Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

ఈ హెడ్‌కోచ్‌ వద్దని పట్టుబట్టిన ఆటగాళ్లు.. తొలగించిన బీసీసీఐ!

Sports Sakshi User Sakshi Sakshi Time Oct 29, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Indian-Cricketers-Once.jpg

గత దశాబ్ద కాలంగా భారత క్రికెట్‌ జట్టు- హెడ్‌కోచ్‌ల మధ్య అనుబంధం బాగా బలపడింది. రవిశాస్త్రి, రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid)లతో మాజీ కెప్టెన్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ సత్సంబంధాలు కొనసాగించారు. ఇక ద్రవిడ్‌ మార్గదర్శనంలో.. రోహిత్‌ సారథ్యంలో టీమిండియా టీ20 ప్రపంచకప్‌-2024 గెలిచిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత ద్రవిడ్‌ హెడ్‌కోచ్‌ పదవి నుంచి వైదొలగగా.. మరో మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ (Gautam Gambhir) భారత జట్టు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. తన వ్యూహాలకు అనుగుణంగా యువ ఆటగాళ్లకు వరుస అవకాశాలు వచ్చేలా చేస్తున్న గౌతీ.. ఇటీవలే శుబ్‌మన్‌ గిల్‌ టెస్టు, వన్డే పగ్గాలు చేపట్టడంలో కీలక పాత్ర పోషించాడు.

ప్రస్తుతానికి కోచ్‌కు- ఆటగాళ్లకు మధ్య చిన్న చిన్న విభేదాలు తప్ప పెద్ద గొడవలేమీ లేనట్లే కనిపిస్తోంది. జట్టుపై పూర్తిగా పట్టు సాధించిన గౌతీ.. అవసరమైన వేళ ఆటగాళ్లకు మద్దతుగా ఉంటూ టీమ్‌ను ముందుకు నడిపిస్తున్నాడు.

పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా వివాదం
మరి గతంలో ఓ హెడ్‌కోచ్‌కు- ఆటగాళ్లకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా వివాదం రాజుకుందని తెలుసా?.. మీరు ఊహించినట్లుగా ఇది గ్రెగ్‌ చాపెల్‌- సౌరవ్‌ గంగూలీ ఎపిసోడ్‌ గురించి కాదు. భారత వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ హీరోకు- దిగ్గజ ఆటగాళ్లకు మధ్య జరిగిన గొడవ.. ఇంతకీ ఏంటీ విషయం?!

కపిల్‌ దేవ్‌ కెప్టెన్సీలో వన్డే వరల్డ్‌కప్‌-1983 నెగ్గిన జట్టులో సభ్యుడైన మదన్‌ లాల్‌.. 1996- 97 మధ్య కాలంలో టీమిండియా హెడ్‌కోచ్‌గా పనిచేశాడు. ఈ క్రమంలో భారత జట్టు శ్రీలంక పర్యటనలో ఉండగా.. మదన్‌ లాల్‌ (Madan Lal) నాడు టీమ్‌లో ఉన్న కొందరు ఆటగాళ్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

విఫలం అవుతావని చెప్పా
ది హిందూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మదన్‌ లాల్‌ మాట్లాడుతూ.. టీమిండియా ఓటములకు సదరు ఆటగాళ్లే కారణం అనేలా విమర్శలు చేశాడు. అజయ్‌ జడేజా గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నువ్వు బౌలర్‌గా లేదంటే బ్యాటర్‌గా ఆడబోతున్నావా? అనేది ముందుగానే నిర్ణయించుకో అని అతడికి చెప్పాను. ఒక్క మ్యాచ్‌లో సరిగ్గా ఆడకపోతే తర్వాత ఐదు మ్యాచ్‌లలోనూ విఫలం అవుతావని చెప్పా’’ అని మదన్‌ లాల్‌ పేర్కొన్నాడు.

ఆల్‌రౌండర్‌గా రాణించలేడు
మరోవైపు రాబిన్‌ సింగ్‌ను ఉద్దేశించి.. ‘‘చాలానే కష్టపడతాడు కానీ.. అంతర్జాతీయ స్థాయిలో ఆల్‌రౌండర్‌గా రాణించలేడు’’ అని మదన్‌ లాల్‌ అన్నాడు. ఇక సబా కరీం గురించి మాట్లాడుతూ.. ‘‘అతడొక సగటు వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మాత్రమే’’ అని ట్యాగ్‌ ఇచ్చాడు.

