Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

శుబ్‌మన్‌ గిల్‌ గెలిపించగా...

Sports Sakshi User Sakshi Sakshi Time Jun 14, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
gill.jpg

తొలి వన్డేలో భారత్‌ ఘన విజయం

7 వికెట్ల తేడాతో ఓడిన అఫ్గానిస్తాన్‌ 

వర్షంతో మ్యాచ్‌ 25 ఓవర్లకు కుదింపు

అఫ్గాన్‌తో ఏకైక టెస్టులో సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ రికార్డు విజయం సాధించిన భారత జట్టు... వన్డే సిరీస్‌లోనూ అదే ఆటతీరుతో బోణీ కొట్టింది. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో గుర్బాజ్‌ సెంచరీతో అఫ్గాన్‌ ఓ మాదిరి స్కోరుకు పరిమితం కాగా... అరంగేట్ర బౌలర్లు గుర్‌నూర్‌ బ్రార్, హర్ష్ దూబే చెరో మూడు వికెట్లతో సత్తా చాటారు. అనంతరం ఛేదనలో గిల్‌ కెప్టెన్  ఇన్నింగ్స్‌కు రాహుల్, ఇషాన్‌ మెరుపులు తోడవడంతో టీమిండియా ముందంజ వేసింది.

ధర్మశాల: ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన భారత జట్టు... అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌లో శుభారంభం చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన తొలి పోరులో శుబ్‌మన్‌ గిల్‌ సారథ్యంలోని టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారీ వర్షం కారణంగా మ్యాచ్‌ నిర్ణీత సమయంకంటే నాలుగున్నర గంటలు ఆలస్యంగా ప్రారంభం కాగా... ఆటను 25 ఓవర్లకు కుదించారు. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్‌ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. 

ఓపెనర్‌ రహమానుల్లా గుర్బాజ్‌ (51 బంతుల్లో 102; 8 ఫోర్లు, 8 సిక్స్‌లు) సెంచరీతో కదం తొక్కాడు. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (27; 3 ఫోర్లు), అజ్మతుల్లా (26; 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. ఆడిన తొలి వన్డేలోనే గుర్‌నూర్‌ బ్రార్, హర్ష్ దూబే చెరో 3 వికెట్లు పడగొట్టగా... అర్ష్ దీప్‌ సింగ్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్‌ 22.5 ఓవర్లలో 3 వికెట్లకు 195 పరుగులు చేసింది. 

శుబ్‌మన్‌ గిల్‌ (66 బంతుల్లో 84 నాటౌట్‌; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) కెప్టెన్  ఇన్నింగ్స్‌తో అలరించగా... కేఎల్‌ రాహుల్‌ (19 బంతుల్లో 39 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఇషాన్‌ కిషన్‌ (22 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపులు మెరిపించారు. రోహిత్‌ శర్మ (16; 2 ఫోర్లు, 1 సిక్స్‌), శ్రేయస్‌ అయ్యర్‌ (12; 1 ఫోర్‌) భారీ స్కోరు చేయలేకపోయారు. అఫ్గాన్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్, జియాఉర్‌ రహమాన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.  

గుర్బాజ్‌ సెంచరీ... 
భారీ వర్షం కారణంగా మ్యాచ్‌ను కుదించడంతో... మొదట బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్‌ టి20 తరహా దూకుడు కనబర్చింది. గుర్‌నూర్‌ బ్రార్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో ఇబ్రహీం జద్రాన్‌ (1) అవుట్‌ కాగా... అర్ష్ దీప్‌ సింగ్‌ వరుస ఓవర్లలో సాధిఖుల్లా (0), రహమత్‌ షా (3)ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో అఫ్గాన్‌ జట్టు 26/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్  హష్మతుల్లా అండతో గుర్బాజ్‌ రెచ్చిపోయాడు.  

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన గుర్బాజ్‌... ఎడాపెడా బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. బౌలర్‌తో సంబంధం లేకుండా భారీ షాట్‌లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 25 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న అతడు... 48 బంతుల్లో సెంచరీ మార్క్‌ అందుకున్నాడు. వన్డేల్లో అతడికిది తొమ్మిదో శతకం. ‘టెస్టు మ్యాచ్‌ అనంతరం నా బ్యాటింగ్‌కు సంబంధించి గౌతమ్‌ గంభీర్‌ సర్‌తో చర్చించా.

 షాట్‌ సెలక్షన్‌ విషయంలో గంభీర్‌ సలహాలు పాటించడంతోనే సెంచరీ చేయగలిగా’ అని మ్యాచ్‌ అనంతరం గుర్బాజ్‌ అన్నాడు. నాలుగో వికెట్‌కు 66 బంతుల్లోనే 116 పరుగులు జోడించిన అనంతరం గుర్బాజ్‌ అవుట్‌ కాగా... ఆ తర్వాత మిగిలినవారు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో అఫ్గాన్‌ ఆశించిన స్కోరు చేయలేకపోయింది.  

