Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

IPL 2024: ఫైనల్‌ వేటలో ఎవరిదో జోరు!

Sports Sakshi User Sakshi Sakshi Time May 21, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Untitled-8_7.jpg

నేడు తొలి క్వాలిఫయర్‌లో కోల్‌కతాతో హైదరాబాద్‌ ‘ఢీ’

గెలిస్తే నేరుగా టైటిల్‌ పోరుకు 

ఓడినా... మరో అవకాశం 

రాత్రి గం.7:30 నుంచి ‘స్టార్‌ స్పోర్ట్స్‌’, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం  

అహ్మదాబాద్‌: గత రెండు నెలలుగా పది జట్ల పోరు ‘ప్లే ఆఫ్స్‌’ లక్ష్యంగా సాగింది. మెరుపులు, ధనాధన్‌ ధమాకాలతో ఐపీఎల్‌ 17వ సీజన్‌ మరింత మజాను పంచింది. ఇప్పుడు నాలుగు జట్ల సమరం ఫైనల్‌ దిశగా జరగనుంది. ముందుగా మంగళవారం జరిగే తొలి క్వాలిఫయర్‌లో జోరు మీదున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌... రెండుసార్లు (2012, 2014) చాంపియన్‌ అయిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌)తో తలపడనుంది. 

2016లో ఐపీఎల్‌ ట్రోఫీ సాధించిన సన్‌రైజర్స్‌ ప్రస్తుత సీజన్‌లో భీకరమైన ఫామ్‌ దృష్ట్యా టైటిల్‌ వేటలో ముందంజ వేయాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు కోల్‌కతా తక్కువేం కాదు... తగ్గేలా లేనేలేదు! ఈ సీజన్‌లో కేవలం 3 మ్యాచ్‌లే ఓడిన నైట్‌రైడర్స్‌ ఎవరికి సాధ్యం కానీ 9 విజయాల్ని సాధించి పాయింట్ల పట్టికలో ‘టాప్‌’లో నిలిచింది. అటు బౌలింగ్, బ్యాటింగ్‌లో సమతూకంగా ఉన్న కేకేఆర్‌ రెండో క్వాలిఫయర్‌దాకా చాన్స్‌ తీసుకోకుండా ఫైనల్‌ బెర్త్‌ సాధించాలని ఆశిస్తోంది.  

సన్‌ తుఫాన్‌కు ఎదురేది? 
సన్‌రైజర్స్‌ కొట్టిన కొట్టుడు... దంచిన దంచుడు... 200 పైచిలుకు లక్ష్యమైనా మాకేంటని ఛేదించిన వైనం చూస్తే హైదరాబాద్‌కు ఎదురు నిలవడం ఏ జట్టుకైనా కష్టమే! దంచేసే ఓపెనర్‌ హెడ్‌ డకౌటైన గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 215 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే ఛేదించి టాప్‌–2లోకి దూసుకొచ్చింది. అభిషేక్‌ శర్మ, ఆంధ్రప్రదేశ్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి, క్లాసెన్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు పదేపదే చుక్కలు చూపిస్తున్నారు. ఈ జట్టు బలం బ్యాటింగే! అయితే  నిలకడ లేని బౌలింగ్‌తోనే అసలు సమస్యంతా! బౌలర్ల వైఫల్యం వల్లే 277/3, 287/3, 266/7 లాంటి రికార్డు స్కోర్లు నమోదు చేసినా భారీ తేడాతో ఏ మ్యాచ్‌ కూడా గెలవలేకపోయింది. కెపె్టన్‌ కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్‌ సహా బౌలర్లంతా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తేనే సన్‌రైజర్స్‌కు విజయం సులువవుతుంది.    

ఫైట్‌ రైడర్స్‌ 
ఫిల్‌ సాల్ట్‌–సునీల్‌ నరైన్‌ ఓపెనింగ్‌ జోడీ మెరుపులతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కాస్తా ఫైట్‌రైడర్స్‌గా మారింది. కీలకమైన మ్యాచ్‌లో సాల్ట్‌ (స్వదేశానికి తిరుగుముఖం) లేకపోయినప్పటికీ బ్యాటింగ్‌ బలం ఏమాత్రం తగ్గలేదు. ఎందుకంటే వెంకటేశ్‌ అయ్యర్, కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్, నితీశ్‌ రాణా, రసెల్, రింకూ సింగ్, రమణ్‌దీప్‌ ఇలా ఎనిమిదో వరుస వరకు తిరుగులేని బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న జట్టు కోల్‌కతా. 