కుంబ్లే ‘టర్న్‌’ కాదు.. దానిమీద దృష్టి పెట్టు
అంతేగాకుండా అప్పట్లో టీమిండియా ప్రధాన స్పిన్‌ అస్త్రమైన అనిల్‌ కుంబ్లే గురించి చెబుతూ.. ‘‘అతడి బౌలింగ్‌తో సంతోషంగా లేనని చెప్పా. నువ్వు బంతిని తిప్పడం కంటే లైన్‌ అండ్‌ లెంగ్త్‌ మీదే ఎక్కువగా దృష్టి పెట్టమని చెప్పా’’ అని మదన్‌ లాల్‌ పేర్కొన్నాడు. ఓవరాల్‌గా.. ‘‘మేము గెలవలేకపోతున్నాం. కానీ నేనొక్కడినే ఏం చేయగలను?’’ అంటూ ఆటగాళ్లను టార్గెట్‌ చేశాడు.

ఈ ఇంటర్వ్యూ  తర్వాత భారత క్రికెట్‌ శిబిరంలో కల్లోలం చెలరేగింది. అప్పటి మేనేజర్‌ రత్నాకర్‌ శెట్టి వెంటనే జర్నలిస్టు విజయ్‌ను సంప్రదించి.. మదన్‌ లాల్‌ నిజంగానే ఈ వ్యాఖ్యలు చేశారని నిర్దారించుకున్నాడు.

మాటల్లేవ్‌.. బాయ్‌కాట్‌ చేసేశారు
ఈ నేపథ్యంలో.. మదన్‌ లాల్‌ వ్యాఖ్యలతో తీవ్రంగా నొచ్చుకున్న ఆటగాళ్లు అతడితో చాలా రోజుల పాటు మాట్లాడనే లేదు. నాటి సిరీస్‌లో ఓ వన్డేలో అజయ్‌ జడేజా సెంచరీ చేసిన తర్వాత ఈ విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ మ్యాచ్‌లో మొహమ్మద్‌ అజారుద్దీన్‌ కూడా సెంచరీ చేశాడు. 

వేటు వేసిన బీసీసీఐ
ఆ తర్వాత ఈ హెడ్‌కోచ్‌ వద్దని ఆటగాళ్లు పట్టుబట్టడంతో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) మదన్‌ లాల్‌పై వేటు వేసి అన్షుమాన్‌ గైక్వాడ్‌తో అతడి స్థానాన్ని భర్తీ చేసింది. అలా టీమిండియా హెడ్‌కోచ్‌గా మదన్‌ లాల్‌ పది నెలల పదవీ కాలం వివాదంతో ముగిసిపోయింది. అప్పటి బీసీసీఐ మేనేజర్‌ రత్నాకర్‌ శెట్టి తన ఆటోబయోగ్రఫీ.. ‘ఆన్‌ బోర్డ్‌- మై ఇయర్స్‌ ఇన్‌ బీసీసీఐ’లో ఈ విషయాలను ప్రస్తావించాడు.

చదవండి: కాంట్రాక్టర్‌ నుంచి శ్రేయస్‌ దాకా.. మైదానంలో తీవ్రంగా గాయపడిన క్రికెటర్లు వీరే..!

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
team india
India vs Sri lanka
Madan Lal
anil kumble
Ajay Jadeja
Mohammed Azharuddin
BCCI
Flashback Sports
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

టీమిండియా ఆటతీరుపై శ్రేయస్‌ ఆగ్రహం

టీమిండియా ఆటతీరుపై శ్రేయస్‌ ఆగ్రహం

పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్

పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్

శ్రీలంకకు భారీ షాక్‌!

శ్రీలంకకు భారీ షాక్‌!

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

నితీశ్‌రెడ్డికి గాయం.. ఇంగ్లండ్‌ టూర్‌కు దూరం!

నితీశ్‌రెడ్డికి గాయం.. ఇంగ్లండ్‌ టూర్‌కు దూరం!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.