Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

బోణీ బాగుండాలి

Sports Sakshi User Sakshi Sakshi Time Oct 4, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
india.jpg

మహిళల టి20 ప్రపంచకప్‌లో నేడు భారత్‌ తొలి మ్యాచ్‌

న్యూజిలాండ్‌తో మొదటి పోరు 

రాత్రి గం. 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్, డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం  

దుబాయ్‌: తొమ్మిదో ప్రయత్నంలోనైనా ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న భారత మహిళల జట్టు టి20 ప్రపంచకప్‌ టైటిల్‌ వేటను నేడు ఆరంభించనుంది. తొలి మ్యాచ్‌లో పటిష్టమైన న్యూజిలాండ్‌ జట్టుతో టీమిండియా తలపడనుంది. ఇప్పటి వరకు జరిగిన ఎనిమిది టి20 ప్రపంచకప్‌లలో భారత్‌ ఒక్కసారి మాత్రమే ఫైనల్‌ (2020లో) చేరి రన్నరప్‌గా నిలిచింది. 

ఈసారి మాత్రం కొత్త చరిత్ర తిరగరాయాలని హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బృందం పట్టుదలతో ఉంది. గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా శుక్రవారం జరగనున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ జట్టుతో టీమిండియా తలపడనుంది. గత ఏడాది వరల్డ్‌కప్‌ సెమీఫైనల్లో ఆ్రస్టేలియా చేతిలో ఓడి ఇంటిదారి పట్టిన టీమిండియా ఈసారి కప్‌తో తిరిగి రావాలంటే శుభారంభం లభించాలి. 

ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) పురుషుల టి20 ప్రపంచకప్‌లో రోహిత్‌ శర్మ సారథ్యంలోని భారత జట్టు విజయం సాధించగా... ఇప్పుడు అదే బాటలో తొలిసారి ‘విశ్వ కిరీటం’ దక్కించుకోవాలని హర్మన్‌ప్రీత్‌ జట్టు తహతహలాడుతోంది. టి20 ఫార్మాట్‌లో ప్రపంచకప్‌ ప్రవేశ పెట్టినప్పటి (2009) నుంచి భారత జట్టులో కొనసాగుతున్న 35 ఏళ్ల హర్మన్‌ప్రీత్‌ కౌర్‌... జట్టును ఎలా నడిపిస్తుందనేది ఆసక్తికరం.  

టాపార్డర్‌ రాణిస్తేనే! 
అంతర్జాతీయ స్థాయిలో గొప్ప విజయాలు సాధిస్తున్న భారత మహిళల జట్టు ఐసీసీ టోర్నీల్లో మాత్రం గెలుపు గీత దాటలేకపోతోంది. ఒత్తిడిని ఎదుర్కోలేకపోవడం, ఆటలో కీలక దశలో పట్టు సడలించడం వంటి చిన్న చిన్న తప్పిదాలకు భారీ మూల్యం చెల్లించుకుంటోంది. ఇటీవల ఆసియా కప్‌లో అద్వితీయ ప్రదర్శన కనబర్చిన టీమిండియా... శ్రీలంకతో ఫైనల్లో అనూహ్యంగా తడబడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. దీంతో లోపాలను గుర్తించిన కోచింగ్‌ బృందం జట్టుకు ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహించింది. 

బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో ప్లేయర్ల ఫిట్‌నెస్, ఫీల్డింగ్‌ను మరింత సానబెట్టింది. అదే సమయంలో మానసిక దృఢత్వం కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించింది. స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్, రిచా ఘోష్, దీప్తి శర్మతో భారత బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా కనిపిస్తోంది. గత ఐదు మ్యాచ్‌ల్లో మూడు అర్ధశతకాలు సాధించిన స్మృతి మంధాన ఆసియా కప్‌లో అదరగొట్టింది. 

స్మతి అదే జోరు కొనసాగించాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆశిస్తోంది. ఆమెతో పాటు మిగిలిన ప్లేయర్లు సత్తా చాటాల్సిన అవసరముంది. భారత్‌ను పోలి ఉండే దుబాయ్, షార్జా పిచ్‌లపై మన స్పిన్నర్ల ప్రదర్శన కీలకం కానుంది. దీప్తి శర్మపై భారీ అంచనాలు ఉండగా... శ్రేయాంక, ఆశ శోభన, రాధ కూడా రాణిస్తే జట్టుకు తిరుగుండదు.  

