Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

ఆర్సీబీ ప్రతినిధుల్ని అరెస్ట్‌ చేయండి: కర్ణాటక సీఎం

Sports Sakshi User Sakshi Sakshi Time Jun 6, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
rcb.jpg

డీజీపీని ఆదేశించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య  

కర్ణాటక క్రికెట్‌ సంఘం, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ల మెడకు ఉచ్చు

జ్యుడీషియల్‌ విచారణకు ఆదేశం

నివేదిక కోరిన కర్ణాటక హైకోర్టు

తొక్కిసలాటపై సచిన్,  కపిల్‌దేవ్‌ దిగ్భ్రాంతి 

సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన ఐపీఎల్‌ ట్రోఫీ విజయ సంబరాలు బెంగళూరులో 11 మంది కుటుంబాలను విషాదంలో ముంచాయి. దీంతో టైటిల్‌ గెలిచిన ఆనందం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) శిబిరంలో ఆవిరైంది. ఈ దుర్ఘటనను తీవ్రంగా పరిగణించిన కర్ణాటక సీఎం సిద్ధారామయ్య ఆర్‌సీబీ ప్రతినిధుల్ని అరెస్టు చేయాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. 

విధుల్లో నిర్లక్షంగా వ్యవహరించిన బెంగళూరు కమిషనర్‌ దయానంద్‌ సహా ఐదుగురు పోలీసు అధికారుల్ని సైతం సర్కారు సస్పెండ్‌ చేసింది. పలువురు దిగ్గజ క్రికెటర్లు పెను విషాదంపై విచారం వెలిబుచ్చారు. బెంగళూరు పోలీసులు ఫ్రాంచైజీ సహా కర్ణాటక రాష్ట్ర క్రికెట్‌ సంఘంపై కేసు నమోదు చేసింది. కర్ణాటక హైకోర్టు తక్షణ నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.   

బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట దుర్ఘటనపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కన్నెర్రజేసింది. ఏకంగా 11 మంది మృత్యువాత పడిన ఈ విషాద ఘటనను తీవ్రంగా పరిగణించిన సీఎం సిద్ధరామయ్య దుర్ఘటనకు బాధ్యులైన వారిలో ఎవరినీ విడిచిపెట్టొద్దని రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) ప్రతినిధుల్ని వెంటనే అరెస్టు చేయాలని, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ డీఎన్‌ఏ, కర్ణాటక క్రికెట్‌ సంఘం (కేఎస్‌సీఏ) ఉన్నతాధికారుల్ని సైతం అదుపులోకి తీసుకోవాలని ఆ రాష్ట్ర సీఎం ఆదేశించారు. 

విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన బెంగళూరు నగర్‌ పోలీస్‌ కమిషనర్‌ దయానంద్‌ సహా ఐదుగురు అధికారుల్ని సస్పెండ్‌ చేస్తున్నట్లు రాష్ట్రప్రభుత్వం వెల్లడించింది. జ్యుడీషియల్‌ విచరాణ కోసం హైకోర్టు రిటైర్డ్‌ జస్టిస్‌ మైకేల్‌ డికున్హా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌  ఏర్పాటు చేసింది. కేసు దర్యాప్తును సీఐడీకి బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది. 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్‌లో తొలిసారి టైటిల్‌ గెలవడంతో బుధవారం బెంగళూరులో విజయోత్సవ సంబరాలు విషాదంగా ముగిశాయి.

చిన్నస్వామి స్టేడియం ప్రేక్షకుల సామర్థ్యానికి పదిరెట్లకు మించి పోటెత్తిన అభిమాన సందోహాన్ని పోలీసులు నియంత్రించలేకపోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనకు ప్రధాన కారణమైన ఆర్‌సీబీ ఫ్రాంచైజీ యాజమాన్యం, కేఎస్‌సీఏ, డీఎన్‌ఏపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ప్రధాన నిందితులు ఏ1గా ఆర్‌సీబీపై కేసులు మోపారు. ఏ2గా డీఎన్‌ఏ, ఏ3గా కేఎస్‌సీఏపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని బెంగళూరు పోలీసులు తెలిపారు. 

కుబ్బన్‌ పార్క్‌ పోలీస్‌ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహితలోని  105, 115, 118, 190, 132, 125, 142, 121 సెక్షన్ల కింద పలు నేరారోపణలలతో కేసులు నమోదు చేశారు. అయితే విషాదఘటన అనంతర విచారణకు పూర్తిగా  సహకరిస్తామని ఆర్‌సీబీ యాజమాన్యం  ప్రకటించింది. పోలీసు దర్యాప్తునకు, రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియల్‌ విచారణకు సహకారం అందజేస్తామని ఆర్‌సీబీ తెలిపింది.  

