Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

అతడు టాక్సిక్‌ బాస్‌.. ‘పంత్‌తో రాహుల్‌ ముచ్చట’? హర్ష్‌ గోయెంకా స్పందన వైరల్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Nov 26, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
32111.jpg

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2025 మెగా వేలంలో టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌కు అనుకున్నంత ధర దక్కలేదు. భారీ అంచనాల నడుమ ఆక్షన్‌లోకి వచ్చిన ఈ వికెట్‌ కీపర్‌ కోసం ఏ ఫ్రాంఛైజీ కూడా మరీ అంతగా ఎగబడిపోలేదు. రూ. 2 కోట్ల కనీస ధరతో రాహుల్‌ తన పేరును నమోదు చేసుకున్నాడు.

అయితే, లోకల్‌ బాయ్‌ కోసం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తొలుత బిడ్‌ వేయగా.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కూడా పోటీకి వచ్చింది. కానీ ధర కాస్త పెరగగానే ఈ రెండూ తప్పుకోగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ రాహుల్‌ కోసం పోటీపడ్డాయి. అలా ఆఖరికి రాహుల్‌ను ఢిల్లీ రూ. 14 కోట్లకు దక్కించుకుంది.

కాగా కేఎల్‌ రాహుల్‌ ఐపీఎల్‌-2022- 2024 వరకు లక్నో సూపర్‌ జెయింట్స్‌కు సారథ్యం వహించాడు. లక్నో ఫ్రాంఛైజీని అరంగేట్రంలో(2022)నే ప్లే ఆఫ్స్‌ చేర్చి సత్తా చాటాడు. మరుసటి ఏడాది కూడా టాప్‌-4లో నిలిపాడు. కానీ.. ఐపీఎల్‌-2024లో మాత్రం లక్నోకు వరుస పరాభవాలు ఎదురయ్యాయి.

రాహుల్‌పై గోయెంకా ఆగ్రహం
సీజన్‌ మొత్తంలో ఆడిన పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం ఏడు మాత్రమే గెలిచిన లక్నో.. 14 పాయింట్లతో పట్టికలో ఏడో స్థానానికి పరిమితమైంది. ఇదిలా ఉంటే.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో లక్నో చిత్తుగా ఓడిన నేపథ్యంలో.. ఆ ఫ్రాంఛైజీ యజమాని, ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్‌ గోయెంకా.. తమ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌పై బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశాడు.

స్వేచ్ఛ ఉన్న చోటే ఆడాలని
అందరి ముందే రాహుల్‌ను గోయెంకా తిట్టినట్లుగా ఉన్న దృశ్యాలు నెట్టింట విస్తృతంగా వైరల్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో రిటెన్షన్‌కు ముందు రాహుల్‌- లక్నోల బంధం తెగిపోయింది. ఈ విషయంపై రాహుల్‌ స్పందిస్తూ.. స్వేచ్ఛ ఉన్న చోట ఆడాలని  అనుకుంటున్నట్లు పరోక్షంగా గోయెంకా వైపు మాటల బాణాలు విసిరాడు.

ఈ నేపథ్యంలో మెగా వేలం సందర్భంగా సంజీవ్‌ గోయోంకా సైతం కేఎల్‌ రాహుల్‌కు కౌంటర్‌ గట్టిగానే ఇచ్చాడు. కాగా సౌదీ అరేబియాలో జరిగిన ఆక్షన్‌లో లక్నో.. టీమిండియా స్టార్‌ రిషభ్‌ పంత్‌ కోసం రూ. 27 కోట్లు వెచ్చించింది. ఈ విషయం గురించి గోయెంకా మాట్లాడుతూ.. ‘‘మాకు కావాల్సిన ఆటగాడికి ఉండాల్సిన లక్షణాలన్నీ పంత్‌లో ఉన్నాయి. అందుకే అతడి కోసం మేము ముందే రూ. 25- 27 కోట్లు పక్కన పెట్టుకున్నాం’’ అని పేర్కొన్నాడు.

ఏదేమైనా వేలం ముగిసే సరికి పంత్‌, రాహుల్‌ల జట్లు తారమారయ్యాయి. రాహుల్‌ స్థానంలో లక్నో కెప్టెన్‌గా పంత్‌, పంత్‌ ప్లేస్‌లో ఢిల్లీ సారథిగా రాహుల్‌ వ్యవహరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్‌ వీళ్లిద్దరి ఫొటోతో ఓ ఆసక్తికర ట్వీట్‌ చేశాడు. 

అన్నీ బాగానే ఉంటాయి.. కానీ
రాహుల్‌ పంత్‌ చెవిలో ముచ్చటిస్తున్నట్లుగా ఉన్న ఫొటోకు.. ‘‘చూడు భాయ్‌.. కంపెనీ మంచిది.. డబ్బు కూడా బాగానే ఇస్తారు.. కానీ బాస్‌ మాత్రం విషపూరితమైన మనసున్న వ్యక్తి’’ అంటూ క్యాప్షన్‌ జతచేశాడు. ఇందుకు ప్రముఖ వ్యాపారవేత్త, సంజీవ్‌ గోయెంకా అన్న హర్ష్‌ గోయెంకా స్పందించారు. ఇదేమిటబ్బా అన్నట్లుగా ఉన్న ఎమోజీని ఆయన జతచేశారు.

చదవండి: IPL 2025 Mega Auction: మెగా వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్ల పూర్తి జాబితా ఇదే..!

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
IPL 2025 Mega Auction
KL Rahul
Sanjeev Goenka
Rishabh Pant
Lucknow Super Giants
Harsh Goenka
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

'అలాగైతే ఢిల్లీని వీడు.. వేలంలోకి వెళ్ళిపో'

'అలాగైతే ఢిల్లీని వీడు.. వేలంలోకి వెళ్ళిపో'

IND vs AFG: కేఎల్‌ రాహుల్‌ను పక్కనపెట్టారా?

IND vs AFG: కేఎల్‌ రాహుల్‌ను పక్కనపెట్టారా?

ఢిల్లీకి పంత్‌... లక్నోకు కుల్దీప్‌!

ఢిల్లీకి పంత్‌... లక్నోకు కుల్దీప్‌!

ఢిల్లీ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌..! రీ ఎంట్రీ ఇవ్వనున్న పంత్‌?

ఢిల్లీ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌..! రీ ఎంట్రీ ఇవ్వనున్న పంత్‌?

మెరిసిన గిల్, రాహుల్  అఫ్గాన్ పై భారత్ విక్టరీ..

మెరిసిన గిల్, రాహుల్ అఫ్గాన్ పై భారత్ విక్టరీ..

మూడో స్థానం.. ఆ ముగ్గురికి అవకాశం: టీమిండియా కోచ్‌

మూడో స్థానం.. ఆ ముగ్గురికి అవకాశం: టీమిండియా కోచ్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.