Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

Viral Videos: నాటీ జడేజా.. తెలుగు మాట్లాడిన గిల్‌.. బుమ్రాను బయపెట్టిన లేడీబర్డ్స్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Jul 11, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
njna.jpg

భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య లార్డ్స్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌ తొలి రోజు ఆటలో కొన్ని ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. టీమిండియా కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌.. యువ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డిని "బౌలింగ్‌ బాగుందిరా మావా" అంటూ తెలుగులో ప్రశంసించాడు. 

ఆట చివర్లో లేడీబర్డ్స్‌ (ఆరుద్ర పురుగులు) మైదానాన్ని ఆవహించి ఆటగాళ్లను తెగ ఇబ్బంది పెట్టాయి. రూట్‌ 99 పరుగుల వద్ద ఉండగా రవీంద్ర జడేజా తనదైన శైలిలో "నాటీ" పనులు చేశాడు. ఇవే కాకుండా నిదానంగా ఆడుతున్న ఇంగ్లండ్‌ బ్యాటర్ జో రూట్‌ను సిరాజ్‌ "బజ్‌బాల్‌ ఏది" అంటూ రెచ్చగొట్టాడు. మొత్తంగా తొలి రోజు ఆట ఆసక్తికరంగా సాగింది.


బౌలింగ్‌ బాగుందిరా మావా..!
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌.. తమ ఇన్నింగ్స్‌ను 13 ఓవర్ల వరకు సజావుగా సాగించింది. అయితే అప్పటివరకు స్థిరంగా సాగిన ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి బౌలింగ్‌ ధాటికి ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. నితీశ్‌ 14వ ఓవర్‌ మూడో బంతికి బెన్‌ డకెట్‌, ఆరో బంతికి జాక్‌ క్రాలేను ఔట్‌ చేసి ఇంగ్లండ్‌ను కష్టాల్లోకి నెట్టాడు.

GILL SPEAKING TELUGU TO NITISH KUMAR REDDY. 😂🔥 pic.twitter.com/NG5buxINBG

— Johns. (@CricCrazyJohns) July 10, 2025

ఈ క్ర‌మంలో నితీశ్‌ను భార‌త కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ తెలుగులో ప్రత్యేకంగా అభినందించాడు. 'బౌలింగ్ బాగుందిరా మావ' అంటూ ప్ర‌శంసించాడు. అత‌డి మాట‌లు స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది.


బజ్‌బాల్‌ ఏది..?
టీమిండియా స్టార్‌ పేసర్‌ మ‌హ్మ‌ద్ సిరాజ్ మ‌రోసారి త‌న నోటికి ప‌నిచెప్పాడు. తొలి రోజు ఆట‌లో ఇంగ్లండ్ సీనియ‌ర్ బ్యాట‌ర్ జో రూట్‌ను స్లెడ్జింగ్ చేశాడు. ఇన్నింగ్స్‌ 31 ఓవ‌ర్ వేసిన సిరాజ్.. అద్బుత‌మైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి రూట్‌ను ఇబ్బందిపెట్టాడు. 

Siraj - "Bazball, Comeon I want to see it". 🥶🔥

- It's fun at Lord's....!!! pic.twitter.com/7Ma3OiRPc2

— Johns. (@CricCrazyJohns) July 10, 2025

ఆ ఓవ‌ర్‌లో ఆరు బంతులు ఎదుర్కొన్న రూట్ క‌నీసం ఒక్క ప‌రుగు కూడా చేయ‌లేక‌పోయాడు. దీంతో ఓవ‌ర్ పూర్తియ్యాక రూట్ వ‌ద్ద‌కు సిరాజ్ వెళ్లి "ద‌మ్ముంటే బాజ్‌బాల్ ఇప్ప‌డు ఆడండి. నేను చూడాల‌నుకుంటున్నాను" అని సీరియస్‌గా అన్నాడు. ఇదంతా స్టంప్ మైక్‌లో రికార్డు అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది.


బుమ్రాను బయపెట్టిన లేడీబర్డ్స్‌
తొలి రోజు ఆట చివర్లో (81వ ఓవర్‌) మైదానంలో ఆటగాళ్లపై లేడీబర్డ్స్‌ (ఆరుద్ర పురుగులు) దాడి చేశాయి. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు చాలా అసౌకర్యానికి గురయ్యారు. ముఖ్యంగా టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా చాలా ఇబ్బంది పడ్డాడు. పదునైన బంతులతో ప్రత్యర్ధి బ్యాటర్లను భయబ్రాంతులకు గురి చేసే బుమ్రా లేడీబర్డ్స్‌ దెబ్బకు భయపడినట్లు కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్‌మీడియాలో వైరలవుతోంది.

నాటీ జడేజా..!
మైదానంలో సరాదాగా ఉండే రవీంద్ర జడేజా తొలి రోజు ఆట చివరి ఓవర్‌లో జో రూట్‌ను తనదైన శైలిలో ఆటపట్టించాడు. ఆకాశ్‌దీప్‌ బౌలింగ్‌లో రూట్‌ 98 పరుగుల వద్ద ఓ పరుగు తీసి సెంచరీ పరుగు కోసం​ చూస్తుండగా జడేజా అతన్ని ఆటపట్టించాడు. జడేజా తనదైన శైలిలో రూట్‌తో చతుర్లాడిన సన్నివేశాలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి.  

JADEJA HAVING FUN WITH ROOT IN THE FINAL OVER 😂🔥 pic.twitter.com/zLd6ul83X9

— Johns. (@CricCrazyJohns) July 10, 2025

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ 4 వికెట్ల నష్టానికి 251 పరుగులు (83 ఓవర్లలో) చేసింది. జో రూట్‌ 99 (191 బంతుల్లో 9 ఫోర్లు), కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ 39 పరుగులతో (102 బంతుల్లో 2 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో జాక్‌ క్రాలే 18, బెన్‌ డకెట్‌ 23, ఓలీ పోప్‌ 44, హ్యారీ బ్రూక్‌ 11 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో నితీశ్‌ కుమార్‌ రె​డ్డి 2, బుమ్రా, రవీంద్ర జడేజా తలో వికెట్‌ తీశారు.

 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
India vs England
Lords test
viral videos
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

గుర్నూర్‌ బ్రార్‌పై క్రమశిక్షణ చర్యలు

గుర్నూర్‌ బ్రార్‌పై క్రమశిక్షణ చర్యలు

ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన ధోని

ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన ధోని

చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్‌

చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్‌

భారత్‌పై గెలుపు తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్లకు 'ఆ పార్టీకి' అనుమతి

భారత్‌పై గెలుపు తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్లకు 'ఆ పార్టీకి' అనుమతి

టీమిండియా ఆటతీరుపై శ్రేయస్‌ ఆగ్రహం

టీమిండియా ఆటతీరుపై శ్రేయస్‌ ఆగ్రహం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.