సమతూకంగా న్యూజిలాండ్‌... 
న్యూజిలాండ్‌ జట్టు అటు అనుభవజ్ఞులు ఇటు యంగ్‌ ప్లేయర్లతో సమతూకంతో ఉంది. కెపె్టన్‌ సోఫీ డివైన్, టి20 ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌ సుజీ బేట్స్‌ (36 మ్యాచ్‌ల్లో 1066 పరుగులు), లీ తహుహూ, అమెలియా కెర్‌లతో కివీస్‌ జట్టు పటిష్టంగా ఉంది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో రెండుసార్లు (2009, 2010) రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్‌ జట్టు ఈసారైనా చాంపియన్‌గా అవతరించాలని భావిస్తోంది. 

రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో జరుగనున్న ఈ టోరీ్నలో లీగ్‌ దశలో ప్రతి జట్టు గ్రూప్‌లోని మిగిలిన నాలుగు జట్లతో తలపడనుంది. దీంతో ప్రతి మ్యాచ్‌ కీలకమే కాగా... లీగ్‌ దశ ముగిసేసరికి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించనున్నాయి. 

గ్రూప్‌ ‘ఎ’లో భారత్‌తో పాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌ శ్రీలంక ఉన్నాయి. దుబాయ్‌లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా... పిచ్‌ స్పిన్నర్లకు సహకరించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆల్‌రౌండర్‌ అమెలియా కెర్‌ న్యూజిలాండ్‌ జట్టుకు కీలకం కానుంది. 

తుది జట్లు (అంచనా) 
భారత జట్టు: హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా, రిచా ఘోష్, హేమలత, దీప్తి శర్మ, పూజ వస్త్రకర్, రేణుక, రాధ యాదవ్, ఆశ శోభన. 
న్యూజిలాండ్‌ జట్టు: సోఫీ డివైన్‌ (కెప్టెన్‌), సుజీ బేట్స్, అమెలియా కెర్, బ్రూక్‌ హ్యాలీడే, మ్యాడీ గ్రీన్, ఇజీ గేజ్, కాస్పెరెక్, జెస్‌ కెర్, లీ తహుహూ, ఈడెన్‌ కార్సన్, రోస్‌మేరీ మైర్‌. 

4 న్యూజిలాండ్‌ జట్టుతో భారత్‌ ఇప్పటి వరకు 13 టి20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 4 మ్యాచ్‌ల్లో గెలిచింది. 9 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇక టి20 ప్రపంచకప్‌లో రెండు జట్లు నాలుగుసార్లు తలపడ్డాయి. చెరో రెండు మ్యాచ్‌ల్లో గెలిచాయి. గత రెండు ప్రపంచకప్‌లలో న్యూజిలాండ్‌పై భారతే గెలిచింది.

4/4 భారత జట్టు ఆడిన ఎనిమిది ప్రపంచకప్‌లలో తొలి నాలుగింటిలో ఆడిన తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది. తర్వాతి నాలుగింటిలో ఆడిన తొలి మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేసింది. తొమ్మిదోసారి ఎలాంటి ఫలితం వస్తుందో వేచి చూడాలి. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Women's T20 World Cup 2024
India
New Zealand
ICC
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వన్డే, టీ20 ప్రపంచకప్ ఫార్మాట్లలో భారీ మార్పులు​

వన్డే, టీ20 ప్రపంచకప్ ఫార్మాట్లలో భారీ మార్పులు​

ప్రమాదంలో వన్డే క్రికెట్‌..!

ప్రమాదంలో వన్డే క్రికెట్‌..!

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

జోరు కొనసాగించాలని... 

జోరు కొనసాగించాలని... 

భారత్‌తో అమెరికా రూ.4,560 కోట్ల డీల్‌ 

భారత్‌తో అమెరికా రూ.4,560 కోట్ల డీల్‌ 

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.