ప్రస్తుత పరిస్థితిపై... 
తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు స్పందించింది. తాత్కాలిక చీఫ్‌ జస్టిస్‌ కామేశ్వర్‌ రావు, జస్టిస్‌ సీఎమ్‌ జోషిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ప్రజా ప్రయోజనార్థం కేసును సుమోటోగా స్వీకరించింది. ప్రస్తుత పరిస్థితిపై పూర్తిస్థాయి నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హృదయ విదారక దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారు, గాయపడిన వారు, చికిత్స పొందుతున్న వారి వివరాలు సహా ప్రభుత్వం, పోలీసులు తక్షణం చేపట్టిన చర్యలు తదితర వివరాలతో కూడిన సంపూర్ణ నివేదిక ఇవ్వాల్సిందిగా కర్ణాటక సర్కారును డివిజన్‌ బెంచ్‌ ఆదేశించింది. 

ఆర్‌సీబీ పరిహారం  
ఇది వరకే రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. కేఎస్‌సీఏ కూడా రూ. 5 లక్షలు పరిహారం ఇస్తామంది. తాజాగా బెంగళూరు ఫ్రాంచైజీ యాజమాన్యం ఆర్‌సీబీ కూడా ఒక్కో మృతుడి కుటుంబానికి రూ. 10 లక్షలు పరిహారంగా అందజేస్తామని తెలిపింది.  


దిగ్గజాల దిగ్భ్రాంతి 
సంబరాల కంటే ప్రాణాలే ముఖ్యమని దిగ్గజ  క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ అన్నారు. ‘ఈ ఘటన నన్ను తీవ్రంగా బాధించింది. ఇకనైనా మనం పాఠాలు నేర్వాలి. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. పొరపాట్లు జరగడం సహజమై ఉండొచ్చు... కానీ ఆ పొరపాట్లకు ప్రాణాలే మూల్యంగా చెల్లించుకోవడం అత్యంత విచారకరం. భవిష్యత్తులో ఏ జట్టయినా సరే టైటిల్‌ సాధిస్తే హుందాగా నడుచుకోవాలి. మితిమీరిన సంబరాలు, వేడుకల కంటే కూడా ప్రాణాలే విలువైనవని గుర్తుంచుకోవాలి’ అని కపిల్‌ విచారం వెలిబుచ్చారు. 

సామాజిక సైట్‌ ‘ఎక్స్‌’లో సచిన్‌ టెండూల్కర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. తొక్కిసలాట నన్ను నిర్ఘాంతపరిచిందని, బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని పోస్ట్‌ చేశాడు. గతంలో ఆర్‌సీబీకి ప్రాతినిధ్యం వహించిన దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ డివిలియర్స్‌ విషాదకర ఘటనపై విచారం వెలిబుచ్చాడు. బెంగళూరుకు చెందిన మాజీ భారత కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే క్రికెట్‌కు ఇదొక దుర్దినం అని అన్నారు. 

మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన కుంబ్లే క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని అన్నారు. భారత హెడ్‌ కోచ్‌ గంభీర్‌ తాను ఇలాంటి రోడ్‌ షో విజయోత్సవాలకు వ్యతిరేకమని అన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలని సూచించారు.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
stampede
siddaramaiah
Royal Challengers Bangalore
arrest
Karnataka State Cricket Association
IPL 2025
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ప్రియుడి మోజులో పడి కన్నకొడుకునే చంపేసిన తల్లి!

ప్రియుడి మోజులో పడి కన్నకొడుకునే చంపేసిన తల్లి!

NEET రీ-ఎగ్జామ్‌.. వెలుగులోకి భారీ కుంభకోణం!

NEET రీ-ఎగ్జామ్‌.. వెలుగులోకి భారీ కుంభకోణం!

రష్యా నుంచి భారత్‌కు చమురు.. నావికుడు అరెస్టు

రష్యా నుంచి భారత్‌కు చమురు.. నావికుడు అరెస్టు

రష్యా ఆయిల్ ట్యాంకర్ సీజ్.. భారత పౌరుడు అరెస్ట్

రష్యా ఆయిల్ ట్యాంకర్ సీజ్.. భారత పౌరుడు అరెస్ట్

నీట్ రీ ఎగ్జామ్‌కు ముందే భారీ స్కామ్..నలుగురు అరెస్ట్‌

నీట్ రీ ఎగ్జామ్‌కు ముందే భారీ స్కామ్..నలుగురు అరెస్ట్‌

బ్యాగ్ తో టిప్ టాప్ గా ఫ్లైట్ దిగింది.. అడ్డంగా బుక్కైంది..

బ్యాగ్ తో టిప్ టాప్ గా ఫ్లైట్ దిగింది.. అడ్డంగా బుక్కైంది..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.