లీడ్స్: మహిళల టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించి శుభారంభం చేసిన భారత జట్టు ఇదే జోరును కొనసాగించి మరో భారీ విజయాన్ని అందుకోవాలని భావిస్తోంది. నేడు జరిగే తమ రెండో లీగ్ మ్యాచ్‌లో భారత బృందం బలహీన ప్రత్యర్థి నెదర్లాండ్స్‌తో తలపడనుంది.
ప్రత్యర్థితో పోలిస్తే అన్ని రంగాల్లో ఇండియాదే పైచేయిగా ఉంది. గత మ్యాచ్‌లో చెలరేగిన స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్‌లతో పాటు జెమీమా, షఫాలీలతో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. మరో వైపు నెదర్లాండ్స్ బ్యాటింగ్ ప్రధానంగా కెపె్టన్ బాబెట్ డి లీడ్‌పై ఆధారపడి ఉంది. అనుభవలేమి జట్టులో స్పష్టంగా కనిపిస్తోంది.