క్రికెట్‌ వర్గాల్లో గత కొన్ని రోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు వియాన్‌ ముల్డర్‌ (Wiaan Mulder). ఈ సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ ఇటీవల జింబాబ్వేతో రెండో టెస్టు సందర్భంగా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్‌గా తన తొలి ప్రయత్నంలోనే ఏకంగా 367 పరుగులతో దుమ్ములేపాడు.

కావాలనే క్వాడ్రపుల్‌ సెంచరీ (400) మిస్‌.. 
అజేయ ట్రిపుల్‌ సెంచరీతో అదరగొట్టి టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ప్రొటిస్‌ క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలోనే అతడు వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియన్‌ లారా (Brian Lara) పేరిట క్వాడ్రపుల్‌ సెంచరీ (400) రికార్డుకు చేరవయ్యాడు. అయితే, అనూహ్యంగా తాను 367 పరుగుల వద్ద ఉండగా ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసి ముల్డర్‌ ఆశ్చర్యపరిచాడు.

లారా వంటి లెజండరీ బ్యాటర్‌ పేరిటే ఈ రికార్డు ఉండాలని.. అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో ముల్డర్‌పై ప్రశంసలతో పాటు విమర్శల వర్షమూ కురిసింది. రికార్డులు ఉన్నవి బద్దలు కొట్టేందుకేనని. అయినా అతడేమీ 399 వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేయదంటూ పలువురు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

లారా రియాక్షన్‌ ఇదే
తాజాగా ఈ విషయం గురించి వియాన్‌ ముల్డర్‌ స్పందించాడు. తన అభిప్రాయంతో లారా ఏకీభవించలేదంటూ ఆసక్తికర విషయం చెప్పాడు. ‘‘నాకు కాస్త విరామం దొరికినపుడు.. బ్రియన్‌ లారాతో మాట్లాడాను. నీకంటూ సొంత లెగసీ సృష్టించుకోవాలని ఆయన నాతో అన్నాడు.

నీకోసమే నువ్వు ఆడాలని చెప్పాడు. రికార్డులు ఉన్నవి బద్దలు కొట్టడానికేనని... మరోసారి గనుక నేను ఇలా 400కు చేరువగా వస్తే మాత్రం.. అప్పుడు ఆ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దని చెప్పాడు.

నా నిర్ణయం సరైందే
నిజానికి ఇప్పుడు నేను బ్యాటింగ్‌ కొనసాగించి.. తనకంటే ఎక్కువ స్కోరు చేస్తే సంతోషించేవాడినని నాతో అన్నాడు. ఆయనలో ఉన్న గొప్పదనం అదే. అయితే, ఇప్పటికీ నా నిర్ణయం సరైందేనని నేను భావిస్తున్నా. ఆటను, దిగ్గజాలను గౌరవించడం అన్నిటికంటే ముఖ్యం’’ అని వియాన్‌ ముల్డర్‌ సూపర్‌స్పోర్ట్‌తో వ్యాఖ్యానించాడు.

మిస్‌ చేసుకున్నావు
కాగా వియాన్‌ ముల్డర్‌ గురించి మరో విండీస్‌ దిగ్గజం క్రిస్‌ గేల్‌ ఇటీవల మాట్లాడుతూ.. ‘‘అతడు తప్పు చేశాడు. 400 కొట్టేందుకు అతడు ప్రయత్నించి ఉండాల్సింది. అలా అయితేనే కదా.. క్వాడ్రపుల్‌ సెంచరీ చేసేవాడో లేదో తెలిసేది. కానీ 367 పరుగుల వద్ద ఉన్నపుడు డిక్లేర్‌ చేశాడు.

తానేం చెప్పదలచుకున్నాడో అది చెప్పేశాడు. జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి అరుదైన అవకాశాలు వస్తాయి. టెస్టు ఇన్నింగ్స్‌లో 400 రన్స్‌ మామూలు విషయం కాదు. ఈసారి నువ్వు ఇది మిస్‌ చేసుకున్నావు’’ అంటూ విమర్శించాడు.

కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ నయా చాంపియన్‌ సౌతాఫ్రికా రెండు టెస్టులు ఆడేందుకు జింబాబ్వేకు వెళ్లింది. తొలి టెస్టులో కేశవ్‌ మహరాజ్‌ సారథ్యంలో.. రెండో టెస్టులో ముల్డర్‌ కెప్టెన్సీలో ఆతిథ్య జట్టును చిత్తు చేసి 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.

చదవండి: ప్యాట్‌ కమిన్స్‌ని సలహా అడిగితే ఏమన్నాడంటే..: నితీశ్‌ రెడ్డి

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Wiaan Mulder
brian lara
South Africa vs Zimbabwe
test series
chris gayle
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

1000 సిక్సర్లు పూర్తి చేసుకున్న విండీస్‌ యోధుడు

1000 సిక్సర్లు పూర్తి చేసుకున్న విండీస్‌ యోధుడు

శ్రీలంకకు భారీ షాక్‌!

శ్రీలంకకు భారీ షాక్‌!

స్లో ఓవర్‌రేట్‌ దెబ్బ.. ఇంగ్లండ్‌కు భారీ షాక్‌!

స్లో ఓవర్‌రేట్‌ దెబ్బ.. ఇంగ్లండ్‌కు భారీ షాక్‌!

శతక్కొట్టుడు.. చరిత్ర సృష్టించిన పోలార్డ్‌

శతక్కొట్టుడు.. చరిత్ర సృష్టించిన పోలార్డ్‌

జో రూట్ ఒంట‌రి పోరాటం.. ఇంగ్లండ్ గెలిస్తే చ‌రిత్రే!

జో రూట్ ఒంట‌రి పోరాటం.. ఇంగ్లండ్ గెలిస్తే చ‌రిత్రే!

హెన్రీల చేతిలో ఇంగ్లండ్‌కు చావుదెబ్బ.. కివీస్‌కు భారీ ఆధిక్యం

హెన్రీల చేతిలో ఇంగ్లండ్‌కు చావుదెబ్బ.. కివీస్‌కు భారీ ఆధిక్యం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.