Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

IPL 2025: మా పోరాటం ప్రశంసనీయం.. రుతురాజ్‌ మ్యాచ్‌ను లాగేసుకున్నాడు: సూర్యకుమార్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Mar 24, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
mi.jpg

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో ఓడిపోయే ఆనవాయితీని ముంబై ఇండియన్స్‌ కొనసాగించింది. వరుసగా 13వ ఏడాది ముంబై తమ తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైంది. చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా నిన్న (మార్చి 23) రాత్రి జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ముంబైపై 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎంఐ తడబడింది. 

సీఎస్‌కే బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. రోహిత్‌ శర్మ డకౌటై నిరాశపరిచగా.. విధ్వంసకర వీరులు రికెల్టన్‌ (13), విల్‌ జాక్స్‌ (11), తాత్కాలిక కెప్టెన్‌ సూర్యకుమార్‌ (29), తిలక్‌ వర్మ (31) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. 

అరంగేట్రం ఆటగాడు రాబిన్‌ మి​ంజ్‌ (3) తేలిపోయాడు. నమన్‌ ధిర్‌ 17, సాంట్నర్‌ 11 పరుగులు చేయగా.. ఆఖర్లో దీపక్‌ చాహర్‌ (15 బంతుల్లో 28 నాటౌట్‌) బ్యాట్‌ ఝులిపించాడు. సీఎస్‌కే బౌలర్లలో నూర్‌ అహ్మద్‌ (4-0-18-4) ఐపీఎల్‌ కెరీర్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. ఖలీల్‌ అహ్మద్‌ (4-0-29-3) సత్తా చాటాడు. వెటరన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, నాథన్‌ ఇల్లిస్‌ తలో వికెట్‌ తీశారు.

స్లో ట్రాక్‌పై ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్‌కే ఆదిలోనే వికెట్‌ కోల్పోయింది. దీపక్‌ చాహర్‌ ఓపెనర్‌ రాహుల్‌ త్రిపాఠిని 2 పరుగులకే ఔట్‌ చేశాడు. వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు. రుతు 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేసి మ్యాచ్‌ను ముంబై చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు. 

మరో ఎండ్‌లో రచిన్‌ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) బాధ్యతాయుతంగా ఆడి చివరి వరకు క్రీజ్‌లో ఉన్నాడు. సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. రుతురాజ్‌ ఔటయ్యాక సీఎస్‌కే కాస్త తడబడింది. అరంగేట్రం స్పిన్నర్‌ విజ్ఞేశ్ పుథుర్‌ వరుసగా తన మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసి ముంబైని తిరిగి మ్యాచ్‌లోకి తెచ్చినట్లు కనిపించాడు. ఈ దశలో విల్‌ జాక్స్‌, నమన్‌ ధిర్‌ కూడా అద్బుతంగా బౌలింగ్‌ చేశారు. సీఎస్‌కే ఆటగాళ్లను కట్టడి చేసి పరుగులు రానివ్వకుండా చేశారు. 

అయితే అప్పటిదాకా అద్బుతంగా బౌలింగ్‌ చేసిన విజ్ఞేశ్‌ పుథుర్‌ను 18వ ఓవర్‌లో బౌలింగ్‌కు దించి ముంబై కెప్టెన్‌ స్కై పెద్ద తప్పు చేశాడు. ఆ ఓవర్‌లో రచిన్‌ చెలరేగిపోయి 2 సిక్సర్ల సాయంతో 15 పరుగులు పిండుకున్నాడు. ఆ ఓవర్‌లోనే ముంబై ఓటమి ఖరారైపోయింది. 19వ ఓవర్‌లో నమన్‌ ధిర్‌ జడ్డూ వికెట్‌ తీసి కేవలం 2 పరుగులే ఇచ్చినా చివరి ఓవర్‌ తొలి బంతికే సిక్సర్‌ బాది రచిన్‌ సీఎస్‌కేను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో ధోని సూర్యకుమార్‌ను మెరుపు స్టంపింగ్‌ చేసి వింటేజ్‌ ధోనిని గుర్తు చేశాడు.

మ్యాచ్‌ అనంతరం సూర్యకుమార్‌ స్పందిస్తూ.. మేము 15-20 పరుగులు తక్కువ చేశాం. అయినా మా కుర్రాళ్ల పోరాటం ప్రశంసనీయం. యువకులకు అవకాశాలు ఇవ్వడంలో ముంబై ఇండియన్స్‌ ప్రసిద్ధి చెందింది . ఎంఐ స్కౌట్స్ ఏడాదిలో 10 నెలలు టాలెంట్‌ను వెతికే పనిలో ఉంటారు. విజ్ఞేశ్‌ పుథుర్‌ దాని ఫలితమే. తొలి మ్యాచ్‌లోనే విజ్ఞేశ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. తన తొలి 3 ఓవర్లలో 3 వికెట్లు తీసి తిరిగి తమను మ్యాచ్‌లోకి తెచ్చాడు. 

ఆట లోతుగా సాగితే అతని కోసమని ఓ ఓవర్‌ను స్పేర్‌గా ఉంచాను. అది మిస్‌ ఫైర్‌ అయ్యింది.  18వ ఓవర్ విజ్ఞేశ్‌కు ఇచ్చి తప్పు చేశాను. మ్యాచ్‌ జరుగుతుండగా మంచు ప్రభావం లేదు. కానీ కాస్త జిగటగా ఉండింది. రుతురాజ్ బ్యాటింగ్ చేసిన విధానం మ్యాచ్‌ను మా నుండి దూరం చేసింది. ఇది తొలి మ్యాచే. ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని అన్నాడు. కాగా, ముంబై తమ రెండో మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌ మార్చి 29న అహ్మదాబాద్‌లో జరుగనుంది. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Mumbai Indians
Chennai Super Kings
MI vs CSK
IPL 2025
Surya Kumar Yadav
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ముంబైకి సూర్య గుడ్‌బై!.. గంభీర్‌తో కలిసి ఆ జట్టులోకి?!

ముంబైకి సూర్య గుడ్‌బై!.. గంభీర్‌తో కలిసి ఆ జట్టులోకి?!

వేటు పడ్డాక వీరంగం సృష్టిస్తున్న స్కై

వేటు పడ్డాక వీరంగం సృష్టిస్తున్న స్కై

మొన్న బీసీసీఐ.. ఇవాళ ముంబై ఇండియ‌న్స్‌!

మొన్న బీసీసీఐ.. ఇవాళ ముంబై ఇండియ‌న్స్‌!

సూర్యకుమార్‌ యాదవ్‌ రిటైర్మెంట్‌!?

సూర్యకుమార్‌ యాదవ్‌ రిటైర్మెంట్‌!?

కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌.. భువీ, షమీకి చోటు!

కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌.. భువీ, షమీకి చోటు!

జట్టు నుంచి తీసేశారు.. కట్‌ చేస్తే! సూర్యకుమార్ సంచలన నిర్ణయం?

జట్టు నుంచి తీసేశారు.. కట్‌ చేస్తే! సూర్యకుమార్ సంచలన నిర్ణయం?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.