ప్రత్యేకించి రసెల్, రింకూ, రమణ్‌దీప్‌లైతే స్పెషలిస్టు హిట్టర్లు. టాప్‌–3 విఫలమైన ప్రతీసారీ జట్టును నడిపించారు. బౌలింగ్‌లో అనుభవజు్ఞడైన స్టార్క్, నరైన్, రసెల్‌లతో పాటు హర్షిత్‌ రాణా, వరుణ్‌ చక్రవర్తిలు నైట్‌రైడర్స్‌ విజయాల్లో భాగమవుతున్నారు. ఇక నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌ ఆడి పది రోజులవుతోంది. ఈ నెల 11న ముంబై ఇండియన్స్‌పై మొదట 157/7 స్కోరే చేసినా... ప్రత్యరి్థని 139/8కు కట్టడి చేసి 18 పరుగులతో గెలిచింది. తర్వాత గుజరాత్, రాజస్తాన్‌లతో జరగాల్సిన రెండు మ్యాచ్‌లు వర్షంతో రద్దయ్యాయి. దీంతో ఆటగాళ్లంతా ‘మ్యాచ్‌ ఆకలి’ మీదున్నారు. తప్పకుండా ఇరుజట్ల మధ్య హోరాహోరీ సమరం గ్యారంటీ! 

జట్లు (అంచనా) 
హైదరాబాద్‌: కమిన్స్‌ (కెప్టెన్‌), హెడ్, అభిõÙక్‌ శర్మ, రాహుల్‌ త్రిపాఠి, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, క్లాసెన్, షహబాజ్, సమద్, సన్వీర్, భువనేశ్వర్, విజయకాంత్, నటరాజన్‌. 

కోల్‌కతా: శ్రేయస్‌ అయ్యర్‌ (కెపె్టన్‌), నరైన్, గుర్బాజ్, వెంకటేశ్, నితీశ్‌ రాణా, రింకూ సింగ్, రసెల్, రమణ్‌దీప్, స్టార్క్, హర్షిత్‌ రాణా, వరుణ్, అనుకుల్‌/వైభవ్‌.  

పిచ్, వాతావరణం 
నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఆరు మ్యాచ్‌ల్ని పరిశీలిస్తే... పిచ్‌ బౌలర్లకు, బ్యాటర్లకు సమాన అవకాశాలు కల్పించింది. మూడు మ్యాచ్‌ల్లో 200 పైచిలుకు స్కోర్లు నమోదయ్యాయి. తక్కువ స్కోర్ల మ్యాచ్‌ (గుజరాత్‌ 89 ఆలౌట్‌; ఢిల్లీ 92/4) కూడా ఇక్కడే నమోదైంది. మ్యాచ్‌కు వర్ష సూచన లేదు.

26: ఐపీఎల్‌లో ఇప్పటి వరకు సన్‌రైజర్స్, నైట్‌రైడర్స్‌ జట్లు ముఖాముఖిగా 26 సార్లు తలపడ్డాయి. 17 మ్యాచ్‌ల్లో నైట్‌రైడర్స్‌... 9 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌ గెలుపొందాయి. ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు ఒకసారి పోటీపడగా నైట్‌రైడర్స్‌ నాలుగు పరుగుల తేడాతో నెగ్గింది. నైట్‌రైడర్స్‌పై సన్‌రైజర్స్‌ అత్యధిక స్కోరు 228, అత్యల్ప స్కోరు 116 కాగా... సన్‌రైజర్స్‌పై నైట్‌రైడర్స్‌ అత్యధిక స్కోరు 208, అత్యల్ప స్కోరు 101.  
 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
IPL 2024
first qualifier
sunrisers hyderabad
Kolkata Knight Riders
play offs
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

సన్‌రైజర్స్‌కు ఆడేందుకు పాక్‌ ఆటగాడికి అనుమతి

సన్‌రైజర్స్‌కు ఆడేందుకు పాక్‌ ఆటగాడికి అనుమతి

ముంబైకి సూర్య గుడ్‌బై!.. గంభీర్‌తో కలిసి ఆ జట్టులోకి?!

ముంబైకి సూర్య గుడ్‌బై!.. గంభీర్‌తో కలిసి ఆ జట్టులోకి?!

కావ్యా మారన్‌పై SRH ప్లేయర్‌ సంచలన ఆరోపణలు!

కావ్యా మారన్‌పై SRH ప్లేయర్‌ సంచలన ఆరోపణలు!

PSL: తప్పు ఒప్పుకొన్న పాక్‌ బోర్డు.. ఊహించని ట్విస్ట్‌!

PSL: తప్పు ఒప్పుకొన్న పాక్‌ బోర్డు.. ఊహించని ట్విస్ట్‌!

PSL: పిరికిపందలు.. పాక్‌ క్రికెట్‌ బోర్డుకు దిమ్మతిరిగే కౌంటర్‌

PSL: పిరికిపందలు.. పాక్‌ క్రికెట్‌ బోర్డుకు దిమ్మతిరిగే కౌంటర్‌

రఫ్ఫాడించిన రింకూ

రఫ్ఫాడించిన రింకూ

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.