Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

ఒక్క పరుగు.. ఒకే ఒక్క పరుగు.. హృదయం ముక్కలైంది!

Sports Sakshi User Sakshi Sakshi Time May 4, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
kkrvsrr.jpg

ఒక్క పరుగు.. ఒకే ఒక్క పరుగు తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌ ఓడిపోయింది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR vs RR)తో మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకు పోరాడి చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది. ఐపీఎల్‌-2025 (IPL 2025)లో భాగంగా రాజస్తాన్‌ ఆదివారం మధ్యాహ్నం నాటి మ్యాచ్‌లో కేకేఆర్‌తో తలపడింది.

ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆతిథ్య కేకేఆర్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్లలో రహ్మనుల్లా గుర్బాజ్‌ (35) రాణించగా.. సునిల్‌ నరైన్‌ (11) విఫలమయ్యాడు. ఈ క్రమంలో కెప్టెన్‌ అజింక్య రహానే (30), అంగ్‌క్రిష్‌ రఘువన్షీ (44) కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దారు.

ఆండ్రీ రసెల్‌ తొలి ఫిఫ్టీ
ఇక ఆఖర్లో ఆండ్రీ రసెల్‌ (Andre Russel), రింకూ సింగ్‌ విశ్వరూపం ప్రదర్శించారు. రసెల్‌ 25 బంతుల్లో 4 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 57 పరుగులతో చెలరేగగా.. రింకూ ఆరు బంతుల్లో 19 పరుగులతో దుమ్ములేపారు. ఇద్దరూ కలిసి ఆఖరి వరకు నాటౌట్‌గా నిలిచారు. ఈ క్రమంలో 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి కేకేఆర్‌ 206 పరుగులు సాధించింది.

రాజస్తాన్‌ బౌలర్లలో మహీశ్‌ తీక్షణ, రియాన్‌ పరాగ్‌, జోఫ్రా ఆర్చర్‌, యుధ్‌వీర్‌ సింగ్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే రాజస్తాన్‌కు వరుస షాకులు తగిలాయి. ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ (4), వన్‌డౌన్‌లో వచ్చిన కునాల్‌ సింగ్‌ రాథోడ్‌ (0) పూర్తిగా విఫలమయ్యారు.

రియాన్‌ పరాగ్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌
వీరికి తోడు వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ధ్రువ్‌ జురెల్‌ (0), వనిందు హసరంగ (0) కూడా చేతులెత్తేశారు. ఇలాంటి కఠిన దశలో రియాన్‌ పరాగ్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. కేవలం 45 బంతుల్లోనే 95 పరుగులు సాధించాడు. అయితే, దురదృష్టవశాత్తూ హర్షిత్‌ రాణా బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి వైభవ్‌ అరోరాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.

పరాగ్‌ అవుటైన తర్వాత జోఫ్రా ఆర్చర్‌ (12), శుభమ్‌ దూబే (25 నాటౌట్‌) ఆఖరి బంతి వరకు పోరాడారు. కానీ చివరి బాల్‌కు మూడు పరుగులు కావాల్సి ఉండగా.. ఆఖరి బంతికి ఆర్చర్‌ రనౌట్‌ కావడంతో రాయల్స్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది. 20 ఓవర్లు పూర్తయ్యే సరికి ఎనిమిది వికెట్ల నష్టానికి రాజస్తాన్‌ 205 పరుగుల వద్ద నిలిచిపోయింది.

ఫలితంగా కేకేఆర్‌ సొంతగడ్డపై ఒక్క పరుగు తేడాతో గెలిచి ప్లే ఆఫ్స్‌ ఆశలను సజీవం చేసుకుంది. ఇక ఈ సీజన్లో ఇప్పటికి పన్నెండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న రాజస్తాన్‌కు ఇది తొమ్మిదో పరాజయం. దీంతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. మరోవైపు.. 11 మ్యాచ్‌లలో ఐదు గెలిచిన కేకేఆర్‌ ఆరో స్థానానికి ఎగబాకింది. 

ఐపీఎల్‌ 2025: కేకేఆర్‌ వర్సెస్‌ రాజస్తాన్‌
👉కేకేఆర్‌ స్కోరు: 206/4 (20)
👉రాజస్తాన్‌ స్కోరు: 205/8 (20)
👉ఫలితం: ఒక్క పరుగు తేడాతో రాజస్తాన్‌పై కేకేఆర్‌ విజయం
👉ప్లేయర్‌ ఆఫ్‌ దిమ్యాచ్‌: ఆండ్రీ రసెల్‌

చదవండి: శెభాష్‌ రియాన్‌!.. ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు.. కానీ పాపం..

Another day, another #TATAIPL classic 🤩@KKRiders prevail by 1️⃣ run in a last-ball thriller in Kolkata to boost their playoff hopes 👏💜

Scorecard ▶ https://t.co/wg00ni9CQE#KKRvRR pic.twitter.com/mJxuxBSPqw

— IndianPremierLeague (@IPL) May 4, 2025

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
IPL 2025
RR vs KKR
Riyan Parag
Yashasvi Jaiswal
Andre Russell
Rinku Singh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

ఘనంగా ముగించారు

ఘనంగా ముగించారు

జైశ్వాల్‌ మెరుపు సెంచరీ.. మూడో వన్డేలో భారత్‌ గ్రాండ్‌ విక్టరీ

జైశ్వాల్‌ మెరుపు సెంచరీ.. మూడో వన్డేలో భారత్‌ గ్రాండ్‌ విక్టరీ

IND vs AFG: మూడో వన్డే.. భారత తుదిజట్టు ఇదే!

IND vs AFG: మూడో వన్డే.. భారత తుదిజట్టు ఇదే!

మీ వల్ల గందరగోళంలో శుబ్‌మన్‌ గిల్‌: మాజీ క్రికెటర్‌ ఫైర్‌

మీ వల్ల గందరగోళంలో శుబ్‌మన్‌ గిల్‌: మాజీ క్రికెటర్‌ ఫైర్‌

IND vs AFG: యశస్వి జైస్వాల్‌ ఫెయిల్‌

IND vs AFG: యశస్వి జైస్వాల్‌ ఫెయిల్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.