విండీస్ హార్డ్ హిట్టర్ కైల్ మేయర్స్‌కు ఇదే తొలి ఐపీఎల్. సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడుతున్న మేయర్స్ డెబ్యూ ఐపీఎల్ మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 38 బంతుల్లో 73 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులో ఉన్నంతసేపు ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడిన మేయర్స్ ఒక అరుదైన రికార్డు అందుకున్నాడు. డెబ్యూ ఐపీఎల్ మ్యాచ్‌లో అత్యధిక స్కోరు సాధించిన నాలుగో ఆటగాడిగా రికార్డులకెక్కాడు.

Photo: Jio Cinema Twitter
ఇంతకముందు బ్రెండన్ మెక్కల్లమ్(కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ, 2008)) 158* పరుగులు తొలి స్థానంలో ఉండగా.. మైక్ హస్సీ(సీఎస్కే వర్సెస్ పంజాబ్, 2008) రెండో స్థానంలో, షాన్ మార్ష్ 84* పరుగులు(పంజాబ్ కింగ్స్ వర్సెస్ డెక్కన్ చార్జర్స్ ,2008) మూడో స్థానంలో ఉన్నాడు. తాజాగా కైల్ మేయర్స్ తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే 73 పరుగులు చేసి ఔరా అనిపించాడు.
A sneak peek of some brute force from Barbados 🇧🇧
If you're in Lucknow, watch your head!
Watch #LSGvDC LIVE & FREE on #JioCinema across all telecom operators 🙌#IPL2023 #TATAIPL2023 #IPLonJioCinema pic.twitter.com/tQ2ekEF0lX— JioCinema (@JioCinema) April 1, 2023
చదవండి: IPL 2023: తొలిరోజే అట్టర్‌ప్లాఫ్.. ఏకిపారేసిన అభిమానులు