హర్ష్ దూబే, గుర్‌నూర్‌ అరంగేట్రం...
గత కొంతకాలంగా టీమిండియా నెట్‌ బౌలర్‌గా కొనసాగుతున్న గుర్‌నూర్‌ బ్రార్‌... ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.మ్యాచ్‌ ఆరంభానికి ముందు అతడికి జట్టు కెప్టెన్  శుబ్‌మన్‌ గిల్‌ భారత క్యాప్‌ అందించాడు. దేశవాళీల్లో సత్తాచాటిన స్పిన్నర్‌ హర్ష్ దూబేకు సైతం ఇదే తొలి వన్డే కాగా... అతడికి కేఎల్‌ రాహుల్‌ క్యాప్‌ అందజేశాడు.

1 టీమిండియా తరఫున వన్డే మ్యాచ్‌ ఆడిన అతి పెద్ద (39 సంవత్సరాల 44 రోజులు) వయసు్కడిగా రోహిత్‌ రికార్డు సృష్టించాడు.మొహిందర్‌ అమర్‌నాథ్‌ (39 సంవత్సరాల36 రోజులు) రెండో స్థానానికి చేరాడు.

స్కోరు వివరాలు
అఫ్గానిస్తాన్‌ ఇన్నింగ్స్‌: గుర్బాజ్‌ (బి) నితీశ్‌ రెడ్డి 102; ఇబ్రహీం (సి) గిల్‌ (బి) గుర్‌నూర్‌ 1; సాదిఖుల్లా (ఎల్బీ) (బి) అర్ష్ దీప్ 0; రహమత్‌ షా (సి) హర్ష్ దూబే (బి) అర్ష్ దీప్ 3; హష్మతుల్లా (సి) రాహుల్‌ (బి) హర్ష్ దూబే 27; అజ్మతుల్లా (స్టంప్డ్‌) ఇషాన్‌ (బి) హర్ష్ దూబే 26; నబీ (సి) అర్ష్ దీప్ (బి) నితీశ్‌ రెడ్డి 9; రషీద్‌ (బి) గుర్‌నూర్‌ 9; ఘజన్‌ఫర్‌ (సి) గిల్‌ (బి) హర్ష్ దూబే 0; జియాఉర్‌ (సి) అర్ష్ దీప్ (బి) గుర్‌నూర్‌ 4; సలీమ్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (24.5 ఓవర్లలో ఆలౌట్‌) 194. వికెట్ల పతనం: 1–13, 2–16, 3–26, 4–142, 5–144, 6–172, 7–182, 8–182, 9–193, 10–194. బౌలింగ్‌: అర్ష్ దీప్ 5–0–27–2; గుర్‌నూర్‌ బ్రార్‌ 4.5–0–27–3; ప్రసిధ్‌ 5–0–35–0; హర్ష్ దూబే 5–0–47–3; సుందర్‌ 1–0–19–0; నితీశ్‌ రెడ్డి 4–0–31–2.  

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (రనౌట్‌) 16; గిల్‌ (నాటౌట్‌) 84; ఇషాన్‌ (బి) రషీద్‌ 34; శ్రేయస్‌ (సి) సలీమ్‌ (బి) జియాఉర్‌ 12; రాహుల్‌ (నాటౌట్‌) 39; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (22.5 ఓవర్లలో 3 వికెట్లకు) 195. వికెట్ల పతనం: 1–46, 2–116, 3–142. బౌలింగ్‌: అజ్మతుల్లా 3–0–28–0; జియా ఉర్‌ 4–0–39–1; ఘజన్‌ఫర్‌ 5–0–28–0; సలీమ్‌ 3.5–0–36–0; రషీద్‌ ఖాన్‌ 5–0–37–1; నబీ 2–0–26–0.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Indian team
ODI series
Afghanistan
Shubman Gill
first ODI
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

మిచెల్‌కు గిల్‌ గట్టి సవాల్‌

మిచెల్‌కు గిల్‌ గట్టి సవాల్‌

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

ఆ విషయం చాలా మందికి తెలియదు: వైభవ్‌

ఆ విషయం చాలా మందికి తెలియదు: వైభవ్‌

జయహో...భారత్.. శ్రీలంకపై ఘన విజయం

జయహో...భారత్.. శ్రీలంకపై ఘన విజయం

బుమ్రా పునరాగమనం

బుమ్రా పునరాగమనం

ఘనంగా ముగించారు

ఘనంగా ముగించారు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.