గుజరాత్ టైటాన్స్ ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ ఫైనల్‌కు చేరింది. తమ అరంగేట్ర సీజన్ 2022లో ఏకంగా చాంపియన్‌గా నిలిచిన టైటాన్స్.. 2023లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. తాజాగా ఐపీఎల్-2026లో ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించిన గుజరాత్ జట్టు.. క్వాలిఫయర్-2లో జయభేరి మోగించింది.
రాజస్తాన్ రాయల్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ముల్లన్‌పూర్‌లో రాయల్స్ విధించిన 215 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే గుజరాత్ ఊదేసింది. ఈ విజయంలో ఓపెనర్, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ది కీలక పాత్ర.
రాజస్తాన్‌తో మ్యాచ్‌లో కేవలం 47 బంతుల్లోనే గిల్ శతక్కొట్టాడు. మొత్తంగా 53 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 104 పరుగులు సాధించాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోవడంతో గిల్ మెరుపు ఇన్నింగ్స్‌కు తెరపడింది.
ఏదేమైనా క్వాలిఫయర్-2లో అద్భుత శతకంతో రాణించి జట్టును గెలిపించిన గిల్.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. కాగా అతడికి ఐపీఎల్లో ఇది ఐదో సెంచరీ. ఈ మ్యాచ్ సందర్భంగా గిల్ సాధించిన రికార్డులు ఇవీ..
ఐపీఎల్లో అత్యధిక శతకాల వీరుల జాబితాలో..
విరాట్ కోహ్లి- 9 శతకాలు
జోస్ బట్లర్- 7 శతకాలు
క్రిస్ గేల్, కేఎల్ రాహుల్- 6 శతకాలు
సంజూ శాంసన్, శుబ్‌మన్ గిల్- 5 శతకాలు
డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్- 4 శతకాలు
గుజరాత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీలు
శుబ్‌మన్ గిల్- 47 బంతుల్లో 2026లో రాజస్తాన్‌పై
శుబ్‌మన్ గిల్- 49 బంతుల్లో 2023లో ముంబైపై
శుబ్‌మన్ గిల్- 50 బంతుల్లో 2024లో చెన్నైపై
సాయి సుదర్శన్- 50 బంతుల్లో 2024లో చెన్నైపై
ఐపీఎల్లో కెప్టెన్‌గా అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్లు
విరాట్ కోహ్లి- 5
కేఎల్ రాహుల్- 3
శుబ్‌మన్ గిల్- 2.